స్వాతంత్య్ర సమరయోధుల భూములకు రెక్కలు?
posted on Aug 8, 2012 8:11AM
ఇప్పటిదాకా స్వాతంత్య్రసమరయోధులకు ఇచ్చిన భూమిని అమ్ముకోవటానికి, ఆక్రమించుకోవటానికి వీలులేనంత పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసేది. అంటే స్వాతంత్య్ర సమరయోధుల భూములకు భద్రత ఎక్కువని అందరూ అనుకునేవారు. ఇక ఈ అభిప్రాయాన్ని రెవెన్యూశాఖ మార్చేసింది. స్వాతంత్య్ర సమరయోధులు సైతం తమ భూములను అమ్ముకోవటానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఆంక్షలు మాత్రం పెట్టింది. భూమి విలువను బట్టి అనుమతి తీసుకుని అమ్ముకునే అవకాశం స్వాతంత్య్ర సమరయోధులకు కల్పించింది. అసలు విషయం ఏమిటంటే విశాఖ జిల్లాలో రెండు కొండలు రెవెన్యూభూమిని స్వాతంత్య్రసమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. అందరు స్వాతంత్య్ర సమరయోధులను ఏకతాటిపైకి తెచ్చి వారినుంచి దాన్ని కొనుగోలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన కొందరు శేఠ్‌లు ప్రయత్నించారు.
ఉడా కూడా స్వాతంత్య్ర సమరయోథుల భూమి కాబట్టి అటువైపు కన్నేత్తి చూడలేదు. ఈ దశలో మూడేళ్ల క్రితమే అడ్వాన్సులు ఇచ్చేసి స్వాతంత్య్రసమరయోధులతో ఖాళీ చేయించి మరీ ఆ భూములను సొంతం చేసుకునేందుకు శేఠ్‌లు కష్టపడ్డారు. చట్టం పటిష్టంగా ఉండటం వల్ల అడ్వాన్సులు తీసుకున్నా యాజమాన్యహక్కు మారదని ఇప్పటిదాకా స్వాతంత్య్రసమరయోధులకే వదిలేసి ఎప్పటికైనా దాన్ని సంపాదించుకోవచ్చని శేఠ్‌లు వెనుదిరిగారు. అయితే తాజాగా ఈ భూములపై వచ్చిన వినతులు పరిష్కరించేందుకు మంత్రి రఘవీరారెడ్డి ఆధ్వర్యాన రెవెన్యూశాఖ సమావేశమై స్వాతంత్య్రసమరయోధుల భూముల విక్రయానికి అనుమతులు ఇచ్చే అవకాశం కల్పించింది. అంటే శేఠ్‌లు విశాఖజిల్లాలోని స్వాతంత్య్రసమరయోథుల భూములను సొంతం చేసుకునే అవకాశం ఏర్పడిరది. అయితే భూమి విలువ 50లక్షల లోపు ఉంటే జిల్లా కలెక్టరు, ఆపైన రెండు కోట్ల రూపాయల లోపు భూమి విలువ ఉంటే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో స్వాతంత్య్రసమరయోథులు ఎక్కువ మంది తమ భూముల అమ్మకం కోసం ధరఖాస్తు చేసుకున్నందున రెవెన్యూశాఖ ఈ విధంగా స్పందించిందని మంత్రి విశదీకరించారు.