పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ చేసే మొదటి పని తెలుసా...?
posted on Nov 22, 2016 @ 9:41AM
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా..? ఈ విషయాలను ట్రంపే స్వయంగా చెబుతున్నాడు. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ ట్రేడ్ (టీపీపీ) డీల్ నుంచి అమెరికా వైదొలగుతుందని... అధ్యక్ష పదవివి చేపట్టగానే, తాను చేసే మొదటి పని ఇదేనని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా ఆయన వెల్లడించారు. కాగా 2015లో 12 దేశాలు టీపీపీ డీల్ కుదుర్చుకున్నాయి. ప్రపంచ మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, మలేషియా, మెక్సికో దేశాలు ఈ డీల్ ను ఆమోదించలేదు. మరోవైపు, ఈ డీల్ నుంచి అమెరికా వైదొలగితే... డీల్ కు అర్థమే లేదని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ట్రంప్ పదవి చేపట్టేంతవరకూ ఆగాల్సిందే.