అటల్, పీవీ.. పోలికలు.. వ్యత్యాసాలు!
Publish Date:Dec 25, 2025
ఒకే నెలలో ఇద్దరు దిగ్గజాల జయంతి, వర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబర్ 25న వాజ్ పేయి జయంతి. ఈ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? అదే పీవీ వర్ధంతి ఎలా జరిగింది? అన్న వ్యత్యాసం చూస్తే.. ముందుగా ఈ ఇద్దరి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి. అటల్ బీహారీ వాజ్ పేయి, పీవీనరసింహరావు ఇద్దరిదీ దాదాపు ఒకటే వయసు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు. 1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బలరాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అటల్ మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ తొలుత రాష్ట్ర రాజకీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
అటల్, పీవీ ఇద్దరూ కవులే. మంచి వక్తలే. అయితే వాజ్ పేయి ప్రసంగాలకు వచ్చిన గుర్తింపు పీవీకి రాలేదనే చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉండటం, అది కూడా ప్రతిపక్షంలో ఉండటంతో .. ఆయన వక్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది. అటల్ ప్రసంగిస్తుంటే, అందరూ శ్రద్ధగా వినేవారు. కోట్లాది మంది అటల్ ప్రసంగాలకు అభిమానులయ్యారు. ఇక్కడ అధికార విపక్షాలన్న తేడా కనిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వల్లో ఏమో ఇందిర ముందు మరే నాయకత్వం ఎదగడానికి వీలు లేని పరిస్థితుల మధ్య 1991 తర్వాత మాత్రమే పీవీ ప్రసంగాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడ ఈ ఇద్దరికీ మధ్య గల మరో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు. వాజ్ పేయిని ఆయన పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ పరిస్థితి అలా లేదు. ఆయనకు పార్టీ ఇచ్చిన గౌరవం అంతంత మాత్రమే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని 4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.
ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు. డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.
అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ఏపీ అమరావతిలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేయడంతో పాటు.. విగ్రహావిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి మాధవ్ వంటి బీజేపీ నేతలతో పాటు.. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు హాజరయ్యారు. ఇదిలా ఉంటే శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఇప్పటికే ధర్మవరం నుంచి ఏలూరు వరకూ పలు ప్రాంతాల్లో అటల్ జీ విగ్రహావిష్కరణలు చేశారు. అటల్- మోడీ సుపరిపాలనా యాత్ర సైతం నిర్వహించి అటల్ ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విషయంలో ఆయన వర్ధంతి సందర్భంగా ఖర్గే చిన్న ట్వీట్ తో సరిపెట్టారు. దటీజ్ డిఫరెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్ బీజేపీ అంటూ పలువురు ఈ వ్యత్యాసాలను ఎత్తి చూపుతున్నారు.
అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు
Publish Date:Dec 25, 2025
కర్ణాటకం.. ఎండ్ లెస్!
Publish Date:Dec 25, 2025
మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన
Publish Date:Dec 24, 2025
మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?
Publish Date:Dec 24, 2025
మోడీ మౌనం దేనికి సంకేతం?
Publish Date:Dec 24, 2025
బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.
ఇప్పటికీ మణిపూర్ మరక అలాగే ఉంది. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించినపుడు కూడా ఎలాంటి స్పందనా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్యవహారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే.. ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి కీలకాంశాలు సభలో అసలు చర్చకే రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాతరంపై గంటల తరబడి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధర్మం కోసం.. దేశ భక్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక యూనస్ ప్రభుత్వం నడుస్తోంది. ఆయన ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూనస్ సర్కార్ ప్రజా ప్రభుత్వం కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.
అదలా ఉంటే.. యూనస్ అత్యంత ప్రమాదకరమైన భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించే యత్నం చేస్తున్నారు. చైనాతో కలసి బారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును సజీవ దహనం చేసిన ఘటనలో కేంద్రం కనీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్కడేగానీ ఆయన పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అతడిని సజీవదహనం చేశారు. అలాంటి బంగ్లా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?
Publish Date:Dec 23, 2025
అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందే ?
Publish Date:Dec 23, 2025
కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?
Publish Date:Dec 22, 2025
నక్సల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా?
Publish Date:Dec 21, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?
Publish Date:Dec 24, 2025
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి. భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా, సాంప్రదాయంగా జరుగుతాయి. అయితే ఈ వేడుకలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. వారి వారి సాంప్రదాయాల పరంగా మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో కూడా క్రిస్మస్ లో కూడా ఒక ప్రత్యేకత, వింత ఉంది. అదే శాంతా క్లాజ్.. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ వేడుక వచ్చిందంటే పిల్లలు అందరూ శాంతా క్లాజ్ కోసం ఎదురు చూస్తారు. శాంతా క్లాజ్ పిల్లలకు బోలెడు బహుమతులు తెస్తాడని నమ్ముతారు. అయితే ఐస్లాండ్ లో మాత్రం శాంతా క్లాజ్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలలో శాంతా క్లాజ్ ఒక్కడే.. కానీ ఐస్లాండ్ లో మాత్రం 13మంది శాంతా క్లాజ్ లు ఉంటారట.
జానపద కథ ఏం చెప్తుందంటే..
ప్రతి దేశంలో జానపద కథలు ఉన్నట్టే ఐస్లాండ్ లోనూ జానపద కథలు ఉన్నాయి. అక్కడి జానపద కథల ప్రకారం అక్కడి శాంతా క్లాజ్ లను యూల్ లాడ్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. ఈ 13మంది గురించి మొదటగా 1862లో ప్రస్తావించబడిందట. రచయిత జాన్ అర్నాసన్ ప్రసిద్ధ గ్రిమ్స్ నుండి ప్రేరణ పొంది జానపద కథలను సేకరించడం మొదలు పెట్టాడు. 1932లో ఐస్లాండిక్ కవి జోహన్నెస్ ఉర్ కోట్లమ్ యూల్ లాడ్స్ అనే కవితను క్రిస్మస్ ఈజ్ కమింగ్ అనే పుస్తకంలో ప్రచురించాడు. ఇది వారి పేర్లు, వ్యక్తిత్వాలతో పాటు వారి గురించి ఒక నమ్మకాన్ని సెట్ చేసింది.
యూల్ లాడ్స్ ప్రకారం 13మంది అన్నదమ్ములు గ్రైలా అనే ట్రోల్ కు జన్మించారట. కానీ కాలక్రమేణా వారి పిల్లలు, వారసులు అందరూ ఉదారంగా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్లారచ. దీని వల్ల వారికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. చివరకు వారికి ఏమీ మిగలకుండా పోయిందట. క్రిస్మస్ కు ముందు ప్రతి రాత్రి ఈ 13మంది యూల్ లాడ్స్ పిల్లలను అందరినీ సందర్శిస్తారట. ఐస్లాండ్ జానపద కథల ప్రకారం, ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన ప్రతి చిన్న పిల్లవాడు యూల్ లాడ్స్ నుండి ఒక చిన్న బహుమతి పొందుతాడట. అంతేకాదు.. అల్లరి పిల్లలకు పచ్చిగా ఉన్న లేదా కుళ్లిన బంగాళాదుంపను ఇస్తారట. అక్కడి పిల్లలు క్రిస్మస్ బహుమతి స్వీకరించడానికి కిటికి గుమ్మం మీద ఒక షూ ను ఉంచుతారట. ఇదీ ఐస్లాండ్ లో క్రిస్మస్ విశేషం.
*రూపశ్రీ.
తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!
Publish Date:Dec 23, 2025
గణితంతో గమ్మత్తులు చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు..!
Publish Date:Dec 22, 2025
మీకు తెలుసా? రిలేషన్ నిలబడటానికి ఈ అబద్దాలు చెప్పినా అస్సలు తప్పు లేదట..!
Publish Date:Dec 22, 2025
భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..!
Publish Date:Dec 20, 2025
ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!
Publish Date:Dec 24, 2025
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి, అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు. అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే..
రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం..
నిమ్మకాయ నీరు క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు.
మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు?
చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
ఎలక్ట్రోలైట్ అంటే..
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్, బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు. ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి.
ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత..
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల తలనొప్పి, గుండె లయ గందరగోళంగా ఉండటం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 23, 2025
అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?
Publish Date:Dec 22, 2025
ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!
Publish Date:Dec 20, 2025
ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!
Publish Date:Dec 19, 2025