అక్రమార్కులకు అయ్యప్ప అండగా ఉంటాడా?
posted on Aug 3, 2012 @ 11:48AM
గత తొమ్మిదినెలలుగా చంచల్‌గూడ జైలులో మగ్గిన కోనేరు ప్రసాద్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా అయ్యప్ప మహిమేనని ఆయన నమ్ముతున్నారు. అయ్యప్ప భక్తుడైన ప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు. జైలులో కూడా అయ్యప్ప దీక్ష చేశారు. ఈయన అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడా జైలులో ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డికి సహకరించారని ఆరోపణలున్నాయి. అందుకే ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ప్రసాద్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కోసం ప్రసాద్ 5లక్షల రూపాయల విలువైన బాండ్లను పూచికత్తుగా పెట్టారు. వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్న హైకోర్టు ఇతరప్రాంతాలకు వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. రాష్ట్రం విడిచి వెడితే ఆయన బెయిల్ రద్దు అవుతుంది ఈ విషయాన్ని స్పష్టంగా కోర్టు ప్రకటించింది. దీంతో ప్రసాద్ షరతులతో కూడిన బెయిల్‌ను పొందేందుకు సిద్ధమయ్యారు. అలానే కోనేరు ప్రసాద్ తన బంధువులను, సిబ్బందిని, సన్నిహితులను కలవటానికీ ఇదో పెద్ద అవకాశంగా భావించి బెయిల్ ద్వారా బయటికి వచ్చారు. అయితే కోర్టు కేసు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. గతంలో అయ్యప్పమాల వేసుకున్న కోనేరుకు ఒకసారి బెయిల్‌మంజూరైంది. ఈసారి ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరైంది. అయ్యప్ప మహిమ వల్లే తనకు బెయిల్ వచ్చిందని, ఆయన మహిమతోనే త్వరలోనే నిర్దోషిగా విడుదల అవుతానని ప్రసాద్ నమ్ముతున్నారు.