ఒత్తిడిని వదిలించే కౌగిలింత!
posted on Jul 13, 2022 @ 3:20PM
మనసు బాగోబోతే తల్లి దగ్గరకో, తండ్రి దగ్గరకో వెళ్లి కాసేపు సమయం గడపడం అనాదిగా మన ఇళ్లల్లో వున్న గొప్ప థెరపీ. కానీ ఈ మధ్య కాలం వరకూ అది నిజంగానే గొప్ప థెరపీ అన్న సంగతి మనకు తెలియ లేదు. ఇప్పుడు విదేశాల్లో కొత్తగా అదే కొత్తగా కడ్లింగ్ థెరపీ అనే పేర వినపడుతోంది.
వృత్తి, ఉద్యోగాల్లో మానసిక వొత్తిడికి గురవుతున్నవారి సంఖ్య ఈ రోజుల్లో క్రమేపీ పెరుగుతోంది. వీరిలో తొంభై శాతం మంది ఆస్పత్రులు, డాక్టర్లు, నిపుణుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో అనేకమంది నిపుణులు అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంటారు. వాళ్లంతా సమాజం లో గౌరవాన్ని అందుకునే ప్రొఫెషనలిస్టులు.
కొందరు బాడీ మసాజింగ్, మరికొందరు ఫిజియో థెరపిస్టు లు, ఇంకొందరు సైకాలజిస్టులు. కానీ చిత్రంగా ట్రెవర్ హూటన్ వృత్తి వేరు. వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఈయన్ని కడ్లర్ అంటారు. అంటే శారీరక, మాన సిక వొత్తిడికి గురయినవారిని కౌగిలించుకుని వారి బాధని నివృతి చేస్తారట! ఇద్దరి కౌగిలింతని ఖచ్చితం గా సెక్స్‌పరంగానే చూసే ఈ రోజుల్లో ఇలాంటి థెరపీ కూడా వుందా అంటే వుందనే అనాలి. దీనికి సెక్స్‌కి అస్సలు సంబంధం లేదంటున్నారు ప్రముఖ కడ్లర్ హూటన్.
కడ్లర్ అనే ప్రొఫెషన్ విదేశాల్లో ఇటీవలే వినపడుతోన్న కొత్త థెరపీ. దీన్నే థెరాప్టిక్ అనీ అంటారు. ఇపుడు దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీని వల్ల చాలామంది తమ వర్క్ స్ట్రెస్ నుంచి బయటపడుతున్నా మనీ అంటున్నారు. ఇవాళిటిదాకా సాధారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయినవారిని కనీసం అరగంట మెడిటేషన్ చేయమని టీవీల్లో, బయట ప్రసంగాల్లో చాలామంది ఊదరగొడుతున్నారు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ధ్యానానికి డిమాండ్ అమాంతం పెరిగింది. కోట్లమంది తూ.చ తప్పక పాటి స్తున్నారు. ఎంతో మంచి ఫలితాలనిస్తున్నాయంటున్నారు.
ఇప్పటి తాజాగా వచ్చిన థెరపీ కడ్లర్ థెరపీ. అసలీ పేరు వింటేనే ఏదో చిత్రంగానూ వుంది. అబ్బే అదెలా చేస్తారని మొహం చిట్లించుకోవడమూ జరుగుతోంది. కారణం మనం పుట్టి బుద్ధెరిగి ఇలాంటి కౌగిలి థెరపీల మాటే వినలేదు మరి. కానీ ఇది అందరూ అనుకుంటున్నట్టు, అనుమానిస్తున్నట్టుగా ఏమీ వుండదు. దీన్ని ఒకరిద్దరి సమక్షంలోనే, దుస్తులతోనే చేసే థెరపీ అంటున్నారు హూటన్. అయితే ఇది కూడా ధ్యానంతో సమానమేనంటున్నారాయన. మాటలు వుండవు, కేవలం సున్నిత కౌగిలి మాత్రమే. అదీ ఒక గంటసేపు. కేవలం ఒంటరిగా కళ్లు మూసుకుని సేద తీరడం లాంటిది. అయితే దీనివల్ల ఎంతో ప్రయో జనం వుంటుందిట. అన్నట్టు ఈ థెరపిస్టు గంటకు ఏడువేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట. అదొక్కటే ఇబ్బంది కరం. గంట పట్టుకుని వున్నందుకు అంత చెల్లించాలా అనే అనుమానాలు మనలానే హూటన్ పేషెంట్లు ముందు ఇబ్బందిగా ప్రశ్నించారు. కానీ ఆయన థెరపీ చాలా గొప్పగా వుందని గ్రహించినవారు ఆ ఫీజు తప్పనిసరిగనుక ఓకే అనేస్తున్నారు. దీనివల్ల ఇతరులతో స్నేహసంబంధాలు కూడా బలపడుతు న్నాయనే అభిప్రాయాలుయి.
ఇప్పటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో యువత ఎంతో మానసిక, శారీరక శ్రమకు గురవుతున్నారు. ఈ రోజుల్లో ఆహార పద్దతులు, జీవనవిధానంలో వచ్చిన, వస్తున్న మార్పులతో ఎందరో మంచి ఆరోగ్యానికి ఆస్పత్రు లు, డాక్టర్ల మీదా, నిపుణుల మీదా ఆధారపడుతూనే వున్నారు. అందులోనూ అనేక రకాల వైద్య విధానా లను అనుసరించడం చూస్తున్నాం. అయితే ఈ కడ్లర్ నిపుణులు ఎంతవరకూ నిజంగా మన దేశ ప్రజ లకు యువతకు ఉపయోగపడతారన్నది అనుమానమే.