కాంగ్రెస్, టి.డి.పిల కొంపముంచిన సెంటిమెంట్
posted on Jun 15, 2012 @ 12:08AM
అందరూ ఊహించినట్లే అత్యధిక స్థానాలను గెలుచుకొని వైసిపి తనప్రత్యేకతను చాటుకుంది. అధికారపక్షం, ప్రతిపక్షం విరుచుకుపడ్డా, సీబీఐ, ఎన్ పోర్స్ మెంట్స్ చుక్కలు చూపినా మొక్కవోని ఆత్మస్తర్యంతో తను ఓదార్పు యాత్ర విజయవంతంగా నడిపించి ప్రజల్లో తనదైన ముద్రవేసుకొన్న జగన్ వైయస్సార్ ప్రజల హదయాల్ల్లో ఉన్నారని నిరూపించారు. ఒంటిచేత్తో పార్టీని నడిపిన తీరు కాకలు తీరిన రాజకీయనాయకులకు మింగుడు పడటంలేదు. తన దారి రహదారి అని నిరూపించుకున్న బాలచంద్రుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. జగన్, విజయమ్మ వైయస్సార్ మరణంతరువాత వైసిపి నేలకొల్పి కాంగ్రెస్ నుండి బయటపడి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు ఒక ప్రముఖ జాతీయ స్థాయి పత్రిక విశ్లేషణలో వైయస్సార్ ఫ్యామిలీని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలో ఏకాకిని చేసి వేధిస్తున్నారే భావనలో ప్రజలు వుండటం వల్ల కలిగే సింపతీ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలవటానికి కరణముయిందని తెలిపింది. అయినా అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిరధమహారదులను పంపికూడా కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచి అబాసుపాలయింది.
వైయస్సార్ బ్రతికి ఉండగా నోరుమెదపని నాయకులు చనిపోయిన తర్వాత ఆయన అధికార దుర్వినియోగాన్ని తూర్పారబట్టటం ప్రస్తుత నాయకుల నైతికతను ప్రజలు సహించలేక పోయారు. పరకాలలో తెలంగాణ సెంటిమెంటును టీ.ఆర్.యస్ ప్రజలకు నెత్తికెక్కించినా కొండా సురేఖ నేక్ టు నెక్ పోటీ ఇచ్చి ఓడి గెలిచారు. టీ.ఆర్.యస్ కు గాని హరీస్ రావుకి గాని అంతగా అనందం ఇవ్వని గెలుపుగానే దీనిని భావించవచ్చు.
రామచంద్రాపురంలో పిల్లి సుభాస్ చంద్రబోస్ భార్య పై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు అక్కడ కాపులకు ఉన్న పట్టు వల్లే ఆయన ఓడిపోవడం జరిగింది గాని అది వైసిపి ఓటమిగా అంగీకరించ వలసిన అవసరం లేదని రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు సమాజిక వర్గ ఓట్లు కూడా పనిచేసాయి.
అవినీతి గురించి అరిచి గోలచేసిన చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాని రెండు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. పదిచోట్ల మాత్రం రెండో స్థానంలో నిలచింది. వాడ వాడ తిరిగిన చంద్రబాబుకు తీవ్ర నిరాశే మిగిలింది. వైసిపి కి ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లే అన్నా ఎవరూ వినిపించుకోలేదు. బాబుకు అండగా నిలచిన రెండు పత్రికల పోరాటం కూడా భూడిదలో పోసిన పన్నీరుగా మిగిలింది. ఏది ఏమైనా ఇదివరకటి కంటే ఎక్కువ శాతం ఓట్లు గెలుచుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి కాస్త ఊరట కలిగిస్తుంది. చిరంజీవి ఆర్బాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ ఆతర్వాత ఏ సామజిక న్యాయం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికయి తద్వారా ఖాళీ అయిన తిరుపతి సీటును కూడా గెలిపించుకోలేక పోయారు. చిరంజీవి స్వకుంటుంబానికే తప్ప ప్రజలకు దగ్గర కాలేక పోయారని చెప్పక తప్పదు. పరకాలలో బీరాలు పలికిన బిజెపి నాయకులతో పాటు సుష్మాస్వరాజ్ వచ్సినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోవడం కోసమెరుపు.