పురందేశ్వరి గట్టి నమ్మకం
posted on Apr 17, 2011 @ 3:55PM
విజయనగరం: కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి ఆదివారం విజయనగరం జిల్లాలో మాట్లాడుతూ చెప్పారు. ప్రజలు కాంగ్రెసు పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గౌరవిస్తున్నారని అన్నారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని చెప్పారు. కాగా కడపలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెసు ఖచ్చితంగా గెలుస్తుందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ మెజార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ వస్తుందని తాను చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని వారు రెండు లక్షల మెజార్టీ వస్తుందంటే దానిపై తాను సవాల్ చేశానని, కానీ జగన్ గెలుస్తాడని చెప్పలేదన్నారు. మంత్రి డిఎల్ ఖచ్చితంగా గెలుపొందుతారని అన్నారు.