కేంద్ర కేబినేట్ లో చిరుకు స్థానం లభించడం ఖాయమా?
posted on Jun 15, 2012 9:07AM
ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తుకు కీలకమవుతోంది, ఎన్నికల ప్రచారంలో సిఎం కిరణ్ కుమార్ తోనూ, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణతోనూ, కేంద్ర నాయకులు వాయలార్ రవితోనూ, గులాంనబీ ఆజాద్ తోనూ కలిసి పనిచేసిన చిరంజీవి ఇమేజ్ గురించి సోనియా అడిగి తెలుసుకున్నారట. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని తేలిన ఈ తరుణంలో కోస్తాలో ఓ రెండు స్థానాల్లో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే చిరంజీవికి కేంద్రకేబినేట్ లో పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినది మొదలు చిరంజీవి కూడా ఎప్పటికప్పుడు కేంద్రస్థాయి నాయకులకు అందుబాటులో ఉంటున్నారట. తన కుమారుని వివాహానికి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని ఆహ్వానించిన చిరంజీవి అక్కడ పలుకుబడి పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. సిఎం, బోత్సాలతో పనిలేకుండా కాంగ్రెస్ అధిస్థానం చిరంజీవిని ప్రత్యేకంగా చూసుకుంటోంది. అందుకే ఇటీవల చిరుకుమార్తే ఇంట్లో డబ్బు గురించి వివాదం ఏర్పడితే దాన్ని వెంటనే పక్కదారి పట్టించింది. అలానే అనంతపురంలో చిరు ఫైర్ ను కూడా పెద్దగా చూడలేదు. చిరంజీవికి కేంద్రకేబినేట్ లో అవకాశామిచ్చేందుకు ఉప ఎన్నికల ఫలితాల్లో కోస్తాలో మరో రెండు సీట్లు రావటమే అర్హతగా అధిష్టానం భావిస్తోంది. ఫలితాలపై ఆధారపడ్డ ఈ తక్కువ టార్గెట్ నెరవేరినా ఆశ్చర్యపోవాల్సిన పనైతే లేదు. ఎన్నికల తరువాత నాలుగుస్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించవచ్చన్న లెక్కలను బట్టి చూస్తే చిరుకు కేంద్రకేబినేట్ బెర్త్ కన్ ఫార్మే.