డిఫెన్స్‌లో పడ్డ చంద్రబాబు నాయుడు
posted on Jul 19, 2012 8:48AM
దేశాధిపతిగా, సైనిక కమాండర్‌గా, రాజ్యాంగ అధిపతిగా భావించే రాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొన కూడదని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ విమర్శల పాలతోంది. ఒకప్పుడు అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడ్డారు. యుపిఎ బలపరచిన ప్రణబ్‌కు ఓటువేస్తే కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యారంటారని, ఎన్‌డిఎ సపోర్టుసిన సంగ్మాకు ఓటు వేస్తే మతతత్వపార్టీకి ఓటు వేశారంటారని చంద్రబాబు భావించడం హాస్యాస్పదమే అని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అంతకుముందు ఎన్‌డిఎ ప్రభుత్వంతో పని చేశామని గుర్తుచేసుకోవాలంటున్నారు. రాష్ట్రముఖ్యమంత్రిగా తొమ్మిది ఏళ్లు పరిపాలించిన చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం ఆయన అవకాశవాద రాజకీయాలను ప్రతిభింబిస్తుందని రాజకీయవాదులు ఆరోపిస్తున్నారు. ఓటువినియోగించుకోకపోవడం అంటే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమే నని మేధావులు మండిపడుతున్నారు.తెలంగాణ టి.డి.పి. నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణా పేరుతో రాష్ట్ర పతి ఎన్నికలను దూరంగా ఉండడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినవస్తున్నాయి. ఏదిఏమైనా రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది మన రాష్ట్రంనుండే మొదలవ్వటం రాష్ట్రరాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టాయో తెలుస్తుందని రాజకీయ పండితులు వాపోతున్నారు. ఇదే మోడల్‌గా తీసుకున్న ప్రజలు రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకుండా ఉంటే రానున్నరోజుల్లో రాజకీయ పార్టీల భవిష్యత్ ఏమిటని వారు ప్రశ్నింస్తున్నారు..విన్నారా ప్రజలూ ....