బుద్ద వనంలో ఘనంగా బౌద్జ జయంతి ఉత్సవాలు
posted on May 23, 2024 @ 4:25PM
ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్దుడు గొప్ప దార్శనికుడని , ఆయన చూపిన అష్టాంగ మార్గం ఆచరణీయమని తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు. బుద్దవనంలో టీజీటీఎస్ సీ నిర్వహించిన 2568వ బుద్ద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. కర్ణాటక రాష్ట్రంలోని బైలు కుప్పె, సెరా బౌద్దారామం నుంచి వచ్చిన గెషెనవాంగ్ జుంగే , సికింద్రాబాద్ మత బోధి బుద్ద విహార నుంచి వచ్చిన శీలం ల నేతృత్వంలో బుద్ద పాదాల వద్ద బుద్ద పాదాభినందనం, ఆచార్య నాగార్జున కాస్య శిల్పం వద్ద పుష్ప నివాళి అర్పించారు.
అనంతరం మహా స్థూప సమావేశమందిరంలో బుద్దవనంతో ప్రారంభమైన బుద్ద జయంతి ఉత్సవ సభకు, రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ చరిత్ర విభాగ పూర్వ అధ్యక్షులు, చరిత్ర కారిణి, ఆచార్య అలోకాపరాషెర్ సీకు, బౌద్దంలో స్నేహం, శాతావాహన విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య మల్లేష్ సంకశాల బౌద్దంలో సామాజికత అన్న అంశాలపై ప్రసంగించారు.
బుద్దవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం, బుద్దుని చివరి రోజులు పుస్తకాలను విషిష్ట అతిథులు ఆవిష్కరించగా బుద్ధవనంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు రమేష్ నాయుడు బహుమలులను అందించారు. ,బుద్ద వన ఓయస్డీ సుదర్శన్ రెడ్డి, టీజీటీసి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, హోటల్స్ జీఎం, నాగార్జున సాగర్ యూనిట్ మేనేజర్ , అధి సంఖ్యలో బౌద్దులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.