భయాందోళనల్లో మద్యం వ్యాపారులు!
posted on Jun 17, 2012 @ 10:18AM
మద్యం వాటాలు కలిగివున్న నేతల వివరాలు ఎసిబి వద్ద చాంతాడంత తయారైందని, ఇక విచారణ వేగిరం చేయటమే ఆలస్యమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా మరికొందరు ఎమ్మెల్యేల పేర్లు విమర్శల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన పేర్లు కూడా ఎసిబి వదలటం లేదు. దీంతో మీకు మద్యం వ్యాపారంలో వాటా ఉంది కదా అని ఏ ఎమ్మెల్యేనైనా ప్రశ్నిస్తే ఉలిక్కిపడి ముందుగానే ఘాటైన సమాధానాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే తమ పేరు ఎక్కడ ఎసిబి జాబితాలోకి చేరుతుందో అన్న ఆందోళన వారికి ఎక్కువయింది. ఇలా ఆందోళనతో సవాల్ చేసేవారికి తాజా ఉదాహరణ ఎమ్మెల్యే తూంగుంట నర్సారెడ్డి. ఈయన తనకు 27శాతం మద్యం వ్యాపారాల్లో వాటా ఉందని తెలుగుదేశంపార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ ఛార్జి బూర్గుపల్లి ప్రతాపరెడ్డి నిరూపించలేకపొతే రాజకీయాలనుంచి తప్పుకోవాలని డిమాండు చేశారు.
తాను కలిసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తనకూ కరుణాకర రద్దీకి సర్పంచిగా పార్టీ తరపున పనిచేసిన అనుభందమున్నందునే కలిశానని, దీన్ని రాజకీయం చేసిన ప్రతాప్ రెడి తన సవాల్ స్వీకరించాలని డిమాండు చేశారు. నర్సారెడ్డి చేసిన డిమాండును ప్రతాప్ రెడ్డి స్వీకరించారో? లేదో? కానీ, దీన్ని పరిగణలోకి తీసుకుని సిబీఐ అసలు విషయం తేల్చాలని ఎమ్మెల్యే ప్రత్యర్థులు కోరుతున్నారు. పనిలో పనిగా ఈయన విషయం తెలిస్తే ఎమ్మెల్యేల పాత్రలపై ఉన్న అనుమానాలు కూడా తీరుతాయన్నారు.