అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్షేమం
posted on Apr 30, 2011 @ 4:10PM
న్యూఢిల్లీ: ఆచూకీ తెలియకుండా పోయిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం దోర్జి ఖండూ హెలికాప్టర్ ఆచూకీ లభ్యమైంది. ఆయన హెలికాప్టర్ భూటాన్‌లో దిగినట్లు తెలిసింది. ఆయన క్షేమంగానే ఉన్నారని వైమానిక దళ అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ శనివారం కనిపించకుండా పోయింది. ఈ హెలికాప్టర్ తవంగ్ నుంచి ఇటానగర్‌కు శనివారం ఉదయం బయలుదేరింది. తవంగ్ నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ పదకొండున్నర గంటలకు ఇటానగర్ చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆ హెలికాప్టర్ ఇటానగర్‌లో దిగలేదు. తవంగ్ సమీపంలోని సేలా పాస్ వద్ద హెలికాప్టర్ నుంచి చివరి సంకేతాలు అందాయి. చాపర్‌లో ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ మంత్రిత్వ శాఖను కూడా అప్రమత్తం చేశారు. దీంతో ఆందోళన తీరిపోయింది. ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు పది గంటల పాటు కనిపించకుండా పోయింది.