రాజంపేట నేతలను హడలెత్తించిన గోరంట్ల మాధవ్
posted on Jun 13, 2012 @ 11:45AM
సిఐ గోరంట్ల మాధవ్ పేరు చెబితే కడప జిల్లా రాజంపేట రాజకీయనాయకులకు హడల్. ఆయనకు ఉప ఎన్నికల డ్యూటీ రాజంపేటలో పడటంతో రాజకీయ నాయకులందరూ తమ అక్రమ కార్యక్రమాలకు స్వస్తి పలికి మాధవ్ పైనే దృష్టి సారించారు. పైగా మాధవ్ కూడా ఎన్నికల విధుల్లోకి చేరటానికి ముందు అన్ని వీథులూ కలియతిరిగారు. దీంతో ఆయన ఊర్లోకి వచ్చిన వార్తా రాజకీయ నేతలకు తెలిసిపోయింది. ఎస్పీ ఉమేష్ చంద్ర హయాంలో 1999-2000లో మన్నూరు ఎస్.ఐ.గా పనిచేసిన గోరంట్ల మాధవ్ రాజకీయనాయకులు తప్పు చేస్తే పోలీసు బూటుకాలు ముద్ర చొక్కాలపై వేసేవారు. ఎవరినీ లెక్కచేయని ఆయన నైజం రాజకీయనాయకులకు అప్పట్లోనే మింగుడుపడలేదు. ఎంత పెద్దవారి సిఫార్సు అయినా తానేమీ పట్టించుకోనని , తాను చేయాల్సింది చేసే తీరతానని మాధవ్ చేసిన హెచ్చరిక కూడా రాజకీయ నాయకుల్లో భయంపుట్టించింది. 13ఏళ్ళ తరువాత రాజంపేట ఎన్నికలకు సిఐ హోదాలో వచ్చిన మాధవ్ కు ముందుగానే రూమ్ సిద్ధం చేసినా తన కారులోనే పడుకుంటానని మిత్రులనూ తిప్పి పంపించారు. నా డ్యూటీ నేను చేయాలి కదా! అనే మాధవ్ డైలాగ్ కూడా రాజకీయ నాఉఅకులకు భయంపుట్టిస్తుందని కొందరు బహిరంగంగానే అంగీకరిస్తారు.