విగ్రహాల ధ్వంసం: నేడు రాష్ట్రబంద్
posted on Jan 30, 2012 8:25AM
హైదరాబాద్: అమలాపురం, ధవళేశ్వరం ప్రాంతాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికోద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా సోమవారం రాష్టవ్య్రాప్తంగా బంద్‌కు దళిత సంఘాలు, తెలంగాణ విద్యార్థి ఐకాస, కుల వివక్ష పోరాట రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు టిడిపి, సిపిఎం, టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతపై తెలంగాణ విద్యార్థి ఐకాస రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతకు నిరసనగా సోమవారం రాష్టవ్య్రాప్తంగా బంద్‌కు పిలువు ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి ఐకాస, కుల వివక్ష పోరాట రాష్ట్ర కమిటీ సూచించగా సమావేశానికి హాజరైన ఇతర ప్రజాసంఘాలు, టిడిపి, సిపిఎం, టిఆర్‌ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని విగ్రహాలను కూల్చివేసిన నిజమైన నిందితులను అరెస్టు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ ఘటనలో రాజకీయ నేతల కుట్ర ఉందని వ్యక్తమవుతున్నందున సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. రాష్టవ్య్రాప్తంగా బంద్ విజయవంతానికి రాజకీయ పార్టీలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు మద్దతు ప్రకటించాలని తెలంగాణ విద్యార్థి ఐకాస అధ్యక్షుడు పిడమర్తి విజ్ఞప్తి చేశారు.