కేటీఆర్ పై రేవంత్ విమర్శలు.. జగన్ కూ వర్తిస్తాయంటున్న నెటిజనులు
Publish Date:Dec 25, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ బుధవారం (డిసెంబర్ 24) కోస్గిలో నూతన సంర్పంచ్ ల అభినందన సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, అలాగే కేటీఆర్ పైనా విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో తనపై చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో బదులిచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ , ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలనూ ప్రస్తావించారు. సొంత చెల్లిని పండక్కి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఆస్తిలో వాటాకు వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతుందనీ..సొంత చెల్లినే బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు, తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ విమర్శలపైనే ఇప్పుడు నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా జగన్ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతోందన్న ఉద్దేశంతోనే దూరంపెట్టారని గుర్తు చేస్తున్నారు. రేవంత్ కేటీఆర్ పై సంధించిన విమర్శనాస్త్రాలను ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఆపాదిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అన్నా చెళ్లెళ్ల వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయ
ఇటు తెలంగాణలో కేటీఆర్, కవిత, అటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు పొలిటికల్ గా బీఆర్ఎస్న, వైసీపీలకు నష్టం చేకూరుస్తున్నాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో కేటీఆర్ లక్ష్యంగా కవిత, ఏపీలో జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు బీఆర్ఎస్, వైసీపీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా కేటీఆర్ ను, జగన్ ను సొంత చెల్లెలికి అన్యాయం చేసిన అన్నలుగా ప్రజల ముందు నిలబెడుతున్నాయంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వీటికి బదులు చెప్పలేక కేటీఆర్, జగన్ లు సతమతమౌతున్నారు.
చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!
Publish Date:Dec 25, 2025
అటల్, పీవీ.. పోలికలు.. వ్యత్యాసాలు!
Publish Date:Dec 25, 2025
అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు
Publish Date:Dec 25, 2025
కర్ణాటకం.. ఎండ్ లెస్!
Publish Date:Dec 25, 2025
మోడీ మౌనం దేనికి సంకేతం?
Publish Date:Dec 24, 2025
బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.
ఇప్పటికీ మణిపూర్ మరక అలాగే ఉంది. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించినపుడు కూడా ఎలాంటి స్పందనా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్యవహారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే.. ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి కీలకాంశాలు సభలో అసలు చర్చకే రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాతరంపై గంటల తరబడి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధర్మం కోసం.. దేశ భక్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఆయన ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూనస్ సర్కార్ ప్రజా ప్రభుత్వం కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.
అదలా ఉంటే.. యూనస్ అత్యంత ప్రమాదకరమైన భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించే యత్నం చేస్తున్నారు. చైనాతో కలసి బారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును సజీవ దహనం చేసిన ఘటనలో కేంద్రం కనీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్కడేగానీ ఆయన పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అతడిని సజీవదహనం చేశారు. అలాంటి బంగ్లా ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?
Publish Date:Dec 23, 2025
అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందే ?
Publish Date:Dec 23, 2025
కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?
Publish Date:Dec 22, 2025
నక్సల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా?
Publish Date:Dec 21, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
Publish Date:Dec 25, 2025
క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి, మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది. క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో, నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు. ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. అయితే డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగ రోజు స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది? తెలుసుకుంటే..
డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకంటే
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపిం చాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
క్రిస్మస్ సంప్రదాయాలు
క్రిస్మస్ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువైన యేసు జీవితాన్ని, ఆయన బోధనలను గుర్తుచేసుకుంటారు. క్రైస్తవుల ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు, కరోల్స్ పాడతారు, కేకులు కట్ చేస్తారు. పిల్లలలో శాంతా క్లాజ్ ఆనందంగా గడుపుతారు. క్రిస్మస్ ముఖ్యంగా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా ఈ పండుగ పేదలకు సహాయం చేయడానికి, దాతృత్వానికి దానం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. క్రిస్మస్ రోజున స్నేహితులకు, పరిచయస్తులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.
స్నేహితులకు, పరిచయస్తులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి
చాక్లెట్లు, ప్లం కేకులు, కుకీలను క్రిస్మస్ కోసం సాంప్రదాయంగానూ, గొప్ప బహుమతులుగానూ భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కేకులు, కుకీలు స్నేహాలకు తీపిని జోడిస్తాయి, సాన్నిహిత్యాన్ని బలపరుస్తాయి. గ్రీటింగ్ కార్డ్, ఫోటో ఫ్రేమ్ లేదా ఏదైనా చాలా సొంతంగా తయారు చేసిన బహుమతులు చాలా ప్రత్యేకమైనవి. అలాంటి బహుమతులు సమయాన్ని, ఓపికను, కష్టాన్ని స్నేహితుల కోసం వినియోగిస్తే చాలా మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుతాయి. పుస్తకాలను చాలా గొప్ప బహుమతిగా పరిగణిస్తారు. స్నేహితుడి ఆసక్తికి సంబంధించిన ప్రేరణాత్మక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వవచ్చు. పుస్తకం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సువాసనగల కొవ్వొత్తులు, అలంకరణ వస్తువులు, షోపీస్‌లు, క్రిస్మస్ నేపథ్య అలంకరణ వస్తువులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ బహుమతులు పండుగకు గల ఉద్దేశ్యాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. పర్సనల్ గా ఇచ్చి పుచ్చుకునే బహుమతులు కూడా క్రిస్మస్ లో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. మగ్గులు, కుషన్లు, డైరీలు, పేరు లేదా ఫోటోతో కూడిన కీ చైన్లు వంటి పర్సనల్ బహుమతులు బాగుంటాయి. పైన పేర్కొన్న బహుమతులు అవతలి వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక బహుమతులు ఇవ్వాలంటే వారికి బొమ్మలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్ లేదా పెయింటింగ్ కిట్లను బహుమతిగా ఇవ్వడం చాలా మంచి సెలెక్షన్ అవుతుంది. ఇది పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
-రూపశ్రీ
క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
Publish Date:Dec 25, 2025
ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?
Publish Date:Dec 24, 2025
తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!
Publish Date:Dec 23, 2025
గణితంతో గమ్మత్తులు చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు..!
Publish Date:Dec 22, 2025
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!
Publish Date:Dec 25, 2025
నేటికాలంలో ఆహారం పరంగా చాలా మార్పులు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. అయితే చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను స్కూలుకు పంపిస్తూ చాలా బీజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో టిపిన్, వంట అన్నీ తీరికగా చేసే సమయం ఉండదు. ఇలాంటి వారిలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్, శాండ్విచ్ వంటివి తీసుకుంటారు. దీని కోసం వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారిలో కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఇంతకీ అవేంటంటే?..
డయాబెటిస్
వైట్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీన్ని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది . ఇది శరీర ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
బరువు
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి బ్రెడ్ అతిపెద్ద శత్రువు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఉండదు. దీన్ని తినడం వల్ల త్వరగా కడుపు నిండదు. ఇది అతిగా తినడం వల్ల శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది.
జీర్ణక్రియ
బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రేగులలో జిగట పదార్థంగా పనిచేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఇది జీర్ణం కావడం చాలా కష్టం. రోజూ బ్రెడ్ తినడం వల్ల తరచుగా మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
పోషకాలు
గోధుమలలో ఉండే సహజ పోషకాలన్నీ తొలగిపోయాక మిగిలే పిండితో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో చాలా తక్కువ విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. బ్రెడ్ తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ లభించవు. ఈ కారణంగా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.
గుండె ఆరోగ్యం
మార్కెట్లలో అమ్మే బ్రెడ్లు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్‌లు, ఉప్పు వేసి తయారు చేస్తారు. వీటిలో అధిక సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు పెంచుతుంది. ఎక్కువ కాలం బ్రెడ్ ను కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది.
-రూపశ్రీ
ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!
Publish Date:Dec 24, 2025
ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 23, 2025
అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?
Publish Date:Dec 22, 2025
ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!
Publish Date:Dec 20, 2025