ఎర్రన్నాయుడు మృతి తీరని లోటన్న సోనియా
posted on Nov 2, 2012 @ 4:48PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి తీరని లోటు అని సోనియా గాంధీ అన్నారు. కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు చేసిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయని సోనియా పేర్కొన్నారు.
టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, మంత్రులు రఘువీరా, సారయ్య ఏరాసు, టీజీ, ఆనం, బాలరాజు, డీకే అరుణ, గీతారెడ్డి,కన్నా, రాంరెడ్డి, పార్థసారథి, శత్రుచర్ల, ఎంపీలు రాజయ్య, వివేక్ సంతాపం ప్రకటించారు.
ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, పురందేశ్వరి, చిరంజీవి, పనబాక, ఎంపీవీహెచ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నారాయణ, రాఘవులు, జూలకంటి, టీఆర్ఎస్ నేతలు వినోద్, హరీష్‌రావు, ఈటెల, వైఎస్సార్ పార్టీ నేతలు విజయలక్ష్మి, ఎంపీ మేకపాటి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి తీరని లోటు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి అన్నారు.