తెలంగాణపై చేతులు దులుపుకుంటున్న కేంద్రం
posted on Aug 2, 2012 @ 9:52AM
తెలంగాణ వచ్చేసినట్టే అని తెలంగాణ వాదులు, తెలంగాణ ఇచ్చేదిలేదు కేంద్రం సమైఖ్యంగా ఉంటానికే మొగ్గు చూపుతుందని మరికొందరు ఆంధ్రానాయకులు డిల్లీ వెళ్లి వచ్చిన ప్రతీసారి రాష్ట్ర ప్రజలకు చెబుతుండటంపరిపాటి అయ్యింది. అయితే దేశ ఆర్ధిక మంత్రి చిదంబరం సీమాంద్ర మీడియాతో ముచ్చటిస్తూ తెలంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది ఇవ్వనిది రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు జరుగుతుందని చెప్పారు.
తెలంగాణపై కేంద్ర నిర్ణయాన్ని అమలు జరపటమే తమ పని అని అంతేగాని తెలంగాణా ఇచ్చే అంశం తమ పరిధిలోనిది రాదని హోం శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ న్యూడిల్లీలో తెలిపారు. కేంద్రం మా పరిధిలో ఉంచిన అంశాన్ని శ్రీకృష్ణ నేతృత్యంలోని కమిటీకి అప్పగించాం. అది ఇచ్చిన నివేదిక ప్రజల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. అన్నిరాజకీయ పార్టీలు తమ వైఖరి నిర్ణయించాకే కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని దాన్ని అమలు చేయటానికి కేంద్రహోం శాఖ కట్టుబడి ఉంటుందని చిదంబరం వివరించారు . రాష్ట్రంలోని పార్టీలకు, ప్రజలకే ఈ అంశాన్ని వదిలి చేతులు దులుపుకోవాలన్న పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు దీనివల్ల ఆర్థం అవుతుంది.