నోటి మీద వేలు వేయలేదని..మాస్టర్ ఏం చేశాడో తెలుసా..?
posted on Dec 8, 2016 @ 2:10PM
తల్లిదండ్రుల తర్వాత పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా గురువులదే..అయితే మాటలతో విననప్పుడు..విద్యార్థిని తన దారికి తెచ్చుకోవడానికి గురువుకు దండించే అధికారం కట్టబెట్టింది మన సంస్కృతి. అయితే కొందరు గురువులు మానవత్వం మరిచి చిన్నారులపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నోటి మీద వేలు వేసుకోమంటే..వేయలేదని ఓ చిన్నారి కాలు విరగ్గొట్టాడు ఒక మాస్టర్. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందదిన యోగేశ్ అనే చిన్నారి స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ స్కూలులో నర్సరీ చదువుతున్నాడు. విద్యార్థులంతా అల్లరి చేస్తుండటంతో తరగతి గదిని కంట్రోల్ చేయడం కోసం పిల్లలందరిని నోటి మీద వేలు వేసుకోమన్నాడు అనంతగిరి అనే మాస్టర్. అయితే యోగేశ్ నోటిపై వేలు వేసుకోకపోవడంతో అనంతగిరి పైకి ఎత్తి పడేయటంతో ఆ చిన్నారి కుడికాలు విరిగింది. అయితే సంఘటన జరిగిన 2 గంటల వరకు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు..దీంతో చిన్నారి నొప్పితో విలవిలలాడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యోగేశ్‌ని ఆస్పత్రికి తరలించారు.