తలాసానీ నీవు పార్టీలో ఉన్నట్లా లేనట్లా?
posted on Jul 7, 2012 @ 4:33PM
పార్టీకార్యకర్తలకు కౌ౦న్సిలింగ్‌లు ఇస్తూ రానున్న రోజుల్లో మనదే హవా అంటూ తనని తాను ఓదార్చుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే పనిలో పడ్డారు చంద్రబాబునాయుడు. హైదరాబాద్‌లో జరిగే మహంకాళీ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతోపాటు టిడిపి నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టిడిపి అధినేత చంద్రబాబుని ఆహ్వానించాడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అంతే చంద్రబాబుకి తలసాని శ్రీనివాసయాదవ్ అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు.
ఏమండీ సీనియర్ అయ్యుండి మీరు ఇలా చేస్తే ఎలా పార్టీ మారిపోతున్నారంటూ వార్తలు వస్తే కనీసం ఖండి౦చడంలేదు. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది, మీరు పార్టీకార్యక్రమాలకు కూడా గత నాలుగునెలలుగా రావడంలేదు, ఇంతకీ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటూ తలసానిని కడిగిపారేశారు. నగరంలో కరెంటు సమస్యపై విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా కు గాని, రైతుల సమస్యలపై ఇందిరాపార్కు దగ్గరకూ రాలేదని బాబు ఆక్రోషం వెళ్లగక్కారు. ఎన్టీఆర్ వర్దంతి ఇలా ప్రతిదానికి గైరుహాజరవటంపై తలసానిని బాబు ప్రశ్నించారు. పార్టీలోఉంటూనే పార్టీ పరువు తీస్తున్నారని కూడా అన్నారు. ఇవన్నీ అమ్మవారి జాతరకు వచ్చిన ఆలయ కమిటీ మెంబర్లను బయటికి పంపి మరీ క్లాసు పీకినట్లు తెలిసింది. దానికి గాను తలసాని పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పార్టీనిర్ణయాల్లో ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ వ్యవహారంగా అనునయించుకొన్నారు. అయితే ఈ వ్యవహారంపై సీనయర్ తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతూ తలసాని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుపుతున్నారని, ఏపార్టీలోనూ స్ధానం లేకనే మళ్లీ బాబువద్దకు చేరారన్నారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో స్ధానంకోసమే తలసాని ఇలాంటి ట్రిక్కులు ప్లేచేస్తున్నారని హైదరాబాద్ టిడిపి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆరోపించారు.