పాల్యాయిని దెబ్బకొట్టిన పబ్లిసిటి
posted on Jul 6, 2012 @ 2:50PM
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన పాల్యాయి గోవర్దనరెడ్డికి ఎఐసిసి జనరల్ సెక్రటరీ రాహుల్‌గాంధీ నుండి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయనతో రాష్ట్రరాజకీయాలు, అదేవిదంగా తెలంగాణా రాష్ట్ర విభజన గురించి మాట్లాడతారని అందరూ ఆశించారు. పిలుపు వచ్చిందే చాలని పాల్యాయి ఆఘమేఘాలమీద డిల్లీ చేరుకునే సరికి రాహుల్ గాంధీ ఆఫీసునుండి అపాంట్‌మెంట్ కాన్సిల్ సంగతి తెలిసింది. అదే సమయంలో రాష్ట్రంలోని మరో నాయకుడికి అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిసింది. చేసేదేమీ లేక వెంటనే పాల్యాయి తిరుగు ప్రయాణం అయ్యారు. దీనికంతటికీ కారణం పాల్యాయి మీడియాలో తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన విషయంతో పబ్లిసిటీ చేసుకోవటమే కారణం అని తెలుస్తోంది. అనవసరంగా మీడియాలో అధిక ప్రచారం చేసుకోవడం రాహుల్‌గాంధీకి చిరాకు తెప్పించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. గోవర్ధనరెడ్డి స్థానంలో అపాయింట్‌మెంట్ పొందిన నద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డితో రాహుల్ మాట్లాడారు. అనేక క్లిష్టపరిస్తితిల్లో కూడా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల తరువాత ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి ఉంటుందని, వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని కొడుకు వైయస్ జగన్ అందిపుచ్చుకున్నారని ఆయన చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పని తీరు, రైతుల సమస్యలపై ప్రస్తుత సర్కారు అవలంబిస్తున్న విధానాలు జగన్ కు వరంగా మారాయని ఆయన తెలియచేసినట్లు సమాచారం.