30 గంటల తరువాత బయటకు మమత..
posted on Dec 3, 2016 @ 9:36AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేకాదు టోల్ గేట్ల వద్ద ఆర్మీ ఉన్న ఆర్మీ తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి నుండి ఆమె తన కార్యలయంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమె కార్యలయం నుండి బయటకు వచ్చారు. దాదాపు 30 గంటల తరువాత ఆమె బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి సైన్యాన్ని ఉప సంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని..ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా మమతా తీరుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కేవలం సాధారణమైన విషయమే అని.. ఈ తనిఖీలు ఇప్పుడు కొత్తేమి కాదు.. అనవసరంగా ఈ తనిఖీలను రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక ఈ అంశంపై స్పందించిన ఆర్మీ కూడా మమత ఆరోపణలు నిరాధారమైనవని కొట్టేపారిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము టోల్‌గేట్ల వద్ద తనిఖీలు చేపట్టామని స్పష్టం చేశారు. అంతేకాదు వాటికి సంబంధించిన పత్రాలను కూడా ఆర్మీ విడుదల చేసింది.