లోకేష్ ట్విట్టర్లకు పెరుగుతున్న ఫాలోయర్లు
posted on Jun 23, 2012 @ 3:33PM
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పరోక్షంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలపై లోకేష్ స్పందించేస్తున్నారు. అయితే ఆ స్పందనలను ట్విట్టర్ల ద్వారా తెలియజేస్తున్నారు. తన తండ్రి చంద్రబాబునాయుడుని అవినీతిపరునిగా చూపేందుకు గతంలో వైఎస్ ప్రభుత్వం ఎన్నో విచారణ కమిటీలు వేశాయని లోకేష్ గుర్తు చేశారు. అయితే ఆ విచారణలు ఏవీ అవినీతిని నిరూపించలేకపోయాయన్నారు. వృథాప్రయాసే మిగిలిందని వ్యాఖ్యానించారు. వైఎస్ విజయమ్మపైన, వై.కా.పా.పైన లోకేష్ తన విమర్శలను ట్విట్‌లో ఉంచారు. దీనితో ఆగకుండా కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణలకు వివరణలు కూడా లోకేష్ ట్విట్ చేశారు. కోలా చూపించే బ్యాంకు అకౌంట్లు ఆయనకే తెలియాలని లోకేష్ వ్యాఖ్యానించారు. ఏమైనా తండ్రి రోడ్డుషోల్లోనూ, ప్రచారంలోనూ విమర్శలు గుప్పిస్తే కొడుకు ఇంటర్నెట్‌లో విమర్శలు గుప్పిస్తారన్న మాట. లోకేష్ ట్విట్టర్లు ఆలోచింపజేసేవిగా ఉండడంతో వాటికి ఫాలోవర్లు కూడా గణనీయంగా పెరుగుతున్నారు.