ప్రభుత్వ పెద్దలకు ఇంజనీరింగ్ ముడుపులు
posted on Oct 8, 2012 @ 2:43PM
ఇంజనీరింగ్ కాలేజీల టాస్క్‌ఫోర్స్ వ్యవహారం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలను తెచ్చిపెట్టింది. ఈ నెల మూడవ తేదీ నుంచి టాస్క్‌ఫోర్స్ దాడులు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరగాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడిరది. గత నెల 30వ తేదీన ముఖ్యమంత్రిని కలిసిన ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రికి తెలియకుండానే టాస్క్‌ఫోర్స్ దాడులు నామమాత్రంగానే అదీ కూడా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయినవి మాత్రమే జరపాలని నిర్ణయించారు. ఈ విషయం తనకు తెలియకుండా ఎలా జరిగిందా? అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై కినుక వహించారు. అయితే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈ లోపాయికారీ ఒప్పందం జరిగిందని తెలుసుకున్న ఆయన కొంతమంది కాలేజీల యాజమాన్యాలను పిలిచి వాకబు చేసినట్లు సమాచారం. మొత్తం మీద కిరణ్‌కుమార్‌రెడ్డిని మాత్రం తెలంగాణ విషయంలో దామోదర రాజనర్సింహ నిలదీశారు. అసలు ఇందుకు అసలు కారణం ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్ వ్యవహారమే అని తెలుస్తున్నది.