ఉపఎన్నికలు ఫలితాల వివరాలు...
posted on Nov 22, 2016 @ 3:29PM
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో జరిగిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరిలోని నెల్లితోపు, మధ్యప్రదేశ్‌లోని నేపానగర్, త్రిపుర, అస్సోం, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడులోని 8 అసెంబ్లీ స్థానాలకు, 4 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికలకు సంబంధించి ఎన్నికల లెక్కింపు ఈరోజు జరిగింది. ఈ ఎన్నికల సంబంధించిన ఫలితాలు..
* పుదుచ్చేరిలోని నెల్లితోపు ఉప ఎన్నికల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఘనవిజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్‌పై ఆయన 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు.
* తమిళనాడులోని తంజావూరులో 26,483 ఓట్ల ఆధిక్యంతో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపొందగా, తిరుపరకుండ్రం, అరవకురుచ్చి నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
* మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి మంజూ దాడు తన ప్రత్యర్థిపై 42,198 ఓట్ల తేడాతో విజయం సాధించారు. షాదల్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి జ్ఞాన్‌సింగ్ 60,383 ఓట్లతో గెలుపొందారు.
* త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం విజయకేతనం ఎగుర వేసింది. బర్జాలా నియోజకవర్గంలో జుమ్ముసర్కార్, కోవాయి నియోజకవర్గంలో బిస్వజిత్ దత్ గెలుపొందారు.
* అస్సోంలోని లఖీంపుర లోక్‌సభ స్థానంలో భాజపా ముందంజలో ఉంది.
* పశ్చిమ్ బంగలోని మాన్‌టేశ్వర్ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్థి సైకత్ పంజా గెలుపొందారు. తామ్‌లుక్ లోక్‌సభ స్థానంలో కూడా టీఎంసీ అభ్యర్థి దిబ్యేందు అధికారి గెలుపొందారు. కూచ్ బేహార్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిమ్ రాయ్ గెలుపొందారు.