బాల్ థాక్రే మాటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్
posted on Sep 10, 2012 @ 6:40PM
సంచలనాలకు మారుపేరుగా శివసేన అధినేత బాల్ థాక్రేను చెప్పుకోవచ్చు. ఒకానొక డబ్బింగ్ సినిమాలో ‘నా దారి రహదారి’ అన్నట్లుగా ఆయన దారే వేరు. రాజకీయాల్లో సందర్భం ఏమీ లేకపోయినా ప్రకంపనలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా! అవును... బాల్‌మాటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయ్యింది! ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అంటే బి.జె.పి.లో ప్రస్తుతం ప్రధాని పదవికి పూర్తి అర్హతలున్న వ్యక్తి సుష్మా స్వరాజ్ మాత్రమేనని బాల్ థాక్రే స్పష్టం చేశారు. కోల్‌గేట్ కుంభకోణానికి సంబంధించి సుష్మా భేటీ అనంతరం శివసేన పత్రిక సామ్నాలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయం చెప్పారు. ఆమె తెలివైన నాయకురాలు. చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అని అన్నారు. దీనిపై బి.జె.పి. నాయకుడు బల్బీర్ పుంజ్ స్పందిస్తూ ప్రధాని కాగలిగిన వారు తమ పార్టీలో చాలామంది నేతలే ఉన్నారని వ్యాఖ్యానించారు. బల్జీర్ పుంజ్ వ్యాఖ్యల్ని పలువురు నేతలు బి.జె.పి.సమర్ధించారు. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్‌వారు అప్పుడే ప్రధాని పదవిపై కలలా అంటూ ఎద్దేవా చేస్తున్నారు! ప్రధాని పదవికి అర్హత కలిగిననేత సుష్మా అని అన్నది థాక్రే అయితే దాన్ని బి.జె.పి. నాయకుల కలగా అభివర్ణించింది కాంగ్రెస్. ఓ వెంట్రుక దొరికింది. దాన్ని ప్రతిపక్ష పార్టీ అనే కొండకు ముడేశారు. పోతే మాటే, వస్తే ప్రతిపక్షంలో ముసలం! ఇది కాంగ్రెస్‌వారి ఆలోచన! చూద్దాం... ఏం జరుగుతుందో....?