మంత్రుల మధ్య గొడవలు పెడుతున్న బొత్స ?
posted on Aug 16, 2012 @ 10:53AM
బొత్స సత్యన్నారాయణ మంత్రుల మద్య చిచ్చు పెడుతున్నారని, సిఎంకు సహకరిస్తూ తటస్తంగా ఉన్న మంత్రులను దూరం చేసే పనిలో ఉన్నారని మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రికి కొందరు మంత్రులకు మద్య చిచ్చు పెట్టి తద్వారా ముఖ్యమంత్రిని ఒంటరి చేయాలనే వూహ్యంతో బొత్స ఉన్నారని తెలుస్తుంది. దీనికి మంత్రులు కూడా నిజమేనని అంటున్నారు.
ఈ విషయమై ఇప్పటికే 7గురు మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడని సీనియర్ మంత్రి లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణస్వీకారం 27న అ ని బొత్స చేసిన ప్రచారం చేసి సీఎం కు కన్నాను దూరం చేశారని చెబుతున్నారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ పిసిసి రేసులో ఉన్నారు. కన్నా పిసిసి కి ఎన్నికైతే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని బొత్స ఇలా చెబుతున్నారని తెలిసింది.
బొత్స బిసి కాపుగా ఉండి అసలైన కాపులకు గండి కొడుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉండే యువమంత్రి శ్రీధర్‌బాబును బొత్స తన ప్రచారంలో ముఖ్యమంత్రిని చేసారు. ఈ విధంగా తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డువస్తానరుకున్న వారిపై మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రులు వాపోతున్నారు. బిసిల రీఎంబర్స్‌మెంట్ విషయంలో కూడా ఇలాగే చేశారని 31 వేలు మాత్రమే ఇస్తామని మంత్రి పీతానితో చెప్పించి డిల్లీలో ఎంత అయినా ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించి ద్వంద వూహ్యం అమలు చేశారని మంత్రులు ఆరోపిస్తున్నారు. లోపల ఒకటి బయట ఒకటి చెబుతున్న బొత్స సత్యన్నారాయణ వల్ల రాజకీయంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నామని మంత్రులు అధిష్టానికి ఫిర్యాదు చేసారు.