రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
posted on Jul 14, 2022 @ 3:32PM
రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్లు, ఓటు వేసేందుకు ఉప యోగించే ప్రత్యేక పెన్నుల పంపిణీ మొదలుపెట్టింది. అయితే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకం కాను న్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలిసారి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతారు. బిజెపి నాయకత్వంలోని కూటమి ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్నుకోవ డంలోనే విపక్షాలపై విజయానికి గట్టి పునాది వేసింది. ఆమె వెనుకబడిన గిరిజన జాతికి చెందిన మహిళ కావడం, గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన రాజకీయవేత్తగా ఈ పదవికి అర్హురాలుగా బిజెపి కూటమి అభిప్రాయపడింది.
కాగా విపక్షాలు తమ అభ్యర్ధిగా దేశ, అంతర్జాతీయ రాజకీయానుభవం మెండు గా వున్న యశ్వంత్ సిన్హాను పోటీకి నిలబెట్టారు. ప్రస్తుతం వేగంగా మారుతున్న దేశ రాజకీయ పరిస్థితుల్లో ముర్ము కే ఎక్కువ అవకాశాలున్నాయన్న అభిప్రాయాలే వినపడుతున్నాయి. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న ( సోమవారం) జరుగుతుంది. కౌంటింగ్ జులై 21న ( గురువారం) జరుగుతుంది.
అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల విషయానికివస్తే.. రాష్ట్ర పతి ఎన్నికకు మొత్తం 115 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా వాటిలో పరిశీలన తర్వాత రెండు మాత్రమే అర్హమైనవిగా నిలిచాయి. పోటీలో ఎన్‌డిఏ తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా ఇద్దరే ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యు లు ఉంటారు. అలానే ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో నామినేటెడ్ సభ్యులు ఉండరు. రాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన ఓట్ల విలువ అంటే మోజారిటీ మార్క్ 5,43,216. కాగా ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ముర్మకు మద్దతు నిస్తున్న పార్టీలకు ఉన్న ఓట్ల విలువ 6,63,634, విపక్షాలు యశ్వంత్ సిన్హా కి 3,92,551 మాత్రమే.