బిజెపిలోకి సినీనటి జయప్రద
posted on Jun 29, 2012 @ 9:33AM
ఇండియా సిల్వర్ స్త్రీన్ మీద అందాలతారగా ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్‌తో అభివర్ణించబడిన తార జయప్రద తన సినీజీవితం ఉన్నత శిఖరాలపై ఉండగానే రాజకీయ ప్రవేశం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి నటసార్యభౌమ ఎన్టీరామారావు పిలుపునందుకొని తెలుగుదేశంపార్టీలో జాయిన్ చేశారు. ఆతరువాత జరిగిన పరిణామ క్రమంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయప్రద రాజ్యసభకు ఎన్నికయ్యారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె సమాజ్ వాది పార్టీనుండి పోటీ చేసిగెలిచారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీనుండి అమర్‌సింగ్ వెళ్లిపోవటంతో ఆమె వంటరివారిగా మిగిలిపోయారు. అయితే ప్రస్తుతానికి తాను బిజెపి నాయకులను కలిసి చెట్టపట్టా వేసుకొని తిరుగుతుండటం చూసి త్వరలో ఆమె భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ తారలను రాజకీయనాయకులుగా తీర్చిదిద్దిన బిజెపి జయప్రదను కూడా ఆమోదిస్తారనే అనుకుంటున్నారు.అదే జరిగితే హేమమాలిని, ధర్మేంద్ర ,శత్రుఘన్ సిన్హా, వినోద్‌ఖన్నా మొదలైన వారి జాబితాలోకి జయప్రద కూడా చేరతారు.