అధిక విద్యుత్ వాడే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు జైలుశిక్ష
posted on Aug 22, 2012 @ 10:37AM
రాష్ట్రాలు తమకు కెటాయించిన విద్యుత్ వినియోగం కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటే పెనాల్టీ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జైలు శిక్షవిధించడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.కొన్ని రాష్ట్రాలు అధికంగా విద్యుత్ వాడకం ద్వారా మూడు గ్రిడ్లువిఫలమై దాదాపు దేశంలోని సగభాగం అంధకారంలో చిక్కిన నేపధ్యంలోప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
విద్యుత్ విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలకు భారీ జరిమానా విధించడంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, అధికారులను జైలు శిక్ష విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరున తూర్పు, ఉత్తర, ఈశాన్య గ్రిడ్లు విఫలం అవ్వడంతో 21 రాష్ట్రాలకు విద్యుత్ నిలచిపోవడంతో చీకటి మయమయ్యాయి. అంతకు ముందురోజుకూడా ఉత్తరగ్రిడ్ విఫలమై డిల్లీతో 9 రాష్ట్రాలలో కరెంటు సేవలు ఆగిపోయాయి.
గ్రిడ్ల వైఫల్యానికి కరెంటు అధిక వినియోగమే కాకుండా, ఓవర్‌లోడ్‌వల్ల కూడా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అధిక విద్యుత్ వినియోగంపై నిఘావుంచేందుకు రాష్ట్ర స్ధాయిలో స్వతంత్ర నియంత్రణ సంస్థలను నెలకొల్పుతారని తెలుసింది. విద్యుత్ వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు 2003 ఎలక్ట్రిసిటీ యాక్టుకు పలు సవరణలు తీసుకురానున్నారు.