ముందక్కడ దూరంగా ఓ పొద కదలిన చప్పుడు. మరుక్షణం అడవి ప్రతిధ్వనించేట్టు ఓ పులి గాండ్రింపు అది సురేంద్రనే కాదు చుట్తో పక్కల గూడేలన్నింటినీ నిద్రలేపింది. అసలు ఈ మధ్యకాలంలో ప్రాంతాన పులులు తిరిగిన ఏ అధారమూ లేవు.
అతడు ఊపిరి బిగాపెట్టి చూస్తూనే వున్నాడు. భయంకరంగా చార్జిచేసిన పులి లిప్తపాటలోసుగ్గీని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కుపోతూంది.
భయకంపితుడై నిలబడిపోయాడు సురేంద్ర.
సుగ్గీ ఆక్రందన చేయలేదు. బహుశా మూడురోజుల్లో మనువాడబోతున్న సుగ్గీ శీలం కోల్పోయే దురదృష్టం నుంచి తప్పించుకుని ఇలా కడతేరిపోతున్నందుకు సంతోషపడుతుందేమో.....
నాగరిక ప్రపంచానికి తెలీని, కనీసం ఊహకందని విచిత్ర సంఘటనల్నీ సమన్వయపరుచుకోలేక ఇన్నిరోజుల మత్తు విడిపోయినట్టు సురేంద్ర వెనక్కీ మరలాడు.
ఆ చీకటి దుర్గా మరణ్యంలో తన కలలూ సమాధి అయిపోయింది. కూడా బ్రతికుందో, లేదో తెలీని విజయ అదృశ్యమైన ఓ జీవితకాలంలో అవిరికని అశ్రునిందువై౦దీ ఆ కీకారణ్యంలోనే.
* * * *
"యస్ చేతన్యా.... నిజమైన అధారాలతో పులివాతబడిన వ్యక్తిగా డిక్లేర్ చేయబడిన మొదటి గిరిజనయువతి సుగ్గీ," అనిల్ కూమార్ అన్నాడు. చైతన్య హైదరాబాదు చేరుకున్నది ఆ ఉదయమే. సుమారు రెండు గంటలుగా కూనం అడవుల్లోజరిగిన సంఘటనల్నీ సమీక్షింస్తున్నారు. "బహుశా అది మేనీటర్ అయ్యుంటుందని నా నమ్మకం "
"ఒక్క సంఘటనతో అది మేనీటర్ గా నిర్ధారించడం తొందరపాటు అవుతుందేమో" సాలోచనగా అన్నాడు చైతన్య.... "ఈ సంఘటనకి ఐ విట్నెస్ ఎవరైనా వున్నారా."
"సురేంద్ర..... సినీతా నటి విజయ తప్పిపోయాక అక్కడే ఉండి పోయిన సురేంద్ర కాకతాళీయంగా ఆ సంఘటనల్నీ చూసి ఉదయమే ఫోన్ చేశాడు."
"అంతేతప్ప మన డిపార్ట్ మెంట్ వ్యక్తులెవ్వరూ స్పాట్ కి వెళ్ళలేదన్నమాట ......."
అనిల్ కూమార్ కొన్ని క్షణాలదాకా మాట్లాడలేకపోయారు.
"అఫ్ కోర్స్ "
"ఏడాది క్రితం నుంచీ గిరిజన కన్యలు మిస్సవుతున్నారు. వారి శవాలూ ఎవరికీ లభ్యం కాలేదు. ఆ క్రూరమృగంమేదో తెలీదు. ఈ మధ్యనే తొలిసారి రెండు శవాలు దొరికాయ. అవి దొరకటానికి ఓ రోజు ముందే సినీనటి విజయ మిస్సయ్యింది. మేశావం ఆచూకీ కూడాలేదు. ఇప్పుడు పులివాత బడింది మరాగిరిజన యువతి.
సరే. ఇదంతా మీరు సేకరించిన వివరాలు లేదా పోలీసులు తెలియజేసిన విషయాలే తప్ప మన డిపార్ట్ మెంట్ జైక్యం ఎక్కడా లేదు."
చైతన్య ప్రసక్తిని మళ్ళీ అక్కడికే తీసుకోస్తాడని ఊహించలేక పోయాడు. "మిస్టర్ చైతన్య! ఇంతదాకా వచ్చాక ఓ ప్రత్యెక అసైన్ మెంట్ పై మిమ్మల్ని పంపాలనుకున్నాక గోప్యంగా వున్న మరోమనిషి విషయమూ చెప్పకపోవడం నేరమే అవుతుందేమో అసలు అక్కడి అడవిలో ప్రస్తుతం మన డిపార్ట్ మెంట్ గార్డ్స్ సైతం అడుగుపెట్టకపోవడానికి కారణంకొన్ని నెలలక్రితం మన ఫారెస్టు రెస్ట్ హవుస్ నుంచి తప్పిపోయాడు."
చైతన్య భ్రుకుటి ముడిపడింది.
"ఏమైందీ తెలీదు. కొంతమంది మన స్టాఫ్ అందించిన వివరాల్నీ బట్టి రేంజర్ కి గిరిజన యువకులతోఎక్కువుగా ఇల్లిసేట్ కాంటాక్ట్ వుండేది. కాబట్టి గిరిజనులే అతడ్ని చంపివుంటారు.లేదా అ కనిపించని క్రూరమృగమే అతడ్ని సంహరించి వుంటుంది. అదో మిస్టరీగానేమిగిలిపోయింది. దా౦తో మన స్టాఫ్ అడవిలో...."
చైతన్య ఆలోచిస్తున్నాడు గడ్డం సవరించుకుని.
చైతన్య మానసికంగా ఇన్వాల్ అవుతూన్నాడిప్పుడే అనుకోవడానికి అదే ఉదాహారణ ఆ విషయాన్నిగమనించాడు అనిల్ కూమార్ "మిస్టర్ చైతన్య...... ఆ సాధారణమైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మన డిపార్ట్ మెంట్ ఎక్కువుగా ఆధారపడింది మీపైనే . సరిహద్దులు లేని తెగువతో ఈ దేశం గుర్తించిన ఓ ప్రముఖడిగా మరో టాస్క్ ని అప్పచెప్పడం బాధాకరమైన విషయమైనా తప్పదు యూ మస్ట్ సేవ్ అవర్ ప్రిస్టేజ్ ."
అదేమీ వినడం లేదు చైతన్య " ఆ రెండు శావాలనీ పోస్ట్ మార్టం చేయించారా? అవే ఆ మధ్య దొరికిన ఇద్దరు గిరిజన యువతులనీ?"
"లేదు"
తల పకించిన చైతన్య "పారేస్ట్ రేంజర్ తప్పిపోయాక డిపార్ట్ మెంట్ ల్ గా అయినాఇన్వెస్ట్ గేట్ చేశారా?"
"చేయించాను...... కానీ రేంజర్ జగన్నాథం ఏమైందీ తెలుసుకునే ఒక్కఆధారమూ లభ్యంకాలేదు."
"రేంజర్స్ అడవిలో అడుగుపెట్టాక తమ విజిట్స్ కి సంభందించిన వివరాలు లాగ్ బుక్ లో రాస్తుంటారుగా?"
"ఆఫ్ కోర్స్ . అలాగే బుక్ నా దగ్గరే వుంది." తనకుండిన నివేదికతోపాటులాగ్ బుక్ నీ అందించాడుఅనిల్ కూమార్ రెక్ నుంచి తీసి.
బాగా పాతబడిపోయి నలిగిపోయినలాగ్ బుక్ అది.
ఒకటి... రేండు.... మూడు....అయిదు నిముషాలపాటుఅక్కదక్కదా పేజీలు తిరగేసిన చైతన్య దృష్టి ఓ చోటఆగిపోయింది.
"జగన్నాథం తప్పిపోయిందిఏ రోజు?"
"ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి."
ఇప్పుడు చైతన్య చూస్తున్న పేజీ ఫిబ్రవరి పద్నాలుగో తేదీకి సంభందించింది.
"వెల్" లాగ్ బుక్ ని అందించిన చైతన్య అనుమానస్పదమైన ఒక చిన్న "క్లూ" విషయంగాని, ఆ "క్లూ" నివేదికలో ఎక్కడాచర్చించబడకపోవడాన్నిగాని చెప్పలేదు.... "వెంటనే కూనం ఫారెస్ట్ కి వేడుతున్నాను."