"ఆలోచించాలి ___" తెల్లకాగితాల్లోకి చూస్తూ కూర్చున్నాడు.
ఆ క్షణంలో వైదేయని ఒంటరిగా వదిలిపెట్టేయాలి ___
అందుకే ప్రెస్ లో పనుండడంతో ఎడిటరు రాజారావు ఆఫీసువదిలి వెళ్ళిపోయాడు ___
ఆలోచిస్తున్నాడు వైదేయ __
ధనుంజయ అర్దరాత్రి స్మశానంలో శవాన్ని వెలికితీయాలని ప్రయత్నిస్తున్నాడు.
అంతలో __
ఫోన్ రింగవుతోంది మళ్ళీ.....
సరిగ్గా ఇలాగే ఇష్యూ పూర్తీయేటప్పుడు ఫోన్ రింగయింద నిన్నకూడా.
"హలో" విసుగ్గా రిసీవరు అందుకున్న వైధేయకు సెలయేటి గలగలలా వినిపించిందో నవ్వు___
వీణాతంత్రుల నుంచి లయబద్దంగా వలికె నాదాల ఒరిపిడిలాంటి ఆ నవ్వు చాలా అరుదైనది __
సునాయాసంగానే గుర్తించాడు ఫోన్ చేసిందేవరో___
"ఏమిటి ___ మీ గొంతు నీరసంగా వినిపిస్తూంది "
వైధేయ దవడ కండరాలు బుగుసుకున్నాయి.
"నిన్న పార్కు కెందుకు రాలేదు __" సీరియస్ గా అడిగేడు __
"భలేవారే "__
"ఏంటి ___ మీరు పార్కుకి వచ్చారా " రెట్టించాడు ___
"ఆ....."
"బహుశా నేను వచ్చి వెళ్ళాక మీరు రాకముందే నేనక్కడికి వచ్చెను___"
"డోంట్ బి సీల్లీ __ మీరు నన్ను పూల్ ని చేయాలని ప్రయత్నించారు ___"
"ప్రయత్నించడ మేమిటి __ ఆ ప్రయత్నంగా అంతా జరిగిపోతేనూ..."
వైదేయ ముఖం జేవురించింది___
"నిజం ___ నేను వచ్చాను ....మీరు నన్ను గుర్తించలేదు మరి.....అది నా తప్పేలా అవుతుంది."
"నిజంగా వచ్చేమంటారు...."
"రుజువు చెయ్యనా...."
"సరే .... చెయ్యండి __"
"మీరు బాధపడకూడదు "
"చెప్పండి .....
"మీరు మొదటిసారి ఒంటరిగావున్న ఓ అమ్మాయిని కలుసుకున్నారు నేననుకుని. ఇంతలో వాళ్ళాయన ...."
"చాలిక ...... ఆపండి "
మళ్ళీ అదే నవ్వు .....
"అయినా ఆ మాత్రం దెబ్బకే నెలకి కరుచుకుపోయారేమిటి ....."
చాలా లాజికల్ గా వైదేయ మగతనంపై ఓ దెబ్బకొట్టింది ......
"అడవాళ్ళనే కాదు మగాళ్ళనీ మీరేం చేయగలరని అర్ధమైపోయింది"
"ఫోన్ పెట్టెస్తున్నాను" ఉక్రోషంతో అతని గొంతు వణికింది.
"అయ్యో ..... ఆగండి మహానుభావా...... మరీ ఆడపిల్లలూ ఆ అలుగుడెంట్... సరే అసలు విషయానికొద్దాం .... ఆ తర్వాత మీరో..... వేశ్య దగ్గరకీ వెళ్ళి మీరు అసలు సైజులు చెప్పారు.... ఆవిడేమో తన రేటు విషయం మాటాడి౦ది...."
"అంటే సమీపంలో వుండి అంతా గమనిస్తున్నారన్నమాట ...."
"స్వయంవరం కదూ..... ఇంతటి సాహీతీ వ్రష్ట మేధస్సుమిటో మేతమేటికల్ గా కాల్కులేట్ చేద్దామని __"
"కాల్క్ లేట్ చేసారా__"
"ఆ ! బోత్తిగా పాస్ మార్కులు రాని ఈ మొద్దబ్బాయికి చాలా ట్యూషను అవసరమనిపించింది.__"
"మొదలు పెట్టండి" రోషంగా అన్నాడు.
"నన్ను పూర్తీ చేయనివ్వండి ... ఆ తర్వాతేమో అదే పార్కులో మీకో అందమైన అమ్మాయి కనిపించింది...."
"అవును" అక్కడ జరిగింది పూర్తిగా ఆమె చూడకపొతే బాగుణు అన్న ధ్వనితో గోణికాడు...."
"ఆమెనే ఓపది నిముషాలపాటు గుడ్లప్పగించి చూస్తూవుండేపోయారు..... కదూ"
"ఏం.... ఏం చేయను....... అప్పటికే రెండు నారాజయాలు......"
"గూడ్..... అలా స్పోర్టివ్ గా తీసుకోవాలి....... ఆ తర్వాత...."
ఆమె నవ్వింది గలగలా కిలకిలా.......
ఆ తర్వాత జరిగింది ఆమె చూసే వుంటే ఆమె ద్వారా అదివినడం అతని కిష్టంలేదు.... అందుకే ఆమెని నేనేం చేయలేదే...." అన్నాడు నెమ్మదిగా......
"మీరేం చేయలేదు సరే......"
క్షణం పాటు నిశ్శబ్దం తర్వాతే అంది రోషిణి "కాని ఆమె వూరుకోలేదుగా...... మీరేదో రేఫ్ చేయడానికికొచ్చారాన్నట్టుచాచి చెంపమీద ఒకటిచ్చుకుంది"
"రేప్ చేయాల్సింది" కసిగా పళ్ళు నూరేడు.
"మూగదేగా...... కానివ్వాల్సింది" నవ్వుల దొంతర____
"అంటే....... అంతా చూసారన్నమాట...." అడిగాడు చివరిగా.
"నేను చూసాను ..... అని మీరే నన్ను గుర్తుపట్టలేదు"
"అసలు చూడనిదే...."
"చూసారు"
"అబద్దం....."
"ఎక్కడచూసాను..."