Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 3

    శీనయ్య  ప్రస్తుతం సుభద్ర స్థానంలో వచ్చాడు. ఒక ఆడదిచేయగల పనుల్లో ఎన్నిమగాడికి సాధ్యపడతాయో అన్నీవాడుచేస్తున్నాడు. సాధ్యపడని పనులగురించి  కూడా ఏదో ఏర్పాటు చేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు.
    ఆ ప్రయత్నంలోనే వాడు కనబడిన ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ తన యజమాని విషాదగాధను వినిపిస్తున్నాడు.
    ఆ ప్రయత్నంలోనే వాడు సరిగ్గావారం రోజులక్రితం తన యజమాని ఇంటిని నిరంజనరావు౦డే వీధికి మర్చగాలిగాడు.
                                                                            3
    "ఏమండీ __ ఇదిగో ఇలా చూడండి" అంది సూరమ్మ.
    "ఏమిటే నే గొడవ" అన్నాడు సుబ్రహ్మణ్యం చిరాగ్గా.
    "మొన్న మీరు గంగాధరంగారిగురించి ఏమన్నారూ?" అంది సూరమ్మ.
    "ఏమన్నానూ?" అన్నాడు సుబ్రహ్మణ్యం చిరాకును వదిలిపెట్టకుండా.
    "అదే పెళ్ళిసంబంధం గురించి"
    "ఏ పెళ్ళిసంబంధమే?"
    "ఆ అబ్బాయి పేరు నాకు గుర్తులేదు. అదే ఆశీనయ్య...."
    "సూరమ్మ ఏదో చెప్పబోతుండగా సుబ్రహ్మణ్యం __"ఆ ప్రసాద్ గతా __మనకంత రేండోపెళ్ళికర్మేం పట్టిందే"అన్నాడు.
    "ఆ గంగాధరంలాగే అన్నారనికదా మీరన్నారు?"
    "నేనడంకాదు __ ఆయనన్నమాటే అది!"
    "అయితే ఈ రోజెం జరిగిందో తెలుసా?"
    "తెలుసుకుంటాను __ చెప్పు...."
    "అ అమ్మాయి ఉదయ ఆ అబ్బాయి కొడుకును తన ఇంటికితీసుకుని వచ్చి అమ్మా అని పిలిపించుకుందుకు చూస్తోందట....."
    "ఏమిటీ?" అంటూ సుబ్రహ్మణ్యం నోరావలించాడు.
    సూరమ్మ కథ యావత్తూ విడమర్చిచెప్పింది.
    ప్రసాదు వయసు ముప్ఫైకి కాస్త తక్కువేగానీ ఎక్కువుండదు. అప్పుడే అతడి జేతం నేలకు రెండువేళకు పైన. మనిషి ఎర్రగా బుర్రగా బాగుంటాడు. అయిన వాళ్ళందరితోనూ తెగపులుచేసుకున్నాడు. రెండేపెళ్ళి వాడి తేనేం __ అన్నివిధాల అయిన సంబంధం!
    ఉన్న ఇబ్బంది అల్లా ఒక్కటే!
    ప్రసాద్ పునర్వివాహానికి విముఖుడిగా లేడు. కానీ అతడు కోరుతున్నది తనకొక భార్యకాదు__ తనబిడ్డకొక తల్లి! ప్రస్తుతానికి శీనయ్య ఉన్నప్పటికీ తల్లి లోటును తీర్చగలిగింది. ఒక ఆడదిమాత్రమేనని ప్రసాద్ కు తెలుసను.గంగాధరం ఈవిషయాలన్నీ ఆరాతీసి అట్నించి నరుక్కురావలనుకున్నాడు. కూతురిని బాబుకు చేరిక చేయిస్తున్నాడు.
    "మరి నాతో అలా అన్నాడు?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "తనతో మనంపోటీపడకుండాను....."| అన్నది సూరమ్మ.
    "ఛాఛా రెండోపెళ్ళివాడికోసం మనం పోటీపడడమా?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "సరే __ మొన్న అమ్మాయిని చూసునేందుకు వచ్చిన   ఆ కూర్మారావుసంబంధం సంగతి మీకు గుర్తుందా?"
    "ఎందుకుగుర్తులేదూ? పదిహేనువేలు కట్నం అడిగారు. పదిమంది అప్పగింతలన్నారు...." అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "వాళ్ళకేమో స్వంతిల్లుకూడా లేదు. కుర్రాడి సంపాదనమీదే తల్లిదండ్రులు ఆధారపడ్డాను.అబ్బాయినెలజీతం ఆరొందలచిల్లర...." అని అందించింది సూరమ్మ.
    అవునూ __ అయితే?" అన్నాడు సుబ్రహ్మణ్యం భార్యసందేశం ఆయనకు అర్ధం కాబోతున్నది.
    సూరమ్మ స్పష్టంగా అంతా వివరించింది.
    కూర్మారావు మొదటిపెళ్ళివాడు అందుకే అంతకట్నం అడిగాడు. ప్రసాదు రెండోపెళ్ళివాడు. అతడు కట్నం అడగడు.
    కట్నంకోసం కుర్రదాన్ని రెండోపెళ్ళివాడికిచ్చి చేస్తామా? సుబ్రహ్మణ్యనానికి మళ్ళీ తిక్కరేగింది.
    "కాస్త నిదానంగా ఆలోచించి చెప్పండి, అమ్మాయి సుఖపడాలంటే ఆ కూర్మారావు సంబంధం మంచిదా, ప్రసాదు సంబంధం మంచిదా?"
    సుబ్రహ్మణ్యం ఆలోచనలోపడ్డాడు భార్యమాటలు అలోచింపదగినవేనని ఆయనకు అనిపించింది. కాసేపాగి __"కానీ అడుగుపెడుతూనే అయిదేళ్ళ బాబుని సాకాలి" అన్నాడాయన.
    "బాగుందండీ __ శక్తిలేక మనం దాని పెళ్ళి ఆలస్యం చేశాంగానీ ఈ పాటికి దానికి అ  వయసుపిల్లలుండేవారుకదా?" అన్నది సూరమ్మ.
    భార్యకు ఆ సంబంధం నచ్చింట్లు సుబ్రమణ్యనికి అర్దమయింది. అందుకే _-"అంతా బాగానే వుందనుకో __ అమ్మాయికీ సంబంధం నచ్చుతుందంటావా?" అన్నాడు.
    "నచ్చకపోతే ఆ బాబుచేత ఉదయకంటే ముందు నేను అమ్మా అని పిలిపించుకుంటాను.__ అని పంతమెందుకుపడుతుందీ" అంది సూరమ్మనెమ్మదిగా.
    అప్పుడు సుబ్రమణ్యనికి కలిగిన ఆశ్చర్యమింతా అంతకాదు.
     అయితే అయన ఆశ్చర్యం అర్ధంలేనిది.
    ఈ దేశంలో ధరించడానికి గోచీవుంటేచాలు __ మగాడు కట్నంఅడుగుతాడు. కట్నంతోపటు వాడు తన అభిరుచలతగ్గ అమ్మాయినీ వెతుక్కుంటాడు. కట్నమిచ్చికూడా తన అభిరుచులతగ్గాన్ అబ్బాయి నేన్నుకునే అవకాశం వరుడి గురించికాకా అత్తవారింట తమకు లభించే సదుపాయాలు, తమ భావిజీవన విధానం గురించి ఆలోచించడం అలవర్చుకున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే ప్రసాదు సంబంధం సగటు ఆడపిల్లకనే సగటు కలలకు అతీతమైనది. పగటికలలకు అనువైనది.
    ప్రసాదు రేండోపెళ్ళివాదాన్న భావం తన కూతురుకి పట్టలేదని తెలియగానే __ "అయితే నేను మన తరపునించి ప్రయత్నాలు ప్రారంభించాలి. గంగాధరం సంగతి అటుంచి ఇంకా ఎంతమంది పోటీకీ తయారౌతారో ఏమో" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    అప్పుడే కంగారుపడి ఎవరిదగ్గరా ఏమిటా  అనకండి. ముందుగా ఇది అట్నించి నరుక్కురావలసినవ్యవహారం. అమ్మాయి ప్రయాణం అమ్మాయి కిస్తోంది. మీరూకాస్త ఈవిషయన్ని దృష్టిలో ఉంచుకుంటారని ముందుగా చెబుతున్నాను" అన్నది సూరమ్మ.
                                           4
    "నేను నిన్ను అమ్మా అనను" అన్నాడు బాబు ఉదయతో.
    "పోనీ నన్నంటావా?" అంది వసంతలక్ష్మి.
    "నిన్నూ అనాను" అన్నాడుబాబు.
    "ఎందుకని?"
    "మా అమ్మ ఎంతోఅందంగా ఉంటుంది"
    "నేను బాగోలేనా?" అంది ఉదయ.
    "బాగానేవున్నావు  కానీ అమ్మంత బాగోలేవు?" అన్నాడుబాబు. బాబుకు తెలియదు __ తనమాటల్లో అమ్మ అన్నపదానికి నిర్వచనముందని"
    వసంతలక్ష్మి నవ్వి __ వీడు మహామొండి" అంది.
    ఉదయనవ్వలేదు __ వీడిమొండితనం నాకు ముద్దువస్తోంది" అంది నెమ్మదిగా.
    వసంతలక్ష్మి నాలిక్కరుచుకుని "నాకూను" అంది.
    బాబు ఇద్దరివంకా అదోలాచూసి __ "మీరు దెబ్బలాదుకుంటున్నారా?" అన్నాడు.
    " అవును నీకోసం " అంది ఉదయ.
    "నాకోసమా __ ఎందుకు?" అన్నాడుబాబు. వాడి లేతముఖంలో ఆశ్చర్యంతోపాటు అన్మ్డంకూడా కనబడింది.
    "నువ్వంటే నాకెంతో ఇష్టం" అన్నది వసంతలక్ష్మి.
    "నాకూనూ __" అన్నది ఉదయ.
    "ఇష్టమైతే దెబ్బలాట ఎందుకు? బాబు గొప్పగా ముఖంపేట్టి అన్నాడు.
    "ఎందుకంటే __ నువ్వు నాతోనే ఉండాలని నేను కోరుకుంటూన్నాను. తనతోనే ఉండాలని ఉదయ అనుకుంటున్నది. నీకెవరుకావాలో చెప్పు...... అంది వసంతలక్ష్మి.
    "నాకు అమ్మకవాలి" అన్నాడు బాబుచటుక్కున.
    "నువ్వు అమ్మాఅనిపిలు __ నేనే నీ అమ్మనై పోతాను."
    "ఛీ __ సిగ్గులేకుండా ఏమిటీ ఆమాటలు...." అంది ఉదయ.
    "ఆడపిల్లని ఓ చిన్నారిబాబు అమ్మాఅనిపిలిస్తే అందులో సిగ్గేముంది.
    అప్పుడా బాబునాన్న ......"అని అడిగింది ఉదయ.
    "అదా నీభయం?" అంది వసంతలక్ష్మి.
    ఉదయ ఏమీ మాట్లాడలేదు.
    అమ్మఅన్నపదం ఆదరణకు మారుపేరు. వివాహిత అయిన కాకున్నా అమ్మా అన్నపిలుపు ఆడదానికి పరవశాన్ని కలగజేస్తుంది. అమ్మా అనిపిలిచినపుడు ఆ పిలుపుకు తల్లికావాలి తప్పితే ఆపిలుపుతండ్రి గురించి ఆలోచించకూడదు ఆడది" అంది వసంతలక్ష్మి మళ్ళీ.
    "ఈ బాబును చూస్తుంటే నీమాటలు నిజమేననిపిస్తున్నాయి." అంది ఉదయ.
    "మీమాటలు నాకర్ధంకావడంలేదు. మీరేమో అస్తమానూ అమ్మ గురించే మాట్లాదితున్నారు. నాకేమో అమ్మ ఎక్కడాకనిపించడంలేదు. " అన్నాడుబాబు.
    అమ్మగురించిన టాఫిక్ మార్చాలనుకుంది. వసంతలక్ష్మి __"నీకేమేం ఆటలు ఇష్టమోచెప్పు" అన్నదామె.
    "ఎందుకని?"
    "ఆ అతలాడుకుందా౦" అన్నాడు బాబు ఉత్సాహంగా.
    "అదెలాగో చెప్పు" అంది ఉదయ.
    "మీకు గుణ్ణం అట తెలియదూ?" ఆశ్చర్యంగా అన్నాడు బాబు.
    స్నేహితురాండ్రద్దరూ అడ్డంగా తలలూపారు.
    "నిజంగా తెలియదూ?" అన్నాడు బాబు మళ్ళీ.
    మళ్ళీ వసంతలక్ష్మి, ఉదయ ఇద్దరూ __ తలఅడ్డంగా ఊపారు.
    అప్పుడు బాబు సాలోచనగా తలపకించి "అయితే రాత్రికి మాఇంటికిరండి. గుణ్ణంఅట చూపిస్తాను...." అన్నాడు.
    "ఇప్పుడు చూపించలేవా?" అంది వసంతలక్ష్మి.

 Previous Page Next Page