Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 28

  

  వీరన్న ఎత్తును సరిగ్గా అర్ధంచేసుకున్నవాడు చలమయ్య ఒక్కడే. రంగంలో అనందమూర్తీ , రమాకాంతం. మిగలడమూ _ ఆనందమూర్తికి వీరన్న అండదండలు లభించడమూ రమాకాంతానికి అపశకునాలు. అందుకు ప్రతిగా ఒక్కటే ఉపాయముంది. అదే ఆనందమూర్తిని కూడా రంగం నుంచి తప్పించడం.....

    చలమయ్య ఆనందమూర్తి మీద సమాధాన భేద దండోపాయాలు ప్రయోగించాడు. నువ్వెంతో మంచివాడివి. రాజకీయాలు నీకెందుకూ అని మొదట మందలించాడు. ఎన్నికలలో ఉపసంహరించుకుంటే, అతడి భూమికి మధ్యలో అడ్డుగా వున్న తన భూమిని చవగ్గా అమ్మేస్తాడని ఆశ చూపాడు. వీరన్న ఏమాత్రమూ మంచివాడు కాడు _ వాణ్ని నమ్ముకుంటే గోతిలో పడిపోతావు. నామాట వినీ, వాడి మాట వినకా _ పదవీ వ్యామోహం చంపుకో అంటూ హెచ్చరించాడు. ఆ తర్వాత ఓ రోజు పొలం నుంచి వస్తూండగా ఆనందమూర్తి మీదకు నలుగురు రౌడీల్లాంటివాళ్ళు కర్రలుచ్చుకుని వచ్చారు. అతడి కేకలు, విని, దూరాన ఉన్న కొందరు రైతులు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. ఈలోగా అనందమూర్తికి చిన్న దెబ్బలు తగిలాయి.

    దేనికీ ఆనందమూర్తి చలించలేదు. సరిగదా, అతడిలో పట్టుదల పెరిగింది చలమయ్య అతడి మీదకు రౌడీలను పంపాడని విని వీరన్న మండిపడి, అనందమూర్తికి నియమించాడు. ఇరవైనాలుగ్గంటలూ అతడిని కనిపెట్టుకుని ఉండడమే వాళ్ళ పని. ఈ ఏర్పాటుకు మూర్తి అంగీకరించక చేయసాగారు. చలమయ్య కూడా ఆ తర్వాత దండోపాయంలో తొందరపడలేదు.  

    ఎలక్షన్ లకి రమాకాంతం, ఆనందమూర్తి నామినేషన్ దాఖలు చేశారు.

    "ఏమయ్యా _ చాకులాంటి కుర్రాడివి. నేనిన్నితంటాలు పడుతూంటే చూస్తూ ఊరుకోవడమే గానీ _ ఈ మూర్తిని అణిచేసే ఉపాయం చెప్పెయవయ్యా __" అన్నాడో రోజున చలమయ్య విసుగ్గా రమాకాంతంతో.

    "నేనేం చెప్పగలను? నేను చేయగలిగిందల్లా వాగ్దానాలు మాత్రం. అవే మీకూ, ప్రజలకూ కూడా చేశాను. ఇలాంటి విషయాల్లో అడ్డదార్లు తొక్కేటంత అనుభవం నాకింకా రాలేదు....." అన్నాడు రమాకాంతం.

    చలమయ్య తీవ్రంగా ఆలోచించక _ " నేనొకటి చెబుతాను _ చెయ్యగలవా? దేనికి బాగా గుండెనిబ్బరం కావాలి మరి ...." అన్నాడు.

    "చెప్పండి _" అన్నాడు రమాకాంతం కుతూహలంగా.

    "అనందమూర్తిని చంపేయాలి!" అన్నాడు. చలమయ్య.

    రమాకాంతం ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుకు కారణమింకా ఆ మాట వినడం మాత్రమే! ఆ మాట మెదడును చేరేసరికి అతడికి వళ్ళంతా చెమటలు పట్టాయి.

    "ఎన్నికల్లో నెగ్గడం కోసం నేనే పాపానికయినా సిద్దమే కానీ, హత్యలు మాత్రం చేయలేను. నేనే కాదు _ నా తరపున ఎవ్వరూ కూడా ఇందుకు పాల్పడరాదు _" అన్నా తీయడం కాదు ...." అన్నాడు చలమయ్య.

    "మరి?_"

    "మూర్తికి మాన మర్యాదులే ప్రాణం. ఊళ్ళో అవి లేకుండా చేయాలతడికి....."

    "అదెలా సాధ్యం.....?"

    "ఇలా ....!"

    చలమయ్య రమాకాంతం చెవిలో గుసగుసలాడాడు. ఒక భయంకర దారుణ పైశాచిక హత్య కా గుసగుసలె నాందీ ప్రస్తావన.

                                      *    *    *    *

    అర్దరాత్రి పన్నెండు గంటల సమయం.

    ఊరంతా నిశ్సబ్దంగా నిద్రపోతోంది.

    ఆనందమూర్తి తనింట్లో పందిరి మంచంమీద అదమరచి నిద్రపోతున్నాడు. అతడి భార్య రాజేశ్వరి అతడికి దగ్గరగా ఒదిగి పడుకుంది. నిద్రలో ఏ రంగుల కళలు కంటున్నారో _ ఇద్దరి ముఖాల్లోనూ సంతోషం కనబడుతోంది.

    గదిలో ఒక ఘూలగా హరికెన్ లాంతరు వెలుగుతోంది వెలుగు మరీ ఎక్కువ కాకుండా, వట్టి బాగా తగ్గించబడి వుంది. మిగతా యిల్లంతా యించుమించు చీకటిగా వుంది.

    నిద్రలోంచి రాజేశ్వరి ఉలిక్కిపడి లేచింది. కంగారుగా భర్తను తట్టిలేపి _ "ఏమండి , చూడండి, ఎవరో తలుపు తడుతూన్నట్లున్నారు......" అందామె.

    ఆనందమూర్తి బద్ధకంగా "ఊం" అంటూ మరో పక్కకు తిరిగాడు. అతడికీ వినబడింది _ ఎవరో నెమ్మదిగా తలుపు తడుతున్న చప్పుడు.

    ఆనందమూర్తికి మత్తు వదిలిపోయింది. లేచి గోడ గడియారం వంక చూశాడు. టైము పన్నెండూ ఇరవై దాటు తోంది.

    "అబ్బా _ ఇప్పుడేవరో?" అనుకున్నాడతడు విసుగ్గా. అనుకుంటూనే మంచం దిగి, నడవలోకి నడిచాడు. అతడి వెనుకనే లాంతరు వట్టి పెద్దదిచేసి, రాజేశ్వరి కూడా నడవలోకి వచ్చింది.

    "ఎవరూ?" అంటూనే ఆనందమూర్తి తలుపు తీశాడు.

    చలమయ్య, రమాకాంతం లోపలకు వచ్చి _ "ఉష్_ మాట్లాడకండి __" అన్నట్లు సౌంజ్ఞ చేసి, మళ్ళీ తలుపులు వేసేశారు.       

    ఆనందమూర్తి వాళ్ళవంకే చూస్తూ __ " ఇప్పుడు ..... ఈ సమయంలో మీరు ....." అన్నాడాశ్చర్యంగా.

    చలమయ్య మరో రెండడుగులు ముందుకు వేసి __ బోడ్లోంచి కత్తి తీశాడు __ "నేను మిమ్మల్నేమీ చెయ్యబోవడంలేదు. అనవసరంగా కేకలు వేస్తెమాత్రం నువ్వూ, నీ భార్యా కూడా చస్తారు __" అన్నాడు.

    అనందమూర్తికీ, రాజేశ్వరికీ నోట మాట రాలేదు.

    "ఊం కానీయ్ రమాకాంతం ...." అన్నాడు చలమయ్య. రమాకాంతం అనందమూర్తిని సమీపిస్తూంటే, చలమయ్య రాజేశ్వరిని  సమీపించి _ "పిచ్చివేషాలేస్తే నీ పెళ్ళాంచస్తుంది....." అన్నాడు.

    ఆనందమూర్తి నిశ్చేష్టుడైపోగా రమాకాంతం అతడికి కాళ్ళూ చేతులూ కట్టి, నోట్లో గుడ్డలు కుక్కాడు. తర్వాత రాజేశ్వరికీ అదే జరిగింది.

    "మూర్తీ ! నేను నీకేమీ అపకారం చేయబోవడంలేదు. ఎటొచ్చీ మీరిద్దరూ మేము చెప్పినట్లు నడుచుకోవాలి. అందుకంగీకరించకపోతే మాత్రం మేమేం చేస్తామో మాకే తెలియదు......" అన్నాడు చలమయ్య.

    ఏం కావాలన్నట్లుఆనందమూర్తి వాళ్ళ  వంక చూశాడు.

    "నువ్వూ, నీ భార్యా మేం చెప్పిన విధంగా ఉత్తరం రాయాలి. రాస్తే ఏ గొడవాలేదు. రాయకపోతే మాత్రం ....." అని చలమయ్య ఆగి మూర్తివంక చూశాడు. అతడి కళ్ళలో అంగీకారం కనబడింది _ చేతి కట్లు విప్పు __ రమాకాంతం ...." అన్నాడు చలమయ్య . రమాకాంతం ఆనందమూర్తి చేతికట్లు విప్పి రాజేశ్వరివైపు నడిచాడు. చలమయ్య మూర్తిని సమీపించి కాగితం, కాలం యిచ్చి చెప్పనారంభీంచాడు.

 Previous Page Next Page