Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 19

    "సరే అలాగే కానివ్వండి __ అప్పోసప్పో చేసి ఇచ్చుకుంటాను" అని  తెగించే  మనిషిలాగ "తెంపేసేడు  సుదర్శనం __
    ఆ విధంగా మాటివ్వడం, మాటపుచ్చుకోవడం ఇద్దరిమధ్యా జరిగిపోయింది. ఇక డబ్బు విషయం బ్యాంకులు చూసుకుంటాయి.
    ఇళ్ళుకట్టేసి వెంటనే కాంట్రాక్టరు కోటేశ్వరంగారికి డబ్భైవేలు డబ్బు దొరుకుతుంది..
    ఆ ఇల్లులు అద్దెకిచ్చుకుంటే సుదర్శనంగారి డబ్బు పిల్లలు పెడుతుంది.
    ఇద్దరూ డబ్బుకోసమే! ఆ ఇల్లులు ఒకరు కట్టిస్తున్నారు, ఒకరు కడుతున్నారు.
    కానీ ఆ ఇల్లులూ , కొలనీలూ, కష్టపడి కడుతున్న కూలినాలి జవాబు ఈ డబ్బుగురించీ మాటవూసుకైనా అనుకోరు. వాళ్ళు కడుపుగురించే వస్తారు. ఆ బిల్డింగులూ, ఆ ఇల్లులూ కట్టేడంఅయిపోయాక ఆ కడుపు పట్టుకునే వెళ్ళిపోతారు.
    అలా ఆ మూడిల్లులూ కట్టడానికి పప్పందాలై వారంరోజులుఅయిందో లేదో మట్టినించిన ట్రక్కుతో ట్రక్కుమీద మనుషులతో __ ఆరోజు కోటేశ్వరరావు గారితో వచ్చిన మేస్త్రీ కనకారావు అదేరోజున కొల్తలుతీసిన గుమ్మిలో మట్టి కప్పడానికి రోడ్డుమీద ట్రక్కును ఆపి __ ఆ మట్టిని అక్కడే వలకబోయించి, వలకబోసిన మట్టిని మనుషులతో పరలుపట్టింఛీ మట్టిని ఎత్తించి ఆగోయ్యి మధ్యలోపడ్డట్టు ఇసిరించి __ ఆ వెంటనే ట్రక్కుని కొండవద్దకుతీసుకుపోయేడు.
    అలా పోస్తున్నమట్టినిచూస్తున్న సుదర్శనం __ తోపాటు, తన కుటుంబం ఉల్లాసమొంది.
    'అలాకాకుండా. ఒకేమారు ఆ మట్టిని ఆ గుమ్మితో లారీపాలంగా పడేటట్టుపోసిస్తే గుమ్మి వేగంగా నిండిపోతుంది. మెడ వేగంగా కట్టడం అవుతుంది. ఒకనేలఅద్దేకలిసినా ముందుగా కలుస్తుంది. అని పగటికళలు కాస్తున్నారు. ఆ మధ్యతరగతి ఉద్యోగులు.
    కాని ఆత్రక్కు గుమ్మేలోకి వెళ్ళాలంటే రోడ్డుపాయింటునుంచి మట్టిని జారవేసి కొన్ని ట్రక్కుల మన్నుపోసి రోడ్డువరకూ కలిపితేగాని ఆ త్రాక్కుని మెల్లమెల్లగా నడిపించి ఆ గుమ్మిలోవున్న పాలంగామట్టి పొయ్యిదానికి వీలుపడదు.
    అయితే ఇల్లులు కట్టించుకున్న వాళ్ళకు  ఇవన్నీ అనవసరం __ అందులో క్రొత్తగాడబ్బుగడిస్తున్న వాళ్ళకి ఆ విషయం మరీ అనవసరం.
    మళ్ళీ ట్రక్కు మట్టితీసుకువచ్చింది. మట్టిమనుషులు మొదట పోసినట్టే గుమ్మిలో మట్టినిపోసేరు రెక్కలుమాత్రం ఎక్కువదూరం విసురుతున్నందున నొప్పులు పుడుతున్నాయి. అలాగా ఆరోజు ఆ మర్నాడు రోజు ఆమూడోరోజు ఆ పదిమంది కూలోలోనే పనిజరిగింది. రోడ్డుకనుసరించి రెండుమూడుగజాల  వరకు గుమ్మిలోపల స్థలం పెరిగింది. ఇప్పుడు  త్రాక్కుకువున్న వెనకవుండలు, వుండడానికి వీలుగా  స్థలం కుదిరింది. అంతేమరి దిమ్మదిరగా మట్టిని మట్టి మనుషులు గుమ్మి మధ్యలోనే పోస్తున్నారు. అటు గుమ్మీ పెరుగుతుంది. ఇటు మట్టంగా స్థలంకూడా తయరవుతుంది.
    ఆ మర్నాడు __ ఆ గుమ్మిలోపలకు మట్టినిలాగి బలంగా కుమ్మడానికి అప్పుడప్పుడూ జారదిగిపోతున్న ట్రక్కు టేయిర్లు భూమిపట్టుచాలక అక్కడిక్కడే గిరగిరమని తిరుగుతున్నందున ఆ త్రాక్కుని వెనక్కీముందుకీ తొయ్యిడానికీ వీలుగా మరో ఆయిదుగురు పనోల్ని ఎక్కువగా తీసుకోచ్చీ హుషారుగా పనిచేయిస్తూన్నాడు. మేస్త్రీ.
    అంతలో ఆ దరి వెళ్తున్న కాంట్రాక్టరు కోటేశ్వరరావుగారు మోటారు బండినుండి గజంపోటులాగదిగి గుమ్మానిచూడడానికివచ్చేడు సుదర్శనంకూడ అయన రావడంచూసి  పరుగునడకనొచ్చి అతని పక్కన నిల్చున్నాడు.
    మేస్త్రీ 'అదోలా' ఇస్తుంటే  కూలోకిందా మీదాచూడకుండా పనిజేస్తున్నారు.
    "ఇలా పనిజరిగితే  లాభంలేదు ఈపాటికే ఈ గుమ్మి కప్పేడం జరిగిపోవాల" అని ఎజమాని అనడమే తడువుగా_
    "అవునండీ __పనోలు మరికొంచెం, చురక ఐన వాలైతే __గిమ్మి కప్పడం అనగా ఏమాత్రం అరగంటకాలంపట్టదు" అని ... పనివాళ్ళను హేలన చేస్తున్నట్టు అర్దమిచ్చేడు __ సుదర్శనం __ శునకంలాగ __ప్రక్కనుంటూ.
    వాళ్ళు ఇద్దరూ కలసి తననే అన్నట్టు గ్రహించేడు మేస్త్రీ.
    కోటేశ్వరరావుగారు మోటారుబండెక్కి వెళ్ళిపోయారు. సుదర్శనం టీ __ మంచినీళ్ళూ ఇవ్వడబడతాయే మోనని దొంగచూపులు చూస్తూ జారుకున్నాడు.
    ఈపని ఇంత లేటుగా అవుతుందని కోటేశ్వరరావుగారు అనడం. మేస్త్రీ కనకయ్యకు పాతబతుకు జ్ఞాపకం వచ్చింది. తాను కోటేశ్వరరావుగారి వద్ద మేస్త్రీగా పనిజేస్తుండి పదిసంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన జీతంఇవ్వగా ఆ యజమాని అదనపు బహుమానంగా ఏ చిన్న ఆశ చూపించినా అంటే ఒక జేత బాటాచెప్పులు కొనిస్తానని అతని నోటితో అంటేచాలు, నేలరోజుల్లో అవ్వవలసినవి కూలోలుచేత పదిహేనురోజుల్లో చేయించే దబాయింపు సెక్షన్ అతనిలో వుంది. మొన్న మొన్ననే ఎజమని కోటేశ్వరంగారు అతనిలో అన్నారు. "ప్రభుత్వంవారు పట్నానికి పొలిమేరల్లో బలహీనవర్గాలవారికీ ఇల్లులుకట్టించి ఇస్తున్నామని ఆ ఇల్లులపని తన ఎజమానికీ ఇచ్చేరనీ ఆ యజమాని అందులో తనకోఇల్లు ఇప్పిస్తానని"
    అతనన్నమాటలో ఈమాటకూడావున్నట్టు మేస్త్రీకిఅనిపించింది. మేస్త్రీకి ఆశ కనిపించింది.
    "ఇదిగో ఒరే కులోలూ, మీ పనులు సేత ఏమీ బాగులేదు కాలూ. సేతులూ కాలిపోయినట్టు కదపకుండా పనిజేస్తున్నారేట్రా? పెళ్ళిముస్తాబులు జేసినట్టు ఎన్నాళ్ళు రాచేస్తారుపని? ఇది పనోలుజేసిన పనికాదర్రా ఎట్టికీచేసి నొలు పనిలాగుంది! లేకపోతే చుట్టాకాల్చడానికి కొకడూ, ఉచ్చపొయ్యిడాని కొకడూ, ఒంట్లోనుబాగులేదని ఒకడూ వగలేయ్యలని సూతన్నట్టుగున్నారు,. నాకాడ సెల్లవానాటకాలు __పనిజేస్తేనేపైసాలు సెయ్యినొలు జేనాదేవ్  తీసిపారిత్తాను అది సూసుకోండి సేయ్యండి సేయ్యండి నాకోడకల్లరా" అని మేస్త్రీ ఒకడ్ని మెడపట్టితోసెడు _ఒకడ్ని సెయ్యిపట్టుకుని  ఇసిరేడు __ ఓకడ్ని బీపిమీద సేయ్యేసి గేంటేడు. ఒకడ్ని గసిరేడు. ఒకడ్ని తిట్టేడు.
    కూలోలందరూ రోజూ అలవాటులాగే ఆ తిట్టులుఆలకిస్తూ, అతన్నులు భరిస్తూ __
    'ఈ సమ్మిడి కొడుక్కి ఒక్కొక్కసారి పిచ్చేక్కుతాది. మమేటీ అనకపోయినా కుక్కనాగ అరుత్తు౦టాడు. మనం ఎంతపనిజేసినా చెయ్యలేదం  తాడు. ఆదిలాటోలకి అది సరదో, 'ఏటోమరి'  అని అనుకున్నోలు అనుకుంటూన్నారు.
    తిట్టులు కాయడానికి ఇష్టపడనివాళ్ళు ట్రక్కుమీద మట్టిని కోపంతో వట్టిసరుతున్నారు.
    తిట్టులు ఆడ్ని పాతీసినట్టు కొందరు మట్టిని గట్టిగాదట్టిస్థనన్నారు. అక్కడక్కడా గోలుగుతూ, గోణుకుతూ వున్నారు.
    "ఓరే __ ఏటా గోతిలో గులకరింపులు పనిజేస్తున్నారా. ఇంటి కేల్తారా. ఆ మన్ను ఇటులాగండి. ఈమన్ను అటుతొయ్యండి. అలగడ్డగాగట్టుపొయ్యండి. ఆట్రక్కు పక్కన కుప్పని నేరవండి. ఎక్కడపని అక్కడే వుందేట్రా ..... మీకిచ్చిన డబ్బులు దండుగూరా" అని __ నడిస్ఎద్దుని పోడిసినట్టు. పనిజేసి నైల్లనే తిట్టితిట్టి పనిచేయిస్తున్నాడు.
    ఎంతవేగం ఈ ఇల్లు కడితే అమ్తవేగం మేస్త్రీకి ఒక సొంత ఇల్లు వస్తుందన్న ఆశ.
    ఎంతవేగం ఈ ఇల్లుకడితే అంతవేగం సుదర్శనం అద్దేగుంజుకోవచ్చు ననే ఆశ.
    ఇక ఏ ఆశా లేనోలు __ పనోలు, కులోలు . కాని పనోలె ఆ ల్ల్లులు కట్టాల. పనోల అల ముగ్గురి కోర్కెలు తీర్చాలా.
    పనోలు రెక్కలు పికెటట్టు శ్రమించి గుమ్మాని కప్పేరు. పనోలు ముక్కలు సలిపేటట్టు మట్టిపోసి భూమిని గట్టిజేసేరు. పనోలు రాలు మోసి పునాదులు వేసేరు. పనోలు సుమటపోసి సిమ్మెంటును పిసికేరు. పనోలుజుత్తు ఎరదీసి గమేలాలతో సున్నామేసి సిమ్మెంటును పిసికేరు. పనోలు గుణపాలతో రాల్లు పోడిసి గుండెల మీద మోసి ఆ మూడిల్లుల మేడ కడుతున్నారు.
    ఈ పనుల్లో  ఒకనాడు ఒకపనోడు  ప్రాణం విసిగీ  తిండిలేకో, గుండె మండో, ఆకలెసో, పేగువాసో, ఉదయంపూట పనిజేసి, మధ్యానం పూట వుండి పోయేడు అదేపనోడు పెళ్ళం సీతాలు అదే కాంట్రాక్టరు కిందా, అదే మేస్త్రీ కిందా పనిజేస్తుంది. కాని జ్వరమొచ్చీ , జబ్బుచేసి,  నాలుగు రోజులు నాగా అయిపోయి వుండిపోయింది.
    "ఇద్దరవూ వుండిపొతే  ఎలాగ సెప్పు, నువ్వో నానో పని సెయ్యిడానికి ఎల్లకపొతే ఇద్దరి కడుపులూ ఎండిపోతాయ" మనకు పుట్టిన బిడ్డలు తిండిలేకో, పుట్టలేకో మద్దిలో ఎలాగా నచ్చివున్నారు. గొడ్డోలుం మనిద్దరమైనా బతకొద్దా?" అన్నది సీతాలు.
    "అయితే నిన్నేవులు పనిసేయ్యేద్దన్నారే ఎల్లే.... నువ్వే పనిసెయ్యి. ఎందుకో ఏటోగాని అమెస్త్రీ నమ్మిడీకొడుకు రావందువు దంచిత్తన్నాడు. సేమ్దాకలోను సెలక్కాయలు ఏపెసినట్టు మనుషుల్ని పనిమద్దిని తిప్పి తిప్పి సంపిత్తన్నాడు. అబ్బెబ్బే..... ఊపిరి తియ్యనివ్వోద్దా? ఎంతకీ అల డబ్బులు తింతున్నా ఆ...... ఇంతా.... ఆ తెచ్చిన డబ్బులు బియ్యం కొండే కర్రాలకి సాల్వు కర్రలు కొండే బియ్యానికి సాల్వు. ఆలు పెట్టిన బాధలన్నీ మనం పడుతుంతాము. మన బతుకులు తెల్లవారపు సూడు. నవొళ్ళు సూడు ఎలాగ వుడుకెక్కి పోతుందో. నానుమరి పనిపిల్లనే ఈ పూట తొంగు౦తాను" అని ముసుగు దాన్నీ సేడు ముసిలోడు .
    మొగుడు మాటలు ఇంటు౦టే పెళ్ళానికి నొప్పినిపించింది. మనస్సే౦త సాలోత్తేగాని ఆ మనిషి ఆ మాటలనడు. ఆ సంగతి సీతాలుకు బాగా తెలుసు కూలీనాలీ జనాల్లో బాధలూ, బందేలూ మొగోలేకాదు అడోలు కూడ పంచుకుంటారు.
    అందుకని __
`    "అయితే మరి నీఒంతుపనికి నానేఎల్తాను. పొద్దున్న పనిజేసి మద్దేన్న౦మానిత్తే ఆ మేస్త్రీ పూరాగరోజు కూలి కోసేత్తాడు"
    "కోసేత్తేకోసేని నువ్వూ జబ్బుల్దనికదా, ఏడేల్తావునే...... ఒద్దోద్దు వుండిపో"
    "బాగుంది బాగుంది . నీమాట నువ్వు సెడిపోయింది సాలక నన్ను సేడగొట్టకు "
    "ఓలదికాదే లంజా. నాను  మొగోగుడుననీ  నువ్వు ఆడదానివనీ నా పని నువ్వుసేత్టై వప్పుకోడు"             
    "ఏలోప్పుకోడు__ ఆఫీసుపనే ఆర్డరుపనే __ఒప్పుకోకవడానికి నువ్వుయినా నానైనా మన్నేత్తడ౦ సున్నాలు కలపడమేకదా"

 Previous Page Next Page