బాబు ముఖంలో సంతోషంతో విప్పారించింది __"నువ్వు చాలా మంచివాడివి నాకుతెలుసు . మనింటికి కొత్తమ్మ ఎప్పటికీరాడు" అన్నాడువాడు.
ఆ మాటలకు సంతోషంచాలో విచారించాలో తెలియని ప్రసాదుకు మర్నాడు రాత్రి అపురూపమైన అనుభవం జరిగింది.
ఆ రోజే నిరంజనరావు ఉద్యోగంలో చేరాడు సాయంత్రం తన గాడికి తిరిగివచ్చినపుడు అతడు బాబుకోసం మిల్క్ చాక్లెట్ తెచ్చాడు. వాడిని ప్రత్యేకంగా ఏకాంతంలోనికి తీసుకునివెళ్ళి ప్రసాదుచాలా మంచివాడనీ అలాంటి తండ్రివుంటే ఎలాంటి కొత్తమ్మ వచ్చినా కొడుక్కు అన్యాయం జరుగుదనీ చెప్పాడు ఇంట్లో అడతోడు లేకపోవడం ప్రసాడుకి చాలా ఇమ్బ్బందిఅనీ, ప్రస్తుతం ప్రసాదు ఆరోగ్యం అంతంతమాత్రంగా వున్నదనీ చెప్పి __"మీ నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకొనక పొతేనీకు తండ్రికూడా దక్కదు" అని బెదిరించాడు.
ఈ మాటలు బాబుపై బాగాపనిచేశాయి. ఆరాత్రి వాడు తండ్రిరాగానే "నాన్న __ నీకు పెళ్ళిచేసుకోలనివుందా?" అని జాలిగా అడిగాడు.
ఈప్రష్ణ విని ప్రసాదు తెల్లబోయాడు వెంటనే జవాబుకూడా ఏం చెప్పాలో తెలియదు.
"అలాగని చెప్పక్కర్లేదు అన్నీ నాకే తెలుసు...." ఆనందు బాబు.
ప్రసాదు నవ్వాడు.
"నువ్వు పెళ్ళిచేసుకో నాన్నా! కొత్తమ్మ నన్ను బాధలుపెట్టినాఫరవాలేదు. కానీ నువ్వుకూడా చచ్చిపోకూడదు....."
ప్రసాదు ఉలిక్కిపడి __"నేను చచ్చిపోవడమేమిటి?" అన్నాడు.
"నాకు తెలుసు. పెళ్ళిచేసుకోపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు" ఆనందు బాబు.
"అలాగని ఎవరు చెప్పర్రా నీకు?" ఆనందు ప్రసాదు.
"ఎవరూ చెప్పలేదు. అన్నీ నాకే తెలుసు...."
బాబు చాలా మెండివాడు. వాణ్ణి౦చి నిజం రాబట్టడం చాలా కష్టం. ప్రసాదు చాలాసేపు ప్రయత్నించినా నిరంజనరావుపేరు బయటపడలేదు.
"సుభద్రది జాలి గుండె బాబుకోసం నేను పెళ్ళి చేసుకోకూడదని గట్టిగ నిర్ణయించుకునే ఆమెకు నామీద జాలికలిగి బాబునావహించి ఇలా చెబుతున్నది" అనుకున్నాడు ప్రసాదు.
బాబుమాత్రం తండ్రిపెళ్ళిచేసుకుని తీరాలని మొండికేసాడు అప్పుడు ప్రసాదు వాడితో __"చేసు పెళ్ళిచేసుకుంటే అదినీకోసమే . నిన్ను కన్నబిడ్డకులా చూసుకునే కొత్తఅమ్మకవాలి. కొత్తమ్మను నువ్వే ఎన్నుకుని చూపిస్తే నేను తప్పక పెళ్ళిచేసుకుంటాను. మంచి అమ్మను నువ్వేవెతికి అప్పుడు నాకుచెప్పు అంతవరకూ నేను పెళ్ళిచేసుకోను ..." అన్నాడు.
ఏమనుకున్నాడో బాబు అప్పటికి ఊరుకున్నాడు.
ప్రసాదు ఆ రాత్రులూ వాడికి ఉదయ, వసంతలక్ష్మి ల మంచితనం గురించి ఎంతగానో చెప్పాడు. బాబు శ్రద్దగా విన్నాడు.
20
బాబు దిగులుగా కూర్చుని ఉండ౦చూసి __ "ఏరా అలాగున్నావు?"
"నువ్వునన్ను ఏరాగిరా అంటావేం? నేనునీకేమీ కనా?" అన్నాడు. బాబు అదోలా.
ఏమీ కావడంఅంటే? అంది శైలజ అర్ధ౦కాక.
"నువ్వు మీమ్మని అమ్మాఅంటావు..... నాన్నని నాన్నా అంటావు.... ఎందుకంటే అమ్మనీకు అమ్మవుతుంది నాన్ననకు నాన్నవుతాడు. నేనేనీకు ఏమీకాను అందుకని ఏరా అంటావు" అనిఆగి "మనంమనకు ఏమీకాని వాళ్ళను ఏరా అనీ ఏమే అనీ పిలుస్తాను తెలిసిందా?" అన్నాడు బాబు.
అప్పుడు శైలజ బుర్ర చురుగ్గా పనిచేసింది "అయితే నువ్వూనాన్నలాగే పిలుస్తున్నావు. నేనూనీకు ఏమీకానా?" అంది.
నాకునువ్వంటే చాలాఇష్టం . నిన్ను ఇంకోలాపిలవాలనే ఉంటుంది. కాని మీ అమ్మదెబ్బలాడుతుందనిభయం __" అన్నాడు బాబు.
"నన్నేమని పిలుస్తావో చెప్పావా?" అంది శైలజ కుతుహాలంగా
"వద్దుబాబూ మీ అమ్మ దెబ్బలాడుతుంది" __ అన్నాడు బాబు.
"అమ్మకు నేను చెప్పి ఒప్పిస్తానుగా" అంది శైలజ.
"అయితే నేను నిన్ను చేల్లీఅని పిలుస్తాను. నువ్వు నన్ను అన్నయ్యా అని పులుస్తావా?" అన్నాడు బాబు ఆశగా.
"అన్నయ్య __ భలేభలే .... చాలా బాగుంది."అంది శైలజ.
"అయితే ముందు మీ అమ్మదగ్గరకు వెళ్ళి చెబుదాం పద"బ్ అన్నాడు బాబు. ఇద్దరూ వరలక్ష్మి దగ్గరకు వెళ్ళారు. బాబుమేకు విషయం చెప్పాడు.
"ఇందులో తప్పేము౦దిర్రా __ అలాగే పీల్చుకొండి"అంది వరలక్ష్మి .
"చూశావా __ మా అమ్మ నేను చెప్పినట్లే ఒప్పుకుంది...." అంది శైలజ గర్వం దాని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
"అయితే నేను అమ్మా అని పిలవ్వచ్చా?" అన్నాడు. బాబు చటుక్కున.
"వరలక్ష్మికి జాలివేసింది __ "దానికేముంది __ అలాగే పిలుబాబూ!" అంది.
"నిజంగా నువ్వోప్పుకున్నావా?" అన్నాడు బాబు.
"ఊం" అంది వరలక్ష్మి.
"అమ్మా.... అమ్మా.... అమ్మా" అని ఎన్నో మారలామేను. పిలిచి అనందిచాడు బాబు. వాడి కళ్ళలోని సంతోషం చూస్తుంటే వరలక్ష్మికి కళ్ళ నీళ్ళు తిరిగాయి.
తల్లికోసం బాబు తపించిపోతున్నాడు. అమ్మా అని ఎవరినైనా పిలవాలని తహతహాలాడిపోతున్నాడు. అటువంటి బాబుకు తల్లి దూరమైనదంటే భగవంతుడనేవాడి ఉనికినే శంకించవలసివుంటుంది.
వరలక్ష్మి వాణ్ణి దగ్గరగా తీసుకుని "ఎప్పుడురావాలనిపిస్తే అప్పుడు మాయిమ్తికిరా. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నన్ను అమ్మా అనిపిలు. నీకేం కావలసినా నన్నడుగు"_ అన్నది.
ఆ పరిష్వగసుఖం అనుభవించాడు బాబు. వాడి మనసుగాలిలో తెలిపోతున్నది.
వరలక్ష్మి వాడిని వదిలి __"పోయి ఆడుకోండి" అన్నది.
మరికాసేపు ఆమెవద్ద వుండాలని వాడికున్నది కానీ శైలజధ్యాస అటలమీదవుంది. ఇద్దరూ ఇంట్లోంచి బయటపడగానే వసంతలక్ష్మి వాళ్ళను తనింటికి తీసుకుని పోయింది.
శైలజను ఒకసారి చాటుగా తీసుకునివెళ్ళి _ "ఈరోజు నువ్వు వాడికి చెప్పేసెయ్. నన్ను అమ్మాఅని పిలవమని" అన్నది.
శైలజ ఆశ్చర్యంగా "వాడు మా అమ్మని అమ్మా అని పిలిచాడు "అని చెప్పింది.
వసంతలక్ష్మి ఆశ్చర్యపోయి దాన్ని మరొకొన్ని వివరాలడిగి జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయింది.
తను ఎంతోకాలంగా ప్రయత్నించి సాధించలేకపోయిన విశేషం ఎ ప్రయత్నమూ లేకుండానే సాధించింది వరలక్ష్మి. అంటే ఆమెలో ఏదోవిశేషముంది. అదేమిటో తెలుసుకోవాలి ఎలా?
వసంతలక్ష్మి శైలజనూ, బాబునూ బయటకుపంపి తన ఒక్క ర్తీవిడిగా కూర్చుని అలోచించసాగింది.
వరలక్ష్మిని తనేమని అడగాలి?
తను ప్రసాదును వివాహం చేసుకోవలనుకున్నది. అందుకు బాబు ప్రతిబంధకమైనాడు. పెళ్ళికిముందే వాడు తనని తల్లిగా గుర్తించాలి. అమ్మా అనిపించాలి.
ఈ విషయంలో సిగ్గుపడి లాభంలేదు. అసలువిషయం చూచాయగా నైనా వరలక్ష్మికి చెప్పుకోవాలి.
వరలక్ష్మి ఎంతో మంచిమనిషి. తన రహస్యన్నామే కడుపులో పెట్టుకుని దాచలేదు. ఆమేనాశ్రయించడం మినహా వేరేదారిలేదు తనకు.
ఈ విషయమైనా ఒక నిర్ణయానికి రావడానికి వసంతలక్ష్మి కొద్దిగంటలు పట్టింది. సాయంత్రం ఆరింటికామే వరలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అప్పుడామెకు అప్పుడే ఆ ఇంట్లో౦చి బయటకు వస్తున్న ఉదయ ఎదురయింది.
ఉదయ ఆమెనుచూసి నవ్వలేదు. ఆమెను పలకరించలేదు. చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
వసంతలక్ష్మి గుండెల్లో మటుక్కు రాయిపడింది.
21
ఆరోజు బాబు పుట్టినరోజు .
నిరంజనరావునీ, గంగాధరం, సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి ల కుటుంబాలనూ సాయంత్రం అల్పాహారవిందుకు ఆహ్వానించాడు ప్రసాదు. వరలక్ష్మి కుటుంబం ప్రత్యేకంగా బాబు కారణంగా ఆహ్వానించబడింది.
పదార్ధాలన్నీ హొటల్నుంచి ఆర్డరుచేసి తెప్పించాడు ప్రసాదు. వాటిని అందరికీ పంచి ఇవ్వడంలో ఆడవాళ్ళంతా కలసి సహకరించాడు.
ఆరోజు బాబు కొత్తడ్రస్సు వేసుకున్నాడు. జీన్స్ పాంట్. దానిమీద జాన్ మకేనరోన్ ఉన్న స్పోర్ట్స్ షర్టు __ వాడు చూడముచ్చటగా వున్నాడు.
అందరూ బాబుకోసం ఏవో బహుమతులుతెచ్చారు. వాడు తండ్రిని వేధించి శైలజకోసం ఒకనీలి స్కర్టు, స్పోర్ట్స్ షర్టు కొనిపించాడు. ఆ బట్టల నది అక్కడే పార్టీలో వేసుకోవాలని పట్టుబట్టాడు.
వరలక్ష్మి అలాగే చూసింది.
పెద్దలందరూ సోఫాల్లోనూ , కుర్చీల్లోనూ కూర్చున్నారు. పిల్లలు ఆటల్లోపడ్డారు.
పెద్దల చర్చావిషయం బాబు. వాడుతల్లికోసం తపించిపోతున్నాదనీ ప్రసాదు త్వరగా విఇవాహం చేసుకోవాలనీ మాటల సందర్భంలో వరలక్ష్మి అన్నది.
దానికి బదులుగా ప్రసాదు వెంటనే __ "తల్లిని వెదుక్కునే బాధ్యత బాబుకే అప్పజెప్పాను. వాడో అమ్మాయిని తీసుకువచ్చి ఈమె నా అమ్మ అంటే ఆమెను నేను పెళ్ళిచేసుకుంటాను...... " అన్నాడు.