Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 14

  

    "రాజారావు నక్సలైటంటే నేను నమ్మలేను. అతడీ ఊళ్ళో చాలాకాలంపాటు౦డటానికని వచ్చిన వాడిలా కనిపిస్తున్నాడు. మనిషి సాత్మీకుడు. ఆశయాలు మంచివి__" అన్నాడు కనకరాజు.
   
    ఆ యువకుడు నవ్వి __"ఎంత తెలివిగా పథకాలు వేయకపోతే, వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళనే దోచేసుకోగలుగుతున్నారంటారు? చివరి క్షందాకా వాళ్ళేవరికీ ఏ అనుమానమూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు......" అన్నాడు.

    రమాకాంతం ఓ క్షణమాగి _ "ఆ ఉత్తరాన్నీ యనకు చూపించండీ __" అన్నాడు. కనకరాజు వెంటనే ఆ ఉత్తరాన్ని గురించిన కథంతా వివరంగా చెప్పి __రమాకాంతం చెప్పినట్లే చేశాడు.

    ఆ యువకుడా ఉత్తరాన్నందుకుని చదివాడు. అతడి ముఖంలో చిరునవ్వు లాస్యం చేసింది. _ " మీ అభ్యంతరం లేకపొతే ఈ ఉత్తరాన్ని నా దగ్గరుంచుకుంటాను. నా పరిశోధనలో ఉపయోగిస్తుంది __" అన్నాడతడు.

    "ఓయస్ __ ఉంచుకోండి __" అన్నాడు రమాకాంతం.

                                                                          10

    "మావయ్యా , మావయ్యా __"       

    వీధిలోకి వెడుతూ గవరయ్య, ఈ పిలుపెవరిదా అని ఆశ్చర్యపోతూ వెనుదిరిగాడు. నాలుగేళ్ల నీల అక్కడ నవ్వుతూ నిలబడి ఉంది.

    గవరయ్య క్షణంపాటు తడపడ్డాడు. వెనువెంటనే అతడిలో ఉక్రోషం రేగింది. అంతలోనే అమాయికమయిన నీల ముఖం అతడి నాకర్షించిగా, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో __"ఏం పాపా!" అన్నాడు.

    "అమ్మ నిన్నోసారి రమ్మంటో౦ది __"

    గరవయ్య మళ్ళీ తడపడ్దాడు. ఆమెకు తనతో ఏం పని? అందులోనూ రాజారావింట్లో ఉన్నట్టు లేదు. అతడుండి ఉంటే పాప __ నాన్న పిలిస్తున్నాడని చెప్పి ఉండేది కదా! అతడి మనసు పరివిదాల పోయినా, అడుగులు రాజారావు వాటవైపే వెళ్ళాయి.

    "మావయ్యోస్తున్నాడమ్మా!" అంటూ నీల లోపలకు పరుగెత్తుంది. గరవయ్య గదిలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాడు, అప్పుడు లోపల్నుంచేవరో వస్తున్న అడుగులచప్పుడు వినపడగా ఆ ప్రయత్నంగా ఆతడి తల క్రిందకు వంగిపోయింది.

    "కులాసాగా ఉన్నావా?"

    అడగో౦తుకు బదులు మనగోంతు వినిపించడంతో ఉలిక్కిపడి, గురవయ్య తల్లెత్తిచూసేసరికి అక్కడ రాజారావు ఉన్నాడు.

    "పాప __ అమ్మ పిల్చి౦దని చెప్పింది ....." అన్నాడు గరవయ్య .

    "నిన్ను పిలిచే అధికారం __ నీ అక్కకాక నాకుండదు కదా __ ఎటొచ్చీ నీతో పనున్నది మాత్రం నాకే !" అన్నాడు రాజారావు.

    "ఏంటా పని ?"

    "నీ సహాయం కావాలి నాకు ....."

    "ఏ విషయంలో ?"

    "చూడు గరవయ్యా _ నువ్వు యువకుడివి . శరీరంలో సత్తువుంది. ఇంట్లోడబ్బుంది. ఆ రెండూ కలిపితే ....."

    రారజారావుని మధ్యలో ఆపి __ 'మీకు డబ్బుకావాలా?" అన్నాడు  గరవయ్య.

    "అక్కర్లేదు __ నీ శరీరంలో సత్తువుంది. _ అది కావాలి."

    "అంటే ?"

    "నీకు బోలెడుమంది స్నేహితులు , వాళ్ళూ , మనం కలసి మాన వీధిలో కంకర రోడ్డోకటి వేద్దాం ....."

    "ఎందుకని ?"

    "ఎందుకేమిటి? ఊళ్ళో రోడ్లెంత అద్వాన్నంగా ఉన్నాయో చూడు జనమేవ్వరూ ఈ విషయం పట్టించు కోవడంలేదు.  మనలాంటి వాళ్ళం నలుగురం ముందుకొచ్చి ఈ పని చేబట్టామంటే __ మిగతావాళ్ళు కూడా మేల్కొని , వాళ్ళ రోడ్డ్లూ బాగుచేసుకుంటారు......."

    గరవయ్యకు కాస్త సంతోషం కలిగింది __ రాజారావు తనను కూడాఅతడిలో కలుపుకున్నాడని!

    అతడిమౌనాన్ని అవకాశంగా తీసుకుని రాజారావు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు __ '"ఎందుకో నువ్వు నన్నాకర్శించావు. నీ గురించి చాలామంది చెడ్డగా చెప్పారు.కానీ ఆ దోషం నీదని నేననుకోను. అది నీ స్నేహితులది నీలో తెలివి వుంది. ప్రోత్సాహం లేక అణగారిపోయింది. నువ్వోప్పుకుంటే, నెఉ నిన్ను మెట్రిక్ ప్యాను చేయిస్తాను. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కంకర కొనడం __ రోలరోకటి అద్దెకు మాట్లాడం ఆపైన శ్రమదానం .... ఇంత మమ్చిపనికెఇ నవ్వు సాయం చేయనంటావని నేననుకోను ....."

    అనాలనుకున్నా అనలేక _ "అలా గేనండీ __ ప్రయత్నిస్తాను __" అని అక్కణ్నించి  లేచి వెళ్ళబోయాడు గరవయ్య .

    "ఉండు __ నీ అక్కయ్య చేతికాఫీ...."

    వాడి బాణంలా తగిలిందా మాట గరవయ్యకు. ఈ మాట అతణ్ని దారుణంగా బాధిస్తోంది. తనలో తనే అస్పష్టంగా ఏదో గొణుక్కుని , అలాగే కూర్చుండిపోయాడతడు.


        "మంచికో , చెడ్డకో నువ్వు నా తమ్ముడివయ్యావు. తమ్ముళ్ళు లేని నాకిది సంతోషాన్నే కలిగించింది. అయితే నువ్వు నా తమ్ముడిలాగే ఎందుకుండవు ?" అంది వసంత.

    గరవయ్య ఆమెకు బదులివ్వలేదు. కాఫీ తాగడం పూర్తీకాగానే రాజారావువంక తిరిగి _ "మీరన్న విధంగానే చేస్తాను __" అని వెళ్ళిపోయాడు.

    వీధిలో నడుస్తూ అతడు జరిగినదాని గురించే ఆలోచనలోని ఏ ప్రత్యేకత అతడి నాకర్షించింది?

    అతడి ఎదురుగా అతడి భార్య చేయిపట్టుకుని తానతడికి తీరని అపచారం చేశాడు. కానీ, అతడు తనను క్షమించి , తనకు బుద్ధివచ్చేలా ఆమెను తనకు అక్కనుచేశాడు. అన్నింటికంటే విచిత్రం _ ఆమె కూడా తనను తమ్ముడిగా అంగీకరించడం!

    "తమ్ముడూ!" అన ఆమె పిలుపుతో మధురిమ ఉంది, ఆ మధురిమ అంచులలో తన ప్రవర్తన చేదుగా తగుల్తోంది.

    'నా తమ్ముడిలాగే ఎందుకుండవు?"

    ఈ మాటలు గరవయ్య 'యువక హృదయంలో సూటిగా నాటుకున్నాయి. ఆమె మాటల కర్ధమెమిటి? తన ప్రవర్తన ఏ అక్కా గర్వపడేలా లేదు సరిగదా __ స్వంత అక్కే తన్ను తమ్ముడిగా చెప్పుకోలేని విధంగా ఉంది.

    "అయితే నా ప్రవర్తనలో లోపమేమిటి?" అనుకున్నాడు గరవయ్య . ఆ వెనువెంటనే అతడి మనసు _ "లేనిలోపమేమిటి?" అని అడిగేసింది.

    తను తల్లితండ్రుల మాట వినడు. చదువుకోడు. పెద్దలను గౌరవించడు. జూదమాడతాడు. తాగుతాడు. వ్యభిచారం కూడా అప్పుడప్పుడు ....."

    కానీ రాజారావు తనంటే ఆకర్షింతౌతున్నాడు.

    రాజారావుకి ఊళ్ళో పలుకబడి ఉంది. చదువుకున వాడని మాత్రమే గాక _ మంచివాడు, పరోపకారి అని కూడా పేరుబడ్డాడు. అటువంటి రాజారావు తనతో ఇంతవరకూ అమర్యదుగా మాట్లాడలేదు. కానీ తన ప్రవర్తన గురించి చాలాసార్లు ఎత్తిపొడిచాడు. అద్సి అర్ధంకానంత మూర్ఖుడు కాదు తాను. కానీ ఏం చేయగలడు? తనలో లోపముంది. ఆ లోపం రాజారావేదుటే బైటపడింది.....

    "అసలు నేనెందుకు తాగాలి?" అనుకునాడు గవరయ్య.

    ఇలాంటి ప్రశ్న తను తాను వేసుకుంటానని ఎన్నడూ అనుకోలేదు గవరయ్య అసలటువంటి ప్రశ్నోకటుందనికూడా అతడు కింతవరకూ స్పురించలేదు. అవును. తనెందుకు తాగాలి?

    అలవాటువల్లతాగడమే కానీ __నిజానికి సారా రుచిగా ఉండదు సరిగదా, గొంతు మండుతుంది. తక్కువ మోతాదులో ఆరోగ్యాన్నిస్తుందేమో కానీ _ తను తాగే డోసులో ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తుంది. పోనీ తెలివిని పెంచుతుందాఅంటే __ ఉన తెలివికి మైకం కమ్మి __ నలుగురులో అపహాస్యం పాలవుతాడు.

    అయినా తను తాగాలి. ఎందుకంటే అలవాటుపడ్డాడు కనుక .... ఒకసారి అలవాటుపడ్డవాడిది మానలేడు. అలా జీవితం నాశనం కావాల్సింద.

    జీవితమూ, నాశానమూ అనుకోగానే గరవయ్యకు భయం వేసింది. తనకింకా ఇరవై ఏళ్ళే. ముంది౦కా బోలెడు జీవితముంది. అదిప్పట్నుంచీ నాశనం కావడమే?

 Previous Page Next Page