ఒకవేళ సాకేత ఉండే ఇళ్ళు ఆ ప్రాంతంలోనే అయితే అర్జెంటుగా వెళ్ళి ఎడ్రసు తెలుసుకోవలనుకున్నాడు గాని వ్యవధి లేకపోయింది.
సాకేత తప్పించుకుని కాని జీపు ఇప్పుడు అతని కారుని అనుసరిస్తూంది.
* * * *
రాత్రి ఎనిమిది గంటలు కావస్తూంది.
భూగోళం గుండె చెరువైనట్టు చీకటిలో సముద్రం హొరు పెడుతూ ఆకాశం కళ్ళలోకి ఆర్ధ్రతగా చూస్తూ౦ది. నింగిపైకి అప్పుడే వచ్చిన చంద్రుడు నిశాదేవి శూన్యహస్తాలను చూసి వ్యక్తావ్యక్త చైతన్యంతోకదులుతూ వెన్నెలని నీటి పైకి చిమ్ముతున్నాడు.
ఒడ్డునున్న ఇసుక తిన్నెలు అరమోడ్పులయిన నేత్రాలతో ప్రియుడి సమాగమం కోసం ఎదురుచూసే జవరాలి కంటిపైన ఆరకుండా మెరిసే తటిల్లతల్లా వెలుగురేఖల్ని అడ్డుతున్నాయి.
"నమస్తే ."
ఆలోచనలనుంచి తేరుకున్న హనిత ఉద్విగ్నంగా తలతిప్పి చూసింది. జీవమొచ్చిన జపమాలలా చేతులు జోడించి నిలబడ్డ కిరిటీ ఆమె అనుమతికోసం అన్నట్టు చూస్తుంటే మృదువుగా నవ్వుతూ అంది ..... "ఇది అఫీసుకాదు. అడక్కుండా కూర్చోవచ్చు."
ఇంటిదగ్గర నిలకడగా ఉండలేకపోయిన హనిత పావుగంత్య ముందే అక్కడికి వచ్చింది.
ఆమెకు సమీపంలో కూచునే సాహసం లేనట్టు నాలుగడుగుళ దూరంలో చతుకిలపడి బుద్ధిమంతుడయిన విధ్యర్ధిలా అమెనో క్షణం చూశాడు.
తఒలిసారిఉ ఆమెను కలసింది ఇక్కడే.
కాని అప్పటికీ, ఇప్పటికీ చాలా వ్యత్యాసముంది.
రోడ్డుపైన వెలుగుతున్న సోడియం వేపర్ దీపపుకాంతి పలచగా సాగివచ్చి ఆమె చెంపలను తాకి పసిమితో చెక్కిళ్ళను నక్షత్ర పర్ణశాలగా మార్చుతూంది.
"ముందుగా" హనిత నేత్రాంచలాల్లో ఒక మెరుపు మెరిసి మాయమైంది "కంగ్రాట్స్!"
ఇదీ కిరితీకి ఈ కలయికలా ఊహించలేని అభినందనే. సమీపంలోని సముద్ర సింహనాదాల్ని మించిన కిరిటీ గుండెల్లో.
"కనీసం తాంక్సకన్నా చెప్పరేం?" హనిత సునాయాసంగానే గ్రహించింది కిరితీకి అంతా నమ్మశక్యంగా లేదని . "మీకు .... ఐ మీన మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ య్యారు."
"వ్వాట్?"
"ఓ కెరటం తీరం దాటి నురుగుపూలను మోసుకొస్తూ అతని పాదాల్ని తాకుతుంటే విస్మయం భీకర్లోల్లాసంతో కంఠాన్ని చేరి చీకటి గుండెల్లో ఆశల దివ్వెను వెలిగించి ఉలిక్కిపడేట్టు చేసింది.
"అవును మిస్టర్ కిరిటీ ....! యూ ఆర్ గోయింగ్ టు బి అవర్ జాయింట్ జనరల్ మేనేజర్ ." ఒక మంజీర ధ్వనిలా హనిత గొంతు నుంచి మరోసారి వినిపిచింది. "నిజం!"
కిరిటీ కంపించిపోతున్నాడు. కాదు, అంతకుమించి భావానికందని ఓ చిత్రమయిన ఉద్వేగంతో నలిబలై పోతున్నాడు. ఇప్పుడు వినిపించిన ఆ వాక్యం చెప్పింది ఓ స్నేహితుడే అయితే అమాంతంగా గాలిలోకి లేపిబంతిలా పైకి విసిరేవాడు. కనీసం ప్రేమించిన అమ్మాయి లాంటిది. అయ్యుంటే చేతుల్లో చుట్టేసి మాంచి ఊపులో సముద్రంలోకి లాక్కుపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యేట్టు మీదపడి ఒళ్ళంతా ముద్దులతో ముంచేసేవాడు.
"ఏంటాలోచిస్తున్నారు!" హనిత అడిగింది. పరిశీలనగా చూస్తూ ..... "మిమ్మల్నే?"
"నమ్మలేకపోతున్నాను" ఇంకా కంగారుపడుతూనే అన్నాడు.
మృదువుగా నవ్వింది అతని అపనమ్మకపు పొరల్ని చీల్చే అక్షయ టూణీరంలా. మరుక్షణం హనిత మొహంలో గ్రీష్మం సైతం ఆమని గొంతులో సాడే గానంలాంటి ఆహ్లాదపు ముగ్ధత్వం.
"ఎందుకని?"
"ఎప్పుడూ అనుకునేవాణ్ణి."
"ఏమిటి?"
"మగాడు కావాలనుకున్న రూపాయి ఖరీదు వస్తువుని రెండు రూపాయలకు కొంటే, అమ్మాయి తనకు "అక్కర్లేని రెండు రూపాయల వస్తువుని రూపాయికి కొంటుందని ."
పంటి బిగువున చిరుకోపాన్ని నొక్కిపట్టింది. "అంటే మీ ఉద్దేశ్యం . మీరు అక్కరలేని మనిశానా? లేక తక్కువ ధరకి మిమ్మిల్ని నా వాడిగా ఐ మీన మా సంస్థకి కావాల్సిన వ్యక్తిగా కొన్నాననా?" తన మాటల్లోని అపశ్రుతి అమీ ఇబ్బందిగా అనిపించిందేమో అసంకల్పితంగా తల వంచుకుంది.
"అర్ధమైంది."
"ఏమిటి?"
"ఈ ఉద్యోగం నాకే రావాలని మీరు ఎంత శ్రమపడిందీ."
చివాలున తల పైకెత్తింది.
"అవును హనితా." ఇప్పుడు కిరిటీ గొంతులో చిలిపితనం లేదు. "అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో మీరూ, మీ నాన్నగారూ తప్ప మరెవరూ నాపైన ఆసక్తిని ప్రదర్శించలేదన్న విషయం తెలుసుకోవటానికి నేనో ఇంటలేక్ట్ ని కావాల్సిన అగత్యం లేదేమో!"
"యూ ఆర్ థరోలీ మిస్టేకెన్" ఓ వాస్తవాన్ని మరుగుపరచాలనినిజాయితీగానే ప్రయత్నించింది..... "అంతా ఇంప్రెస్ అయ్యారు మీ జవాబులతో."
"వెల్ .... ఇంతదాకా వచ్చాక ఓ విషయం చెప్పడం తప్పనిసరేమో," తన ఆర్గ్యుమెంట్ ని విశ్లేషిస్తూ అన్నాడు. "ది గ్రేట్ అమెరికన్ సక్సెస్ స్టోరీ" ని పభ్లిష్ చేసిన ఇమడస్ట్రియల్ సైకాలిసజిస్ట్ జార్జి గేల్స్ చెప్పిన విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి." ఓ క్షణం అగేడు. "నేనో సక్సెస్ పుల్ పర్సనాలిటీగా నన్ను నేను పరిచయం చేసుకోవటం లేదు. జార్జి గెలఫ్ థియరీ ప్రకారం కామన్ సెన్స్ అన్నది తన తప్పుల్ని తను తెలుసుకోవడంలో మాత్రమె అభివృద్ధి చెందదు ఇతరుల పోరాపాటలతోనూ దాన్ని పెంచకోవచ్చు."
"అంటే ?" కిరిటీ లోటును మరింతగా తరచి చూసే అవకాశం దక్కినట్లు అబ్బురంగా చూస్తూంది.
"మీరు ఇందాక యథాలాపంగా నోరు జారేరు నన్నో అక్కర్లేని మనిషిగా కాక సంస్థకి కావాల్సిన వ్యక్తినే కొనుక్కున్నానంటూ ... ఇది చాలు. నీమీద మీరు మాత్రమె ప్రత్యేకమైన శ్రద్దని చూపించారని తెలుసు. కోవడానికి......"
కొన్ని క్షణాలపాటు హనిత మాట్లాడలేకపోయింది.
ఇదే ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం ఆమెకు ఈ కిరిటీ తారసపడ్డాడు. కాని ఇంత లోతైన వ్యక్తిగా కాదు. చాలా మామూలు యువకుడిలా. నిజమైన విజయానికి తార్కాణం లేదా ఎదుటి వ్యక్తిని పూర్తిగా గెలవటానికి అసలైన సూత్రం తన ఆలోచనల్లో నిబద్దతే _ దాన్ని వ్యక్తం చేయడంలో నైశిత్యం మాత్రమె అయితే, ఇదిగో ... ఇక్కడో అబ్బాయి మొన్న అల్లరి పిల్లవాడిలా కనిపిస్తేనేం హనిత పైన పూర్తీ విజయాన్ని సాధించాడు.
"వెల్ ..." ఇప్పుడొక అత్మీయురాలిలా చూసింది. "మీ అనాలిసిస్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను . ఇంత స్వల్ప వ్యవధిలో ఒకమనిషిని జడ్జ్ చేయడం సాధ్యం కాని విషయమైనా మీ తర్కంతో నన్ను పూర్తిగా గెలవగలిగారు కిరీటి ....."ఆమెలో సంశయంలేదు. చాలా విషయాల్ని స్పష్టం చేయటానికి ఇంతకు మించి అవకాశం రాదన్నట్టు మనసు విప్పి మాట్లాడడం మొదలు పెట్టింది. "డాడీకి నేను ఒక్కగా నొక్క కూతుర్ని. ఈ విషయం ప్రత్యేకించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే ఒకవేళ నా స్థానంలో కొడుకే ఉంటే తప్పనిసరిగా నాన్నగారికి నిజమైన అండ కాగలిగేవాడు. నాకు తెలుసు నేను ఓ పెళ్ళి కావాల్సిన అమ్మాయిగా ఇలాంటి మార్గంలో అడుగుపెట్టడం నాన్నగారికి ఇష్టంలేదని కాని ఏం చేయను? సుమారు మూడు దశాబ్దాల క్రితం కేవలం అయన ఆలోచనలతో రూపు దిద్దుకున్న ఒక చిన్న యూనిట్ క్రితం కేవలం అయన అలోచనలతో రూపు దిద్దుకున్న ఒక చిన్న యూనిట్ ఈ రోజు శాఖోపశాఖలుగా విస్తరించి ఈ క్షణాన దారుణంగా తోరోగమిస్తుంటే చూసి భరించలేకపోయాను కిరిటీ!
అండగా ఉండాల్సిన వాళ్ళంతా పల్లకిలో కూర్చుంటే కేవలం డాడీ ఒక్కరే బావుయిగా శ్రమనంతా తన భుజాలపైన ఉంచుకుంటూ అనారోగ్యానికి గురయ్యారు. అదిగో అప్పుడు నా దృష్టి సంస్థపై పడింది. అయిష్టంగానే అడుగు పెట్టగానే అడుగుపెట్టాను. చాలా స్వల్పకాలంలో గాదె కిందపంది కొక్కులుగా మారిన వ్యక్తుల్ని పరిశీలించగలిగాను. ఇలాంటి పదజాలం వాడాల్సి వస్తున్నందుకు నాకూ మనస్కరించడంలేదు. కానే తప్పనిసరైంది. ఒక్క రోజుకాదు. ఒక వారం కాదు. కొన్ని నెలలుగా నాకున్న పరిమితమైన జ్ఞానంతో క్షుణ్ణంగా చదివేక అర్ధమైందిదే. నామ మాత్రంగా ఉన్న బోర్డు డైరెక్టర్స్ పరంగా గానీ, వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ సంస్థకి ద్రోహం చేసే కొందరు ఎగ్జిక్యూటివ్స్ మూలంగా గానీ __ కోట్ల లాభాలు ఆర్జించే బిజినెస్ గ్రిఊఫ్ యిప్పుడు నష్టాల్లో నడుస్తూంది."
"ఈ విషయాన్ని మీ డాడీ గమనించలేదా?" టక్కున అడిగాడు.
అది ఆమె ఊహించని ప్రశ్న కాదు.
"బహుశా గమనించారనుకుంటాను. కాని బయటపడ౦లేదు. దానికి నాకు తెలిసిన కారణం అందర్నీ గుడ్డిగా నమ్మడం అని అనలేను కాని, ఒక కుటుంబ వ్యవస్థలా సాగుతున్న వ్యక్తుల మధ్య అపార్దాలు సంస్థని మరింత అనారోగ్యకరమైన వాతారవరణంలోకి నెడతాయని అయన అభిప్రాయం కావచ్చు."
"సో" సాలోచనగా చూస్తూ అన్నాడు. "మీరు ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టారు."
ఇప్పుడు ఉలిక్కిపడటం ఆమె వంతైంది. చాలా గోప్యం సాగిస్తున్నాననుకున్నఒక కార్యక్రమం గురించి కిరిటీ బాహాటంగా _ స్టేట్ మెంట్ లా అనడం ఏను అరక్షణం పాటైనా కంగారు పెట్టింది.
ఆమె ఊహల్ని చదివేసినట్టుగా కిరిటీ వెంటనే చెప్పాడు. "ఒక సంస్థలో అడుగుపెట్టె వ్యక్తికీ ఆ సంస్థ గురించి కనీసమయిన అవగాహన అవసరమన్నది నా అభిప్రాయం మిస్ హనితా! ప్రోడేక్ట్ రేంజ్ సేల్స్ టర్నోవర్ గ్రోత్ రికార్డ్ కాంపిటీటి వ్ లు పొజిషన్ మాత్రమె అవసరమని గెలఫ్ ఆర్గనైజేషన్ స్పష్టం చేస్తే నేను మరో అడుగు ముందుకు వేసి కొన్ని వివరాల్ని సేకరించాను. అలా గ్రహించిందే మీ ప్రక్షళాన కార్యక్రమం కూడా."