Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 9

                                                                        

                                  ౩

    శ్రీ శాస్త్రిగారి ప్రజ్ఞ బహుముఖముల ప్రసంరించినది, వారి వ్యక్తిత్వమును క్రొత్త వారికి పరిచయపఱచ గోరెడు రచన కెంతయో నేర్పు గావలెను.  మరియు గ్రంధమా పెరుగును, అందుచే నేనిట కొన్ని కొన్ని పట్టులను స్పృశించి వదలెదను.

    కల్పనాసాహిత్యమును గూర్చి వారి యభిప్రాయము విశిష్టమైనది. అట్టి గ్రంధము లందు మనము చూచునది అసత్యమే! అసత్యపఠనలో కాలము వ్యయింప నేల? కవి ద్రష్టయైన గాని జీవిత సమస్యల లోఁతు తెలియ నేరఁడు. ద్రష్ట కాని వాని రచనలి కొలఁది లోతున నూరెడిజలము వలె దుష్టములు__ నిజమైన కవిత్వమునకు సబ్దార్ధాలంకారముల బరముల పని లేదు. ద్రష్టయైనవాని రచన లందు వస్తుగౌరవమును బట్టి అన్ని యలంకారములు నందు స్వతస్సిద్ధముగనేర్పడును. ఇందులకు గాంధీజీ రచనలే సాక్షి. మానవ విజ్ఞాన కల్యాణములను గూర్చు శాస్త్ర విషయగ్రంధములు పఠనీయములు.

    మరియు నిత్యజీవితములోని యనేక యదార్ధ సంఘటనలు కవితా వస్తువుగ స్వీకరించి, కరుణరస ప్రధానముగా నీతి ప్రబోధకములుగా అలఁతి యలఁతి మాటల కూర్పుతో సుందరముగ రచింపనగు నని వీరు తలఁ చెడివారు. ఆ రీతిని వారు కడుపుతీపు, విశ్వాసము, కపోతకధ, మూన్నాళ్ల ముచ్చట మొదలగు చిన్ని ఖండకావ్యములను రచించిరి.

    పూర్వసాహిత్యమున భవభూతి మహాకవి యుత్తర రామచరిత్ర వీరిని పులకింపఁ జేసేడిది. ఆనాటకమునకు వీరు చెప్పెడు వ్యాఖ్య ప్రతిభాసమన్వితముగా నుండెడిది. శాకుంతల మన్న వీరికభిరిచి తక్కువ. తుమ్మెద నెపముగా దంభము లాడుచు ప్రవేశించుదుష్యంతునిఁ జూచి వారు జుగుప్స పడెదరు! ఆ పాత్రకును నేఁటి రౌడీరసికునకు భేదము లేదని వారి యూహ. సాహిత్యమును గూర్చి వారికిఁ గల విశిష్టాభిప్రాయముల నన్నింటి నిట వ్రాయ ననువు గాదు. ఆ పనికి నేను చాలిన వాఁ డను కాను. వారి ఆత్మజిజ్ఞాస సాహితిరంగమున నెట్లు ప్రతిబింబించెనో చూపుటకు మాత్ర మిది వ్రాసితిని. తుదకు సాహిత్య వినర్సయందును, చరిత్ర పరిశోధన మందును కల్గు ఈర్శ్యాద్వేషాదులను రోసి వారు వానిని వదలి తమ జీవితమును మానవ సేవకే అంకితము జేసిరి. అ సందర్భమున వారు చెప్పిన పద్యములు.

    కవితాశిల్పము సల్పఁగాఁ దొలుత వేడ్కల్ రేగె నాకు౯, గృతుల్
    చివురెత్తె౯, వెస మోము మొత్తె, నిఁక నాచేఁ జెల్ల వీ కల్ల బొ
    ల్లి వినోదంబు, లవే జరామరణముల్ చీడల్ హతం బార్చి పు
    ట్టువు చెట్టు౯ సఫలీకరించుకొని యంటుల్ గట్టెద౯ మాలినై.
    త్రికరణశుద్ధిగా భవదధీనుఁడనై యితర ప్రవృత్తి వీ
    డికొని పరార్ధలాభ మొకటే గమనించుచు  నందు, నింక మా
    యికము ధనాదికమ్ము గణియింపను, సత్యదయోపకార సా
    ర్ధక మగునాత్మచింతనపధంబునఁ దప్పి చరింప నీశ్వరా!

    శ్రీ శాస్త్రిగారు కల్పనాసాహిత్యమును నిరసింతు రనియు. సాహిత్యమున సైతము కరుణను. నీతిని ప్రధానముగా నెంతురనియు, సాహిత్య కృషి యే వీడి రోగులను ట్రీట్మేంట్ చేయుటతో కాలము గడపెద రనియు వ్రాసిన దానిని బట్టి వారి సాన్ని ధ్యమున నుండుట యన శుష్క వేదాంతములతో నీరసజీవనమును గడపుట యని తలపోయరాదు. ఆయన నిజముగా సత్యాన్వేషి! కళారాధకులు! ఉత్సాహజీవి! వారి ప్రతి పనియందును ఈ గుణములు కన్పించుచుండెడివి. రకరకముల రంగు పెన్సిళ్ళు, కలములు చేతికఱ్ఱలు, వింత వింత వస్తువులు  సేకరించుటయందు వారికి ప్రీతి యెక్కువ. ఈ పెన్సిళ్ళను సేకరించుటే వారి వంతు గాని వాడుకొనుట యందఱివంతు! ఇట్లే ఫౌంటే ౯ పెన్నులు. దేనితో వ్రాసిన దస్తూరి సొంపుగా నుండునో యని చూచెడి వారు. చుట్టునున్న వారు తమ తమ పెన్నులతో పోటిపడెడు వారు. చిటికెనవ్రే లంతటి కొబ్బరి కాయల నెచటి నుండియో తెప్పించి వానికి వెండి పోన్నులు, మూఁతలు చేయించి స్వయముగా మెఱుఁగు వెట్టి స్నేహితులకు బహూకరింతురు. ఇట్టిది నాకొకటి ఇచ్చిరి. నేను నశ్యమునకైనచో వారాపని చేయరు.ఆ కాయలో దూదిపెట్టి అందు మంచి యత్తరు గాని యూడికొలోం గాని వేసి వాసన చూచుకొన వచ్చు నని వారు స్వయముగా మెఱుగు పెట్టి స్నేహితుల కిచ్చేడివారు. తాటిచేవతో చేయబడి గుర్తింపరానివి, పామువలె ఏ డెనిమిది వంకరలు తిరిగినవి,పెద్ద పెద్ద వెండిపోన్నులతో మెఱయునవి యగు రకరకముల      కర్రలు వారికడ నుండెడివి. ప్రార్ధనా మందిరములో కూర్చుండుటకు రకరకముల పొడల జింకలచర్మములు, పెద్ద పులిచర్మములు  తెప్పించేడివారు, వారికడకు తెలుఁగునాటి నాలుగుమూలలనుండి అన్ని వర్ణములవారును, అన్ని తరగతుల వారును వచ్చెడివారు, విరందఱిని తమవచోచమత్కృతితో  నలరించేడివారు. మరిము వారు వారు వాడిన క్రొత్త మాటలను గూర్చియు, వాని ఆనుపూర్వినిగూర్చియు అప్పటి కప్పడే ప్తెలాలజిని నిర్మించేడివారు. దోసె అనగా రెండు చేతుల వెడల్పుగల దనియు దో = రెండు + సెయ్ = చేతులు, అరసె యనగా  అరచేతి వెడల్పు గలదనియు (అర +సెయ్) అనియు నా భక్ష్యములకు క్రొత్తరుచి కలుగునట్లు చెప్పేడి వారు. ఇంక పండ్లుకోయదగిన పరువనులు, వాడఁదగిన  రీతులు,  కూరల రుచుల బహుపరిశీలనతోచెప్పెడివారు. గుంటూరు, కృష్ణాలలోని గోగుపచ్చడిని గూర్చి 'కడుపుతిపు' అను చిన్న పద్యకావ్యములో వారు ఇట్లు వ్రాసిరి.
 

 Previous Page Next Page