ఆమె అతికష్టంమీద నవ్వాపుకుంది.
"ఇంత సరదాగామాట్లాడే వాళ్ళను నేనెక్కడా చూళ్ళేదు."
నేనూచూళ్ళేదు.
"అయ్ లైక్ యూ!"
"అయితే మరి అలా ఆ చిక్కుడుపాదువెనక్కు వెళ్దాంపదండీ!"
ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం....
"ఎందుకు?"
"లైకింగ్ ఉందన్నారుగా! మిగతా వ్యవహారం....."
ఆమె సిగ్గుపడిపోయింది బాగా.
"ఇంత క్రూడ్ గా మాట్లాడకుండా ఉండలేరా?"
"ఇలాంటి విషయాల్లో డెలికసీపనికిరాదని మా క్రాఫ్ట్ టీచర్ ఎప్పుడూ చెప్తూండేవాడు. వాళ్ళావిడ కట్టెలు కొట్టేవాడితోవెళ్ళిపోయాక......"
"అంతా అబద్దం! మీ మాటలేమీ నేనునమ్మను."
"మహేష్ తులసిల నవ్వు వినిపించింది లోపల్నుంచి!"
"చూశారా! మనదే ఆలస్యం! వాళ్ళు చివరికొచ్చేశారు అప్పుడే!"
"బాగా పరీక్షగా చూస్తేగాని మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు."
"అంతగామారిపోయింది మీ మొఖం మాట మారుస్తూ అంది."
"తులసీమహేష్ బయటకి వచ్చారు."
"పద ఉమా వెళ్దాం!"
"ఉమా లేచి నిలబడింది."
ఊర్నుంచివచ్చాక కంటిన్యూచేయవచ్చు. రేపే వెళ్ళి ముందుజాయినయిపో! చెప్పాడు మహేష్.
"థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్! ఇదంతా తులసికోసం చేస్తున్నా కూడా!"
మహేష్ నవ్వాడు "డోంట్ మెన్షన్"
ఇద్దరూవెళ్ళిపోయారు.
"త్వరగావెళ్ళి బాంక్ లో డబ్బు తీసుకురా! బాంక్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ రేపు ఊరెళ్ళటానికి డబ్బులేదు."
పాస్ బుక్ తీసుకుని బాంక్ కి చేరుకున్నాడతను.
"లైట్లకాంతితో వెలిగిపోతోంది బాంకంతా."
మేకప్ వేసుకున్న అమ్మాయిలు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
"యస్!" అంది సేవింగ్స్ బాంక్ కౌంటర్ అమ్మాయి.
"నా ఒక్కడికేనా? ఎవరొచ్చినా ఇలాగే 'యస్' అనేస్తారా?"
ఆమె కోపం అణుచుకుంది.
"మీకేం కావాలో చెప్పండి!"
ముందు 'యస్' అని తర్వాత వ్యాపారం మాట్లాడేవాళ్ళను నేనెక్కడా చూళ్ళేదు.
ఆమెకేం చేయాలో తెలీలేదు.
పాస్ బుక్, చెక్ ఆమె ముందుంచాడతను.
చకచకరాసుకుని ఓ టోకన్ తీసి అతనికిచ్చిందామె.
"థాంక్యూ!"
కాష్ కౌంటర్ దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
అయిదు నిమిషాల తర్వాత ఆ అమ్మాయేలేచి సురేష్ ని చూస్తూ గట్టిగా అరచింది.
"టోకన్ నంబర్ నైన్టీవన్."
అయిదారు సార్లు అరిచాక సురేష్ ని చూస్తూకోపంగా అంది.
"మిమ్మల్నే! పిలుస్తే వినిపించదా?"
"నన్ను పిలిచారా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును, మీరు టోకన్ నైన్టీవన్ కదా?"
"నేను టోకన్ ని కాదు. నా పేరు సురేష్. నాకు తెలిసినంతవరకు మా ఫాదర్, మదర్ నాకు 'యాక్సిడెంట్' అని రెండో పేరు పెట్టారు. ఎందుకంటే నేను అన్ వాంటెడ్ చైల్డ్ నట. అహ్హహ్హ....."
ఆమె మొఖంలోరంగు మారింది.
"ఆల్ రైట్! మీ ఎకౌంట్ లో బాలెన్స్ లేదు."
సురేష్ త్రుళ్ళిపడ్డాడు.
"బాలెన్స్ లేదా?"
"లేదు!"
"సరిగ్గా చూడండీ! తొంభయ్ వేలయినా ఉండాలి."
"తొంభయ్ రూపాయలుంది."
"ఇదా! న్యాయం! బాంక్ వాళ్ళే ఎకౌంట్ లోని డబ్బంతా కాజేస్తే ఇంక మాకు సెక్యూరిటీ ఎవరు?"
"మేమేం కాజేయలేదు! మీరే డ్రా చేసుకున్నారునిన్న!"
"నేనా?"
"మీరంటే మీ జాయింట్ ఎకౌంట్ పార్ట్ నర్!"
"ఇంపాజిబుల్!"
"అలా అంటేనేనేం చెప్పలేను!"
"చెప్పలేకపోతే నా తొంభయ్ వేలునాకిచ్చేయండి."
"దయచేసి మేనేజర్ని చూడండీ!"
"నేనెవర్ని చూడను. ఆ డబ్బంతా మీ దగ్గరే వసూలు చేస్తాను. కాష్ ఆర్ కైండ్."
"నేనింక మీతో మాట్లాడాల్సింది ఏమీలేదు.ఆ టోకన్ ఇచ్చేయండి...."
ఇవ్వనుగాక ఇవ్వను.
"మీ ఇష్టంఇక!"
"మేనేజర్ రూమ్ లోకి నడిచాడతను."
"మీరు మేనేజర్ గారా?"
"అవును ఏం కావాలి?"
"నాకు డెకాయిట్స్ గాంగ్ లీడర్ కావాలి. ఆయన రూమ్ ఎక్కడ?"
"డెకాయిట్సేమిటీ?"
"అదే చంబల్ వాలీలో ఉంటారు చూడండి.....వాళ్ళు! వాళ్ళ నాయకుడు కూడా ఇక్కడే ఉండాలి కదా అనుచరులు ఇక్కడే ఉన్నప్పుడు."