Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 8

 

    "వెరీ గుడ్......మీలానే నాకూ అనిపించింది. అందుకనే ఒక భక్తురాలిగా అయన మందిరానికి వెళ్ళి వచ్చాను. విరాళాలు , కానుకలు అపారంగా రావడం నా కంటితో చూశాను. అక్కడి పరిసరాలను అయన భక్తులను ఆకట్టుకుంటున్న తీరు చూశాక ఎందుకనో నాకు అక్కడి వాతావరణంలో కృత్రిమత్వం గోచరించింది. సామాన్య పౌరులను 'మతం' భక్తీ' అనే ముసుగులలో వంచించడాన్ని నేను సహించను. అందుకనే నేటి నుంచి విష్ణు కార్యకలాపాలను ఒక కంట కనిపెట్టి తగిన సమాచారం వుంటే ఎప్పటికప్పుడు నాకు తెలియపరచవలసిందిగా మీ అందర్నీ ఈ సభాముఖంగా కోరుతున్నాను. నా బాధ్యతగా ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలిగా!"
    కంచు మోగినట్టు ఖంగుమందామే కంఠం.
    ఎవరూ ఉలకలేదు......పలకలేదు....
    చాలామందికి విష్ణు అంటే భయభక్తులు వుండటం ఒక కారణం ఐతే, ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందోననే భయం వల్లనూ ఎవరూ పెదవి విప్పడం లేదు.
    "వాట్ ఎబవుట్ యూ మిస్టర్ వినయ్?......అయన మీ జ్యూరిస్ డిక్షన్ లోనే తన మందిరాన్ని నిర్మించుకున్నాడు. అతనిని కనిపెట్టి వుండవలసిన బాధ్యత మీకు వున్నట్లే కదా..!
    "ఎస్ మేడమ్ ' అంటూ లేచి నిలుచున్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    "విష్ణు గురించి పరిశోదించగలరా అని నేను అడగడం లేదు. ఆ విషయం గురించి ఈపాటికే మీకు మీ కమీషనరు గారు ఉత్తర్వులు ఇచ్చే వుంటారు. కాకపోతే ప్రజలు తండోపతండాలుగా విష్ణుగారికి కానుకలు సమర్పించడం , వేలాదిమంది భక్తులుగా మారిపోవడం ఈపాటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అతని వద్ద కోట్లాదిరూపాయల ఆదాయం వుంది. అంతే కాదు కానుకల రూపంలో బ్లాక్ మనీ, డైమండ్స్, వజ్ర వైడుర్యాలు వగైరాలన్నీ అయన హుండీలో చేరిపోతున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు భోగట్టా.
    ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల - తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వరస్వామి వారి హుండీ లోని కానుకలే తరిగిపోతున్నాయట! విష్ణు విషయంలో ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా , అలాగే ప్రజలేవ్వరూ ఆయనచేత మోసగించాబడకుండా ....తిరుమలేశుని ఆదాయానికి గండి పడకుండా చూడడం కూడా మీ బాధ్యతే.......
    తనపై నిఘా వేశారు అనే విషయం విష్ణుకి తెలియనీయకుండా అతని చర్యలన్నింటినీ ఒక కంట కనిపెట్టి వుండండి. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ను తెలియజేస్తూ వుండండి.' ఉత్తర్వులిచ్చింది కలెక్టరు.
    సమావేశం ముగియడంతో ఆమె తన ఛాంబర్ కు వెళ్ళిపోయింది.
    పోలీస్ ఆఫీసర్లు అందరూ ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు.
    బరువెక్కిన హృదయంతో కలెక్టరు ఆఫీసు నుంచి బయటకు వచ్చి తన జెప లో కూర్చున్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    తన చాంబర్ ;లో వున్న కలెక్టరు ధీరజ చేతిలో విష్ణు ఫోటో వున్నది....ప్రభుత్వపరంగా వచ్చిన ఆర్డర్స్ అవి. భాద్యత గల అధికారిగా తన డ్యూటీ తను నిర్వర్తించింది ధీరజ. విష్ణు ఫోటో వైపే తదేక దీక్షగా చూస్తూ గజిబిజిగా ....గందరగోళం నిండిన మనస్సుతో ఆమె అస్థిమితంగా ఉన్నదన్న విషయం వినయ్ కుమార్ కు తెలిసే అవకాశం లేకపోయింది.

                                                   *    *    *    *

    టాక్సీ ఒకటి ఆ కాలనీ లో ఆగింది.
    టాక్సీ  దిగింది ఫారన్ స్టయిల్ లో రీటా. వానిటీ బాగ్ లో నుంచి అడ్రస్ స్లిప్ ను తీసి ఒకసారి చదువుకుని ముందుకు అడుగులు వేసింది.
    ఇంటి నంబర్లను చూసుకుంటూ తనకు కావలసిన ఇల్లు కనిపించడంతో ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది రీటా.
    తలుపు తీసిన ఇల్లాలు, వాకిట్లో ఆ అపరిచితురాలిని చూసి ఆశ్చర్యపోయింది.
    "రుక్మిణి అంటే మీరే కదూ.'
    మొహమాట పడుతూనే అవునన్నట్టు తల వూపింది.
    "నేను ఒక జర్నలిస్టు ను. బాబాలపై రిషేర్చ్ చేస్తున్నాను. విష్ణు గారి దీవెనల వాళ్ళ మీకు సంతానం కలిగింది అవి విని వచ్చాను ఆయనపై మీ అభిప్రాయం ఏమిటో చెబుతారా?" అడుగుతూనే అడుగులో అడుగు వేసుకుంటూ లోనికి వచ్చింది రీటా.
    విష్ణు పేరు వినగానే భక్తితో కూర్చుండిపోయిందామే!
    హటాత్తుగా ఆమెలో వచ్చిన మార్పుకు విస్మయం చెందింది రీటా.
    "విష్ణు గారు సామాన్యులు కారు.....అవతార పురుషులు. ఎన్ని గుడుల చుట్టూ తిరిగినా , ఎందరికి మొక్కుబడులు చెల్లించుకున్నా నా కడుపు పండలేదు. నాకిచ్చిన చిటికెడు విభూతిని స్వీకరించానో లేదో నెల తిరిగే సరికల్లా నేను గర్భావతినని తెలిసింది. అయన మహిమ వల్లనే పండంటి పిల్లవాడు పుట్టాడని నా నమ్మకం. అందుకే నా యింట నిత్యం పూజించే దైవం ఆయనే!"
    రుక్మిణి చెప్పుకుపోతున్నది.....
    "విష్ణుగారిది అంతా మాయ అనీ, కేవలం మెస్మరిజం చేస్తుంటాడని కొందరి వాదన. డానికి మీరేమంటారు?" రీటా ఆమెను సూటిగా ప్రశ్నించింది.
    "వాళ్ళ నోళ్ళు పడిపోను.....ఎవరున్నారు ఆ మాటలు! సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువే ఈ కలికాలంలో సామాన్య మానవుడిగా, విష్ణుగా అవతారించాడని భావిస్తున్నాను' తన్మయత్వంతో చెప్పిందామె.

 Previous Page Next Page