ఆపట్టున నే నచట నలుబది దినము లుంటిని. ఆ కాలమున ట్రీట్మేంటుకు సంబం ధించిన వింత లనేకము జరిగెను. వాని నన్నింటి నిట వ్రాయ వలనుగాదు. నాకు సంబంధించిన వొకటి రెండు చెప్పి విడిచెదను.
శ్రీ శాస్త్రిగారి వద్దకు చేరునప్పటికి నాకు ఏమి తిన్నను వంటఁ బట్టెడిది గాదు. నిద్ర ససిలేదు. కాని వలసి నంత యాహరమును నిర్భయముగ తిసికొమ్మని రనియు, పవలుసైతము నిద్ర పొమ్మని రనియు వ్రాసితిని. నే నా మాటల నక్షరశః పాటించితిని గాని అందుచే నెట్టి యసౌకర్య ము కలుగ లేదు. కొన్నాళ్ళయిన పిమ్మట ఒక ఉదయము " ఈ పూట ఏమి తీసికొంటి" వని శ్రీ శాస్త్రిగా రడిగిరి. రెండిడ్దేనలు, పదకొండుకు భోజనమా?" అని శ్రీ శాస్త్రిగా రనిరి. ఎక్కువ తింటిని గాబోలునని నేను నివ్వెరపోయితిని.' నీ ఒడ్డు పోడుగులకు రెండిడ్దేనలేమూల? అనాలుగుము" అనిరి. మరునాఁడు తిరిగి యడిగిరి." నాలుగు తీసికొంటి" నంటిని." ఆపైన" అని యడిగిరి." మామూలు పద్ధతి నొక యరకప్పు కాఫీ తీసికొంటి" నంటిని." ఇది కేవల మక్రమము. జోడిడ్దేనల కొక యరకప్పు. రెండు జోళ్ళకు నిండు కప్పు" అనిరి. మరునాఁడట్లు చేసితిని." ఇడ్దేనలు మాత్రమేనా? ఈ శాస్త్రము నీకు తెలియదు. విను! మొదట రెండిడ్దేనలు. వాని పై కొంచెము కాఫీ, ఆ మిఁద నుప్పుమావ్, దాని కాచ్చాదన దోసె, ఆ కప్పు మిఁద ఒక కప్పు కాఫీ పోయవలె" నని కడుపు చెక్కలగు నట్లు నవ్వించిరి. ఆ యూపుతో పూట కెన్మిది ఇడ్దేనలు, భోజన మున నరవీ శెడు కూరలు, రెండు కప్పుల పెరుగు; మధ్యాహ్నము నిద్రలేచి అరడజను పేవాజప్పళపండ్లు, కిస్మిస్, అంజూరా, ఆపిల్ఫలములు;యంత్రమునాల్గుబోండాలు,ఫీ; రాత్రిభోజనములోమామిడిపండ్లు- ఇంతవఱకువచ్చితిని. ఈరాకాసితిండినేఁడునేనేనమ్మఁజాలనట్లున్నది. లేకున్న నిరువది రోజులలో నిరువది పౌనుల తూకము పెరిగి యుండ నను కొందును!
ఒక రోజున అన్నామలై విశ్వవిద్యాలయములో గణిత శాస్త్రాధ్యాపకులుగా నున్న ప్రొఫెసర్ నరసింగరావుగారు వచ్చిరి. వారుగూడ యోగమిత్ర మండలిలోని వారే. శ్రీ శాస్త్రి గారి ఇంటనే బస.ప్రసంగవశమున నా కధయంతయు శ్రీ శాస్త్రిగారు చెప్పిరి. వా రాశ్చర్యముతో వినిరి.ఈ మాటలు జరుగుచున్నంత కాలము నాలో గుబగుబ మని యేదో సంచలనము జరిగెను. ఉచ్చ్వాస నిశ్వాసములు దిర్ఘములాయెను. వెన్నెముక నిత్తనిలువున బుసగొట్టు త్రాచువలె నిలిచెను. రెండు భుజములు వెనుక కొత్తుకొని రొమ్ము విప్పారెను. శ్వాసను కొలుచు పద్ధతి నాకు తెలియదు గాని, కొలిచినచో నది రెండు బారలైన నుండు నేమో! మా మువ్వురకు నాశ్చర్యము కలిగెను." ఎట్టి వ్యాయామము లేకయే ఇంతటి శ్వాస యెట్లు కలిగినది? చూచితిరా! ఇదంతయు మాష్టరుగారి దివ్యానుగ్రహము!" అని శ్రీ శాస్త్రిగా రనిరి. మాష్టరుగా రన వారి గురుదేవులు. శ్రీ శాస్త్రి గారు తమ వలన బాగాయిన వారందరితోను తాము నిమిత్తమాత్రుడనియు, మాష్టరు గారి యనుగ్రహమే సర్వని ర్వాహక మనియు చెప్పెడివారు.
నే నచట నున్న దినములలో ట్రీట్మేంటుకు వచ్చెడివారు. వారిలో రిక్షాలాగువారు, కస వూడ్చుకొను వారు, ఆఫీసుర్లు, ఉపాధ్యాయులు, యునివర్సిటీ ఆఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీయర్లు, లాయర్లు, సనాతనులు, శాయిబాబా మత ప్రవర్తకులు, కమ్యునిస్టులు, విద్యార్ధులు, కాంగ్రెసు నాయకులు మొదలగు పలు తెఱఁగులవా రుండెదివారు. తేలుక్జాటు, ఒడలు కాల్పు, గాలి సోకు, టైఫాయిడు, పరిణామశూల (Gastric ulcer) పైత్య కోశమున రాళ్లు (Gall stones), నంజు, జలోదరము మొదలగు అన్ని బాధలను శ్రీ శాస్త్రిగారు యోగ ట్రీట్మేంటు తోనే చక్క జేసెడివారు.
వీరిలో మిక్కిలి దయనీయుఁడగు నొక బాలుని గూర్చి వ్రాసెదను. ఆ బాలుని తండ్రి రిక్షలాగు వాఁడు. నాలుగు రోజుల క్రిందట ఆ బాలుఁడు కాలు జారి పడెను. అప్పటి నుండియు వానికి స్మృతి కలదు గాని నోట మాట లేదు. కనుపాప లొక ప్రక్కకు తిరిగి వెర్రిగా చూచును. మూతి వంకరపోయి యున్నది. మెడ ఒక ప్రక్కకు వాలెను.కాలు సేతులు ముడుచుకొని పోయి స్వాధీనమున లేవు. వానిని చేతులపై మోసికొని వచ్చిరి. ఆ బాలుఁడు ముద్దగట్టిన బాధవలె నుండును. వానిని చూచుటతోడనే దెబ్బతిన్న లేగ దూడను జూచి యడల గోమాత వలె క్షోభించిపోయిరి శ్రీ శాస్త్రిగారు. ఇటు బాలునియవస్ద, అటు శాస్త్రిగారి యవస్ద చూడలేక పోయితిమి. ఆబాలునికి లోని కాహారమేమియు ఇవ్వలేదని తెలిసికొని వాని తల్లిదండ్రుల పైనను, వారి దరిద్రము పైనను కటకపడి ఇంటిలో నుండి ఒకకప్పు కాఫీ తెప్పించి స్వయముగా చిన్ని చెమ్చాతో వానినోటఁ బోసిరి. ఆ పిమ్మట వాని యారోగ్యమునకై ధ్యానము చేసిరి. ఈసరికి ఆ బాలుఁడు ప్రక్క యానుడుతో ఒక విధముగ కూర్చుండ గలిగెను. అంతట శ్రీ శాస్త్రిగారు వాని శరీరమంతయు నిమిరి సర్దిరి. వాడు సరిగా కూర్చుండ గలిగెను. చుట్టునున్న వారి మొగములు వికసించెను. ఇక వానిని నిలుచుండఁ జేసి నడిపింప వలెను. వానిని లెమ్మని చెప్పిరి. కాని వాఁడు తడుపు కొనునే గాని లేవలేఁడు. డ్రిల్లు చేయువారి నాజ్ఞాపించు సార్జంటు వలె నధికార గర్జనతో లెమ్మని తిరుగ ఆజ్ఞాపించిరి. అంతట వాఁడు లేచెను. అప్పుడు శ్రీ శాస్త్రి గారి తీరు చూచి తీరవలెను! ఒకప్రక్క యానందము! మరొకప్రక్క యాందోళనము! వాడు నడచి ననే గాని వారికి తృప్తి లేదు. వాకిలివఱకు రెండుమార్లు వాడు నెమ్మదిగా నడచెను. తరువాత వాని నింటికి గొంపొమ్మనిరి. వెనుక టివలెనే తండ్రి వాని నెత్తుకొనఁబోయెను. శ్రీ శాస్త్రిగారు వదలని వానిని నడచియే ఇంటికి పోమ్మనిరి. మే మందర మాశ్చర్యముతో చూచుచుండగా వాడు నడచి యింటికి చేరెను.