Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 7

           

                                               ఆపదలో అమ్మాయి


                                              --డాII పోతుకూచి వెంకటేశ్వర్లు, యం. డి.

 
    కన్నుగీటుతూ ఎదురుగుండా అతివేగంగా వస్తున్న చిన్న కారును చూస్తుంటే ఏదో అనుమానం వచ్చింది డిటెక్టివ్ కృష్ణకు.
     సాయంత్రం 8.1/2 గంIIల సమయం పగలంతా ఆఫీసులో  పని. కేసులదర్యా్తు ఆలోచించి - ఆలోచించి బుర్రవేడెక్కిన డిటెక్టివ్ కృష్ణ - రిలీఫ్ కోసం - చన్నీటి స్నానంచేసి  - పైజమా - లాల్చి వేసుకుని వూరుబయటకు తెనాలివైపు బయలుదేరాడు.
     అయితే యిది అనుకోని - సంఘటన. అంతదూరం వుందనగానే కుడివైపు హెడ్ లైటును డిమ్ అండ్ ఆన్ చేస్తూ వస్తున్నాడంటే అతివేగంగా వస్తున్నట్లే లెక్క - చిన్నకారు అంతవేగంగా ఆటైములో వస్తోందంటే - ఎందుకో - అందునా కొత్తగా ఫైల్లోకి వస్తున్న కృష్ణ మెదడులో ఓ మెరుపు రేఖ మెరిసింది.
    స్కూటర్ ని ఆపి వెనక్కు తిప్పాడు. యీలోపల పద్మిని తన్ను రాచుకుంటూ ముందుకు దూసుకుపోయింది అయితే తన స్కూటర్ ని ముందుకు వురికించాడు కృష్ణ.
     హెడ్ లైటు వెలుగులో కారు నెంబరు స్పష్టంగా కనబడుతోంది. పైజమా జేబులోనికి చేయిపోనిచ్చి, చిన్నప్లాస్టిక్ కేసు తీసాడు. ఓబటన్ నొక్కి పద్మిని నంబర్ 2222 అని పైకే అనేశాడు. కారును వెంబడిస్తున్నట్లు తెలియకుండా కారుకు వందగజాల దూరంలోపల వుండేటట్లు వేగం మైన్ టైన్ చేస్తూ పయనిస్తున్నాడు.
     ఎందుకో వెనుకసీట్లో అమ్మాయి మామూలుగా కూర్చున్నట్లు లేదు. ఆదుర్దా తాండవిస్తోంది ఆ ముఖంలో - పాతికసంవత్సరాల వయస్సు వుండవచ్చు. పసిడిఛాయలో - చిదిమితే బంధించబడినట్లు - బలవంతంగా కూర్చున్నట్లు అనిపించింది. అందుకే వుత్సుకత రేకెత్తింది.
     ఆన్ చేసిన రిసీవర్ కమ్ టేప్ రికార్డులో కారులోనివారి సంభాషణ స్పష్టంగా వినబడుతోంది. కొత్తగా ఫారిస్ నుంచి తెప్పించాడు ఆ సెట్. వందగజాల లోపల శబ్దాలను రిసీవ్ చేసుకుని - రికార్డు చేయగల పవర్ వుంది ఆ సెట్ కి.
                                                          *    *    *    *    
     "ఎందుకే - చిలకా - అంత అలుక - మా బాస్ మెచ్చాడంటే నీకేం కావాలంటే అది యిస్తాడు."
     "అయితే వాడి ప్రాణమే కావాలి నాకు"
    "యూరోగ్ - నిన్ను నమ్మించో - బంధించో తెమ్మన్నాడు. మా బాస్ - లేకుంటేనా -నిన్ను యిక్కడే ఖతమ్ చేసేవాడిని' యింకోడు దరిదాపుగా అరిచాడు.
    "ఎంతమందిని యిలా అన్యాయం చేస్తాడు - మీపాపం పండింది -అందుకే కన్ను నామీద పడింది."
    "పాపం ఏమోగాని ఎంతమందికో పొట్టలు నిండాయి - కొంతమంది తెలివిగా కడుపులు నింపుకున్నారు - తర్వాత కడుపులు తీయించుకున్నారు."
    "బద్మాష్ - జాగ్రత్తగా వాగు - ఆడదాన్ని- ఒక్కతినే వున్నానని నోటికొచ్చినట్లు పేలుతే - పేల్చిపారేస్తాను."
    "కోమలాంగికి - కోపం జాస్తేనే....." తన కవిత్వధోరణికి తనే భల్లున నవ్వాడు మొదటివాడు.
     "ఒరే స్పీడుపెంచు - బాస్ మనల్ని 8 గంటల కల్లా అక్కడ వుండమన్నాడు.
    "ఎవడ్రా ఆ బాస్ - అప్రాచ్యుడు' కోమలాంగి.
    'ఏమో మేం ఎప్పుడన్నాచూస్తేగా - బాస్ - ఆర్డర్స్ మాత్రం వినబడతాయ్ - మేం కారీఅవుట్ చేస్తాం'
    "యిల్లాంటి వెధవపన్లు చెయ్యకపోతే ఏంరా?"
    'మా పొట్ట గడవదు - ప్రాణాలు నిలవ్వు"
    'ఎక్కడ వాడుండేది'
    'వెళ్తున్నాంగా - అప్సర గెస్ట్ హౌస్ లో'
                                                      *    *    *    *    *
    అప్సర గెస్ట్ హౌస్ అనేటప్పటికి కొంత అర్దం అయింది డిటెక్టివ్ కృష్ణకు.
    ఊరుచివర్న రింగ్ రోడ్ టర్నింగ్ ఏకాంతంగా వెలుగులు విరజల్లే భవంతి అది.
     పగలు ఏమోగాని - సాయంత్రం- రాత్రిళ్లు దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
     సాయంత్ర సమయంలో వాహ్యాళికై రింగ్ రోడ్డువైపు అడపాదడపా వెళ్లే కృష్ణ దాన్ని గురించి యింతవరకు అంతగా పట్టించుకోవాల్సిన  పని పడలేదు- అయినా రాత్రిళ్లు హడావిడిగా - వచ్చిపోయే జనంతో రద్దీగా వుంటుందని మాత్రం తెలుసు. బహుశా ఎవరో పెద్దవారు - వుంటున్నా రనుకున్నాడు గాని - యిలాంటి రాత్రి భాగవతాలకు నిలయం అనుకోలేదు.
     యిలా ఆలోచిస్తూనే ఆ కారును ఫాలో అవుతున్నాడు ఇంతలో శంకర్ విలాస్ సెంటర్ వచ్చింది. దారి మళ్లించి - వేగం పెంచాడు. బ్రాడీపేట - చంద్రమౌళినగర్ మీదుగా - రింగ్ రోడ్డుకు చేరుకున్న కృష్ణ అటువైపుగా వస్తున్న పద్మిని 2222 కారుకు ఎదురుగుండా స్కూటర్ ను ఆపాడు.
                                                      *    *    *    *    *
     సడన్ బ్రేక్ తో కారు ఆగింది.
     ఎవడ్రా ఛప్రాసి - చావాలనుకుంటే మాకారే దొరికిందా? అందునా యిప్పుడు...." కళ్లు ఎర్రజేశాడు డ్రైవర్.
    "యూ యూజ్ లెస్స్ ఫెలోస్సో - ఇంతలేటా? 8 గంటల కల్లా మిమ్మల్ని అక్కడకు రమ్మంటే యింతలేటా?" హుంకరించాడు.
    "మీరు... తమరు...."
    "యస్- అయామ్ ది బాస్.... చిలకని చిక్కించుకువచ్చారు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను - మీరు ముగ్గురు - బెజవాడ గవర్నరుపేటకు యిటునుంచే ప్రొసీడ్ అవండి - అక్కడ హండీక్రాస్ట్స్ షాప్ సెంటర్లో - ఓ ఆటో ఆగి వుంటుంది. అందులో బ్లూ సూటుధరించిన వ్యక్తి వుంటాడు - బాస్ - బాక్స్ తెమ్మన్నాడనండి - మీకు ఓ పెట్టె అందిస్తాడు - అది తీసుకురండి ప్రొసీడ్....' ఆజ్ఞ జారీచేశాడు.
     ఆ అమ్మాయిని కార్లోంచి క్రిందకు నెట్టినంత పనిచేసి ముగ్గురూ క్షణంలో అక్కడినుంచి మాయమయ్యారు.
                                                          *    *    *    *    *
    'త్వరగా స్కూటర్ ఎక్కండి.'
    'ఎవడ్రా నువ్వు సైతాన్ - వాళ్ళు ఏదో అప్సర గెస్టు హౌస్ అన్నారు - నువ్వు మధ్యలో ఆపి స్కూటర్ ఎక్కమంటావు.'
    'ఖంగారు పడకండి - నేను మీ శ్రేయోభిలాషిని - త్వరగా - ఆలస్యం చేయకండి - స్కూటర్ వెనక కూర్చోండి'
    'మీ ఉద్దేశ్యం.'
    "త్వరగా రమ్మంటుంటే" అంటూ చెయ్యి పుచ్చుకో బోయాడు డిటెక్టివ్ కృష్ణ.

 Previous Page Next Page