అపుడు ప్రకాశవతి, "మీ మాటలు విచిత్రంగా వున్నాయి. నేర్పు గలదే అర్దం కాగలుగుతుంది. స్త్రీ లు పనులు మాత్రమే చేయగలరని నేను అనలేను. వారు పనిచేయడానికి అవకాశం యెక్కడిచ్చారు?" అని ప్రశ్నించాడు.
ఇక గగన్ దేవ్, "స్త్రీలు స్వయంగానే కర్మబంధనంలో బంధితులయారు. నిప్పురవ్వ స్వయంగా జ్వలించి బూడిద అయిపోయినట్లుగానే స్త్రీ స్థూపాకార కర్మవిశేషం చేత అంతఃపురం చాటున పడివుంటుంది. నాలుగువేపులా ఆమెకు స్థలం లేదు. అయినా బూడిదలోనుండి జనించి బాహ్య ప్రపంచ కార్యరాశిలో ఆమెను పడవేస్తే అశాంతి వ్యాపిస్తుంది. పురుషునిలో దానితీవ్రతగతిని అనుసరించేశక్తిలేదు. మానవుడు పని చేయడం ఆలస్యమవుతుంది. వారి వారి కార్యక్షేత్రంలో ఒకే సుదీర్ఘ మార్గం వుంటుంది. ఆ మార్గం ఆలోచనలవల్ల మూతపడుతుంది. కాని స్త్రీ ఒకసారి బహిర్విప్లవంలో సహాయపడుతుంది. క్షణంలో ఆలోచనలన్నింటినీ ఒక్కసారిగా రేపుతుంది. ఈ ప్రళయకారిణి శక్తిని ప్రపంచం బంధించివేసింది. ఈ నిప్పునుంచి కేవలం శయన గృహదీపం వెలుగుతుంది. శీతార్తజీవుల శీతలం క్షుథార్తుల ఆకలి నివారణ మవుతాయి. కాని మన సాహిత్యంలో సుందర అగ్ని శిఖలు తేజస్సుతో దేదీప్యమానమయితే యిక యీ విషయంలో వాదవివాదాల అవసరమే ముంది?" అని ప్రశ్నించాడు.
"మన సాహిత్యంలో స్త్రీలు ప్రాధాన్యం వహిస్తారు. మన దేశంలో పురుషులకంటే స్త్రీ లే గొప్పవారు కావడం దీనికి కారణం?" అన్నాను నేను.
నిర్ఘరిణి ముఖం ఎర్రబడింది. ఆమె నవ్వింది.
ఇక ప్రకాశవతి, "ఇది నీ అత్యుక్తి." అని అన్నది.
ప్రతివాదన చేయడంవల్ల తన స్త్రీ జాతి గొప్పతనం యింకా వినవచ్చునని ప్రకాశవతి ఆకాంక్షయని నాకు తోచింది.
నేను ఈ విషయం ఆమెకు విశదం చేశాను. స్త్రీలు తమను పొగడుతుంటే వినాలనీ ఎక్కువగా కోరుకుంటారని కూడా చెప్పాను. ప్రకాశవతి జోరుగా తల ఆడించి, ఎన్నటికీ కాదు,' అన్నది.
నిర్ఘరిణీ మధురస్వరంతో, "నిజం. అప్రియభాషణను మేము విషతుల్యంగానూ ప్రియభాషణను మధురంగానూ పరిగణిస్తాం" అని అన్నది. నిర్ఘరిణి స్త్రీ అయినా నిజాన్ని అంగీకరించడానికి సంకోచించదు.
"గ్రంథకర్తలలో కవి, నేర్పరులలో గాయకుడు మధురస్తుతికి అలవాటుపడి వుండడమే దీనికి కారణం. సౌందర్యం సృష్టించడం పనిగా గలవారికి ప్రశంశయే వారి సిద్దిని అంచనావేయడానికి వుపాయం. ఇదే అసలు విషయం. సకల కార్యకలాపాలు ఫలించటానికి అనేక ప్రమాణాలు దొరుకుతాయి. కాని స్థితి లాభాన్ని వదిలిపెట్టితే మనోలాభ అన్యప్రమాణం దొరకదు. కాబట్టే పాటకుడు ప్రత్యేక తాళం మీద ఆగిపోతే 'వహ్వ వహ్వ' అనడం ప్రారంభమవుతుంది. అందువల్ల అవమానంతో గుణవంతుడు మాత్రమే క్లేశం పొందుతాడు." అని నేను చెప్పాను.
దానిమీద పవన్ దేవ్, "అంతమాత్రమేకాదు నిరుత్సాహ మనోహర కార్యంలో ఒక విశేషం వుంది. శ్రోతల మనసు వికసించడం చూసి పాటకుని మనస్సు తనశక్తినంతా ప్రస్పుటితం చేయవలసిన సమయం వస్తుంది. అందువల్ల స్తుతివాదం కేవలం అతనికి బహుమానం మాత్రమే కాదు, కార్యసాధనకు ముఖ్యాంశం," అని అన్నాడు.
"స్త్రీకి కూడా ఆనందం కలిగించడమే ముఖ్య కార్యకలాపం. సాటిలేని తన అస్తిత్వానికి సంగీతం కవిత్వంలాగా సంపూర్ణ సౌందర్యం సృష్టించడం మూలంగా ఆమె మనోరథం యీడేరుతుంది. స్త్రీలు స్తుతికి ప్రసన్నులు కావడమే యిందుకు కారణం. కేవలం తమ అహం కారాన్ని తృప్తిపొందించుకోవడానికి కాదు. తమ జీవితాల సాధకతను అనుభవించడానికి అలాచేస్తారు. దోషం, అసంపూర్ణత చూచిన మీదట హఠాత్తుగా వారి అంతరాత్మ దెబ్బతింటుంది" అని అన్నాను నేను.