ప్రస్తుతం కులభూషణ్ ఆమెతో ఉంటున్నాడు. ఆమె విశ్వనాద్ కోసం ఎదురు చూస్తున్నదని అతడికి తెలుసు.
విశ్వనాద్ వస్తున్నాడన్న కబురు తనే స్వయంగా ఆమెకు చెప్పాలన్న కోరిక కులభూషణ్ లో వుంది. ఆ కబురు చెప్పినప్పుడామే కళ్ళలో వేయి దీపాల వెలుగులు కనబడతాయి.
అవి చూసి తరించాలని అతడి కోరిక.
అమ్మ సీతమ్మకు ఋణం తీర్చుకునే అవకాశం ఎప్పుడో కాని రాతడికి. కనీసం ఆమెను సంతోషపెడితే అదో తృప్తి.
అందుకే కులభూషణ్ పరుగున స్కూటరు పై ఇంటికి వచ్చాడు. ఒక్క ఉరుకులో లోపల ప్రవేశించాడు.
అప్పుడు సీతమ్మ డ్రాయింగ్ రూంలో వుంది.
"ఏమిట్రా ఆ పరుగు" అంది.
కులభూషణ్ ఏదో అనబోయాడు. నోట మాట రాలేడు. ఆయాసం తీర్చుకుందుకు కాసెప్పట్టింది.
"నీకింకా చిన్నతనం పోలేదురా " అంది సీతమ్మ.
"నీకేమో పిసినిగొట్టుతనం పోలేదు. ఫోన్ పెట్టించుకోమని తెగ పోరుతున్నా వినవు. లేకపోతే ఈ కబురు తెలియడానికి ఇంత ఆలస్యం అయ్యేది కాదు అన్నాడు కులభూషణ్.
"ఏ కబుర్రా" అంది సీతమ్మ.
"చెప్పుకో' అన్నాడు కులభూషణ్.
"విప్పిగాడు వస్తున్నాడు అంతేగా" అంది సీతమ్మ.
"నీకెలా తెలుసు " ఆశ్చర్యంగా అన్నాడు కులభూషణ్.
"ఎదురింటి జానకమ్మ చెప్పింది."
"ఎదిరింట్లో ఫోనుంది . అప్పుడప్పుడు అర్జంటు విశేషాలుంటే తనూ అక్కడికే ఫోన్ చేసి కబురు చెబుతుంటాడు.
కులభూషణ్ తెల్లమొహం వేసి ఈ జానకమ్మ నా పాలిట విలన్. నేను చూడాలనుకున్నది చూడలేకపోయాను" అన్నాడు.
"ఏం చూడాలనుకున్నావురా?"
"మా అమ్మ కంట్లో వేయి దీపాల వెలుగును?"
సీతమ్మ అతడి వంక అభిమానంగా చూసి "విస్సీగాడు జానకమ్మకు ఫోన్ చేసి కబురు చెప్పి నన్ను పిలవమనే లోగా లైన్ కట్ అయిపొయిందిట. ఆవిడేమో వెంటనే నాకు కబురు చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది." అంది.
"ఇప్పుడెం చేద్దాం" అన్నాడు కులభూషణ్.
"నేను పిసినిగొట్టుదాన్నన్నావుగా విస్సీగాడి కెలాంటి ఏర్పాట్లు చేస్తానో చూద్దువు గాని " అంది సీతమ్మ.
"ఏఏ ఏర్పాట్లు చేస్తావు ?"
"నువ్వే చూద్దువుగానీ "
"చెప్పమ్మా" అన్నాడు కులభూషణ్ గారంగా.
"చెబుతాను గాని ఇప్పుడు కాదు"
"మరెప్పుడు?"
"విస్సిగాడు వస్తున్న వార్త చెప్పి కళ్ళల్లో వేయి దీపాలు వెలగటం చూసాక అప్పుడు" అంది సీతమ్మ.
"ఆ ఆశ జానకమ్మ పాడు చేసిందిగా "
"జానకమ్మ చెప్పింది నాకు, ఉదయకు కాదు"
కులభూషణ్ ఉలిక్కిపడి "అరె ఉదయ సంగతి నేను మరిచేపోయాను" అన్నాడు.
"తెలుసు నాకు. అందుకే గుర్తు చేసాను .'
'అవును ఉదయ ఈ వార్త విని ఎంతో సంతోషిస్తుంది...."
"పక్కనే వున్న ఉదయను వదిలిపెట్టి ఎక్కడో వున్న నాకోసం పరుగున వచ్చేవా. పాపం నాకంటే ఉదయ్ ఎక్కువగా బావ కోసం ఎదురు చూస్తుందని తెలియదూ? వెళ్ళు ఈ వార్త చెప్పి దాని కళ్ళలో వేయి దీపాల వేలుగులుక్ చూడు "
కులభూషణ్ నిట్టూర్చి ,"ఆరిపోతున్న దీపం ఉదయ" అన్నాడు.
"ఒరేయ్ ఆ మాట నేనను కోవచ్చు, అనొచ్చు. డాక్టరుగా నువ్విలా అనడం నేను సహించను " అంది సీతమ్మ.
కులభూషణ్ మాట్లాడకుండా సీతమ్మ కళ్ళలోకి చూసాడు.
ఆమె కళ్ళలో అతడికి ఉదయ కధ కనిపించింది. అప్పుడే కాదు ఎప్పుడూ అతడి కలా కనిపిస్తుంది.
ఉదయ పేరు ఉదయ లక్ష్మీ.
ఆమె సీతమ్మ మేనకోడలు.
తండ్రి వేరే ఊళ్ళో ఉంటున్నా ఆమెనీ ఉళ్ళో చదివిస్తున్నాడు.
ఉళ్ళో మేనత్త ఉందని తెలిసీ వేరే హాస్టల్లో వుంచి చదివిస్తున్నాడు.
సీతమ్మ స్వయంకృషితో తన కాళ్ళ మీద తాను నిలబడింది. అయిన వాళ్ళ ఆశ్రయం కోరలేదు. భర్త హీన యుండి పురుషుల ఆసరా తీసుకోలేదు. తన మీద అపవాదులు వచ్చి పడుతుంటే చలించలేదు.
అందువల్ల ఆమె అన్నగారికి సీతమ్మంటే కోపం.
అయన సీతమ్మను కలుసుకునేవాడు కాదు. తన కూతురు సీతమ్మను కలుసుకోకుండా ఆంక్షలు పెట్టేవాడు.
అయితే ఆ అంక్షలంతగా ఫలించలేదు.
ఉదయకు విశ్వనాద్ అంటే ఆకర్షణ. ఆ ఆకర్షణ ఆమెను తరచుగా సీతమ్మ ఇంటికి పంపేది. అప్పుడామే సీతమ్మలో సీతమ్మ తల్లిని చూసింది.
సీతమ్మ ఆప్యాయత కన్నతల్లిని కూడా మరిపించగలదు.
తల్లి మంటల్లో కాలిపోతే బిద్దతల్లిని మరిచేలా చేయగల ఉపశమనం సీతమ్మ ఇవ్వగలదనడానికి వేదాంతం, కులభూషణ్ సాక్షులు.
ఉదయ సీతమ్మను వదల లేకపోయింది.
సీతమ్మ ఆమెను కోడలిగా చేసుకోవాలను కుంది.'
విశ్వనాద్ ఉదయను ప్రేమించాడు. ఉదయ విశ్వనాద్ ను ప్రేమించింది.
వార్త చూచాయిగా ఉదయ తండ్రికి తెలిసింది. అయన సీతమ్మ ఇంటికి వచ్చి నానామాటలు అన్నాడు.
"నువ్వు నా అన్నగారివి. నీ తిట్లే నాకు దీవెనలు" అంది సీతమ్మ.
"నేనే నిన్ను తిట్టకుండా మనస్పూర్తిగా దీవిస్తాను. నా కూతుర్ని వదిలిపెట్టు."
"నేనేం చేశాను నీ కూతుర్ని" అంది సీతమ్మ.
"దాని మీద నీ నీడ పడకూడదు. సర్వనాశనమై పోతుంది...."
"నేను బ్రతికున్నంత కాలం నా నీడ ఉంటుంది. నాకు దగ్గరగా కావాలనకున్న వాళ్ళందరి మీదా అది పడుతూనే వుంటుంది" అంది సీతమ్మ.
'మొండి కబుర్లు మాను. దాని మానానా దాన్ని బ్రతకనీ"
"ఆ విషయం డానికి చెప్పు"
"పసిపిల్ల దానికేం తెలుస్తుంది"
"సీతమ్మ నవ్వి పసిదైనా నీకంటే అదే నయం. ఎక్కడ అభిమానం వుందో డానికి తెలుసు"
"నీ అభిమానం నీ మొగుణ్ణి చంపింది. ఇద్దరు పిల్లల తల్లుల్ని అగ్నికి ఆహుతి చేసింది. తండ్రి నిరాదరణకు గురి చేసింది. నా పిల్లకలాంటి గతి పట్టకూడదు...."
'అన్నయ్యా మాటలు మీరకు. నా ఆదరణలో పెరిగినవారు తల్లిదండ్రుల ఆదరణలో పెరిగిన వారి కంటే ఉన్నతంగా వున్నారు. నీ కూతురి విషయంలోనూ అదే రుజువౌతుంది .'
"నీ ఋజువు కో నమస్కారం. నా కూతుర్ని వదిలిపెట్టు ."
సీతమ్మ మాట్లాడలేదు. అన్నగారు హెచ్చరించి వెళ్ళిపోయాడు.
తర్వాత సీతమ్మ ఉదయను తీసుకుని అలౌకికానందస్వామి ఆశ్రమానికి వెళ్ళింది. అయన ఉదయ నాశీర్వదించి "ఈమె నీ కోడలవుతుంది. ఈమె కారణంగా నీ వంశం వృద్ది చెంది తరతరాలు పేరు ప్రఖ్యాతులు నిలబడతాయి . అన్నాడు.
ఆ తర్వాత సీతమ్మ ఇంకెవర్నీ లెక్క చెయ్యలేదు.
ఉదయ మకాం హాస్టల్నించి సీతమ్మింటికీ మారిపోయింది.
అన్నగారు వచ్చి హడావుడి చేసాడు. ఉదయ తండ్రితో వెళ్ళనంది.
అప్పటికామెకు పద్దెనిమిది నిండాయి. మేజరు.
ఉదయ తండ్రి కూతురికీ చెల్లికీ శాపనార్ధాలు పెట్టాడు.
ఉదయ లెక్క చేయలేదు. సీతమ్మ నవ్వింది.
"నువ్వు చేసిన తప్పు నీకర్ధం కావడం లేదు. నీ పొరపాటు అర్ధమయ్యాక కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. నా చెల్లెలు నష్ట జాతకురాలు. నువ్వు దాని పంచన చేరావు" అన్నాడు ఉదయ తండ్రి ఆఖరి హెచ్చరికగా.
తర్వాత అయన వెళ్ళిపోయాడు.
"నీ అదృష్టం నీకే కాదు. ఈ ప్రపంచానికి కూడా తెలిసేలా చేస్తాను" అంది సీతమ్మ.
"నీతో వుండడమే నా అదృష్టం అత్తయ్య ' అంది ఉదయ.
కానీ అది నిజం కాదని తేలింది.
మరో ఆరు మాసాలలో ఉదయలో అనారోగ్య లక్షణాలు కనబడ్డాయి. మామూలు జబ్బని ముందనుకున్నారు. బ్లడ్ క్యాన్సరని తెలియడానికి మరో ఆరు మాసాలు పట్టింది.
సీతమ్మ షాక్ తింది.
విశ్వనాద్ ఏడ్చాడు.
వైద్యానికి ఖర్చవుతుందన్నారు.