మరొక యింట్లో చేస్తే జీవన్ ఒప్పుకోడు. తనకి చిన్న తనమని పోట్లాడతాడు. కాని నాకు జీతం కావలి. మీతోనే వున్నా నేను స్వతంత్రంగా బ్రతకాలి."
అత్తగారిలో వచ్చిన యీ మార్పు అణుకి ఏంతో అనందం కలిగించింది. ఇన్ని సంవత్సరాలకి ఆవిడ అబద్దాల విలువలు మిధ్యాడంబరాలు, యివన్నీ దాటుకుని సోమరితనం వొదులుకొని స్వతంత్రంగా బ్రతకడానికి సిద్దపడింది. ఈ మార్పు హర్షించదగిందే . కాని చూస్తూ చూస్తూ ఒకప్పుడు రాణిలా బ్రతికిన వ్యక్తిని, తన అత్తగారిని వంటమనిషిగా పెట్టుకుని అజ్ఞాపిస్తూ పనులు చేయించుకోవడమా? ప్రాణం వొప్పలేదు.
"మీరు స్వతంత్రంగా జీవించాలనుకోవడం ఎంతో యిష్టం. వంటమనిషిగా ఎందుకు? మీకు మరో పని చూస్తాను."
"నేనేం చెయ్యగలను? తెలుగులో తప్ప మరో బాష రాడు. నలుగురిలో నాగరికంగా, సంస్కారంగా మాట్లాడ్డం రాదు. ఏం చెయ్యగలనో చెప్పు."
కొంచెం సేపు ఆలోచించింది అణు.
"మేకప్ ఉమన్ గా మీకు ట్రైనింగ్ యిప్పిస్తాను. డానికి చదువు సంధ్యలతో పెద్దగా నిమిత్తం లేదు. మ డాన్సు స్కూల్లో లోనే మేకప్ ఉమెన్ గా చేరుదురు గాని."
అణు ఆశించినట్టు ఆవిడ ముఖంలో వికాశం కనపడలేదు. ఆవిడ సంకోచిస్తూ, "నాకు మూడువందల జీతం కావాలి" అంది. జాలి నవు రెండు కలిగాయి.
"అక్కడ మీకు ఐదు వందల జీతం. ఒకసారి మీరు బాగా పని నేర్చుకుంటే నా దగ్గిరే కాదు ఎక్కడైనా కూడా యింకా ఎక్కువ జీతానికి ఉద్యోగం చేసుకోవచ్చును." ఇప్పుడొచ్చింది మెరుపు ఆమె ముఖంలోకి.
"నేను మిమ్మల్ని వొదిలి ఎక్కడికి పోతాను" అంది మనసారా గడపదాటి యింట్లోంచి బయటికొస్తే పరువు నష్టం అనుకునే మర్యాదల్లోంచి బయటపడి జమిందారీ వంశంలో పుట్టామని , ధనరాశుల్లో పొంగి పోర్లుతున్నామనే తప్ప, డబ్బు లేదని ఒప్పుకోవటం మహా పాపమనే భ్రమలను ఓడిలించుకుని ఒకతరం వెనక పడ్డ వయసు మీరిన వనిత, ఒడిదుడుకులలో పడుతూ లేస్తూ యీనాటికి యీ తరం సరిహద్దుల్లో కొచ్చి స్వతంత్ర వ్యక్తితంలోని గ్లామర్ గ్రహించి స్వయంగా సంపాదించుకోడానికి పూనుకుంది. ఎంత బాగుంది యీ మార్పు! కాని వెనుకటి తరాల్లోంచి ముందు తరాల్లోకి పరుగు ఇక్కడితో ఆగలేదు. స్వాతంత్ర్యం రకరకాల కల్తి మోపులతో యువతకు దిగ్బ్రమ కలిగిస్తోంది. స్త్రీ పురుషుల స్నేహలలో శృతిమించిన విశృంఖలత, హాట్ డ్రింక్స్, సిగరెట్లు, అన్నిటిని మించి డ్రగ్ ఎదిక్షన్- ఇవన్ని స్వాతంత్ర్యపు మేలి ముసుగులో రోగ క్రిములల్లా సమాజంలో లీనమైపోతున్నాయి. ఈ స్వేచ్చ స్వాతంత్ర్యాలకు ఆధునిక రీతులకు సరిహద్దులు ఎక్కడ నిర్ణయించుకోవాలి? ఏ ప్రమాణాలతో నిర్ణయించుకోవాలి? అతిముఖ్యమైన యీ సమస్యను విమన్ లిబ్ మువ్ మెంట్స్ కార్యకర్తలేవరు ఆలోచిస్తున్నట్లుగా లేదు.
పోస్ట్ మెన్ బెరర్ ఉత్తరం తెచ్చాడు.
"మీకున్న పేరును బట్టి పనిపాట లేనివాళ్ళు తోచితోచక బెరర్ ఉత్తరాలు వ్రాసి పడేస్తుంటారు. అలాంటివాటిని మీరు తీసుకోనక్కర్లేదు" అని చెప్పాడు మనోహర్ ఇది వరలో. అలాగే అప్పటికి అణు కనీసం ఐదు వందల బెరర్ ఉత్తరాలైనా అందుకుని వుంటుంది. వాటిల్లో వంద కాపీలు రాసి పోస్ట్ చేయవలసిన సంతోషిస్తూ ఉత్తరాలు, మొదలైనవి కూడా ఉన్నాయి. తనకేదో మంత్రం వచ్చునని రానుపోను ఖర్చులు పంపిస్తే వచ్చి జపం చేసి పాప ఎక్కడుందో తెలుసుకుని చెప్తామని రాసిన ఉత్తరాలు కొన్ని.
చదువుకున్నానని విర్రవిగుతూ "మొగుణ్ణి వొదిలి బయటికొచ్చేస్తే దేవుడిలాగే శాస్తి చేస్తాడు' అని చాందసంగా కొన్ని ఉత్తరాలు - ఇలాంటి ఉత్తరాలు చదివి చదివి బెరర్ ఉత్తరాలనే సరికి భయము విసుగు పట్టుకుంది. అయినా తల్లి మనసు ఈ చికఆకులన్నీ అవలీలగా అధికమించింది. డబ్బు చెల్లించి బెరర్ ఉత్తరం తీసుకుంది. చిమ్పగానే న్యూస్ పేపర్ల అంచులు కత్తిరించిన మడత చేతులో పడగానే ఏదో పోకిరి ఉత్తరం అనుకుని కిందపడబోయి రాగ దస్తూరి గుర్తుపట్టి మడతలన్ని విప్పింది. పెన్సిల్ తో రాగ రాసిన ఉత్తరం అక్కడక్కడ నూనే మరకలు- మట్టిమర్కలు- దాంతో పాటు మరో చిన్న స్లిప్.
"మేడమ్!
ఈ ఉత్తరం నాకు పిపిలి మట్టిరోడ్డు మీద దొరికింది. ఉత్తరం లో "టూ అడ్రస్" వుండటం వల్ల బెరర్ కవర్లో పోస్టు చేస్తున్నాను." అంతే వుంది స్లిప్ మీద ఇంగ్లీషులో సంతకం లేదు. న్యూస్ పేపర్ అంచున తెల్లకాగితం నిండా మట్టిమరకలుండటం, పెన్సిల్ తో రాయడం వల్ల రాసిన చాలా రోజుల తరువాత ఉత్తరం గమ్యస్థానం చేరడం వల్ల చదవడం కష్టమైంది అణుకి.
"డియర్ మమ్మీ!"అనేది చదవగానే కళ్ళల్లో నీళ్ళు నిండిపోయి దృష్టి సరిగా అనకుండా పోయింది. తుడుచుకున్న కొద్ది వొస్తున్నాయి నీళ్ళు. "డాడీ అక్కడే వుంటే నే వచ్చేవరకు వుండమని చెప్పు" అన్న మాటలు చదివి భరించరాని క్షోభతో విలవిల్లాడిపోయింది.
ఎంతసేపూ రాగ మీద తనకున్న ప్రేమతో పాపని తన దగ్గిర ఉంచేసుకోవాలని ప్రయత్నించిందే తప్ప పాపకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందొ ఎప్పుడూ ఆలోచించలేదు. జలజ అన్నట్లు తను కొంచెం వివేకంతో ప్రవర్తించి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించుకుని ఉండవలసింది. మనసు చిక్కబట్టుకుని మళ్ళీ చదివింది.
"డాడీ నువ్వు కలిసి ఉన్నందుకు యామ్ వెరి వెరి హేపీ, " ఆ వాక్యం చదివాక దుఖం నిగ్రహించుకోవడం అణు వల్ల కాలేదు. టేబుల్ మీద తల వాల్చేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అక్కడ ఏ దిక్కుమాలిన హొటల్ లో ఉందొ? వేళకి యింత తిండైనా తింటుందో లేదో? అల్లారు ముద్దుగా - అపురూపంగా- గట్టిగా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా పెరిగిన పాపని వాళ్ళు ఎన్ని అవస్థలు పెడుతున్నారో? తన యిబ్బందులు, అవస్థలు ఏమి రాయకుండా "నువు, డాడీ కలిసి ఉన్నందుకు ఐ యామ్ వెరి వెరి హేపీ, "అని రాసింది. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉండటం పిల్లల కెంత అవసరం? ఈ విషయం ఇంతకుముందు ఎందుకు ఆలోచించలేకపోయింది?
టైమ్ సేస్సేషన్ పోయింది. రకరకాల దృశ్యాలు మనసుకి.
పాపకి తిండి పట్టలేదు. "మమ్మీ! ఆకలి, "అని ఏడుస్తోంది పాప.
రాగకి ఐస్ క్రీం అంటే యిష్టం వాళ్ళ దగ్గిర ఐస్ క్రీమ్ కావాలని పేచీ పెట్టింది వాళ్ళు రాగని కొడ్తున్నారు పాప, " అమ్మా" అని ఏడుస్తోంది. చీకట్లో ఒక్కదాన్ని వొదిలేశారు. పాప భయంతో "అమ్మా! అమ్మా!" అని ఏడుస్తోంది.
ఇలాంటి ఎన్నో దృశ్యాలు తప్పించుకుందామన్నా వీలు లేకుండా అణు మనసు మీద దాడి చేస్తున్నాయి. ఉహా దృశ్యాలు మనసుని మరింత ముక్కలు ముక్కలుగా తరుముతున్నాయి. కాలం గడిచిపోతున్న సంగతి అణుకి తెలియడం లేదు. కళ్ళు ఎర్రగా ఉబ్బి మండిపోతున్నా, తల పగిలిపోతున్నా, ఏడుపు ఆపుకోలేక పోతోంది. తలమీద లాలనగా చెయ్యి పడేసరికి దిగ్గున తల ఎత్తింది- జీవన్ అతడిప్పుడు అణు అపార్ట్ మెంటులోనే ఉంటున్నాడు. తల్లి మేకప్ ఉమన్ గా చేరినందుకు మొదట తల్లి మీద విరుచుకు పడ్డాడు. జేవితంలో మొదటిసారిగా కొడుకుని ఎదిరించి నిలబడింది తల్లి. అణు కూడా తల్లినే సమర్ధించేసరికి ప్రధానంగా అణుకి ఎదిరించి సమాధానం చెప్పలేక నోర్ముసుకున్నాడు. "భర్తకి అణిగి మణిగి వుంటూ అతడు చెప్పినట్లు నడుచుకోవాలి. అదే ఉత్తమ యిల్లాలి లక్షణం, "అని జ్ఞానం వచ్చినప్పటి నుంచి పెద్దవాళ్ళు నూరి పోసిన సిద్దాంతం ఎంత నిస్సారమైందో చాలా ఆలస్యంగా తన అరవయ్యో ఏట అర్ధం చేసుకుంది రాణి అచ్చయ్యమ్మ.