Previous Page Next Page 
అన్వేషి పేజి 4

 

                                        5


    కస్తూరి తన పట్ల చూపే శ్రద్దా సక్తులు చూస్తె గిరిధారికి చిత్ర విచిత్రమైన ఆలోచనలు వచ్చేవి. ఆమెకు తన నుంచి ఏం కావాలి. అన్నది ముఖ్యమైనది. ఆమె దాసీది, పనిమనిషి అనుకునేవాడు. కాని మనసు ఒప్పుకునేది కాదు. ఆమె తన ఇంట్లో పని చేసుకున్నంత తీరికగా, స్థిమితంగా వేరు పని ఏమీ లేనట్లు అతని సేవ చేసేది. నెల కాగానే 'జీతం' కూడా స్పష్టంగా అడిగేది కాదు.
    ఆ అడిగే ధోరణి వేరు. చిత్రంగా ఉండేది.
    "చూడండి! ఈ చీర బొత్తిగాచిరిగిపోయింది. ఇది కట్టుకుని మీ ముందు తిరగాలంటే ఎలానో ఉంది" అనేది.
    లేదా -- "నేనేం దేశం తెగించి పోతున్నాననుకున్నాడో ఏమో! ఆ కిరాణా షావుకారు అంత తొందర చేస్తాడెం? కాస్త సోమ్మివ్వాల్సి ఉండబట్టే కదా అంత జులుం చేస్తున్నాడు!' అనేది.
    "పోనీ అతని కివ్వవలసింది ఇచ్చెయ్య రాదూ?" అనేవాడు తను.
    "ఈరోజే తీసుకెళ్ళి మొహాన పడేస్తాను. అయినా నేనొక దిక్కూ మొక్కూ లేని దాన్ననే గదా వాడి కంత లోకువ! అడ్డమైన వాళ్ళతో అడ్డమైన మాటలూ పడుతున్నాను." అంటూ అతనికో అష్టోత్తరం చదివేది. ఇంతా చేసి వెళ్ళేటప్పుడు అడిగి తీసుకు వెళ్ళటం మరిచి పోయేది.
    అనాడామే కోక కొత్త పని తోచింది. గదిలోని పత్రికలూ అవీ చిందరగా ఉన్నాయి. పైగా ఎప్పటి కప్పుడూ నెల నెలా, వారం వారం -- ఇంకా రోజూ వచ్చే పత్రికలతో గది నిండిపోతుంది. ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ వచ్చి చూసేసరికి యదా ప్రకారం ఉండేది. ఒక పత్రిక కోసమో, పుస్తకం కోసమో వెతికే ప్రయత్నంలో మళ్ళీ అన్నీ యధాప్రకారం అయ్యేవి.
    ఆమెకు విసుగు వచ్చి అవన్నీ కట్టగట్టు కెళ్ళి కిరాణా షావుకారుకు అమ్మి కావలసినవేవో తెచ్చింది. 'రాక్ ' లోని పుస్తకాలు తప్ప మిగిలినవన్నీ ఆమె పుణ్యాన షావుకారు కొట్టుకు చేరుకున్నాయి.
    అతను వచ్చాక చాలా గొడవ చేశాడు. "వెళ్ళు! తే ముందు" అంటూ ఆమెను తరిమాడు. ఆ డబ్బు ఆమె మీదకు విసిరాడు. ఆమె తేగానే అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడం లో ఆ రోజు గడిచిపోయింది. అతనా రోజు గదిలో తోచక ఊరి చివర పొలాల వెంబడి తిరిగివచ్చేసరికి జరిగిందది.
    అన్నీ చూసుకున్నాక అతనికి స్థిమితం కలిగింది. కాని కొన్ని పోయాయి. ప్రపంచంలోని ఎన్ని సమస్యలను నిశితంగా చర్చిస్తూ ఏ ప్రముఖులు ఏం వ్రాశారో కస్తూరి కేలా తెలుస్తుంది? వాటి కోసం అంతులేని బాధ, చిరాకు కలిగాయి. ఆమె చొరవ చూస్తె ఒళ్ళు మండిపోయింది.
    ఆమె వేపు చూడాలన్నా, మాట్లాడాలన్నా అంతులేని అసహ్యం కలిగింది. అతనెంత ముభావంగా ఉన్నా అతన్ని చూస్తూనే ఆ విషయం గ్రహించగలిగింది. అతను తన ప్రతి పనీ తనే చేసుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఆమె కల్పించుకుని అందుకోగానే తప్పుకునేవాడు. ఆమె కూడా బెల్లం కొట్టిన రాయిలాగా మాట్ల్దాకుండా ఊరుకుంది. కాని వండినది చల్లారి పోవటం, అతను భోజనానికి రాకపోవటం , తను తోరిపిన వేడినీళ్ళు మానేసి చన్నీటి స్నానం తో జలుబు తెచ్చుకోవటం చూసి ఆమెకు గుండెలు పిండి వేసినంత బాధ కలిగింది.
    షావుకారు కొట్టుకు వెళ్ళి అతనేవారేవరికి ఏయే సరుకులిచ్చాడో కనుక్కుని ఇంటింటికీ వెళ్ళి ఆ కాగితాల సేకరణ కు పూనుకుంది. చివరికి దొరికినవన్నీ ఒక బొత్తిగా పేర్చి గిరిధారి ముందుపెట్టి అపరాధినిలా నిలబడింది.
    "ఏమిటి?" అన్నట్టు చూశాడతను.
    "కాగితాలు -- దొరికినంత వరకూ తెచ్చాను" అందామె.
    కాగితాలు పూర్తిగా దొరికినా, దొరక్కున్నా ఆమె ప్రయత్నంలో అతను కరిగిపోయాడు. "నువ్వుత్త మూర్ఖురాలివి. పిచ్చిదానివి" అన్నాడు. చాలు! ఆమె స్థిమితపడింది. ఆ క్షణాన ఆమె ముఖంలోని తృప్తి చూసి అతను విస్మితుడయ్యాడు. ఆమెకు తన నుంచి ఏం కావాలి అన్నది ప్రశ్న! తను బాధపడితే ఆమెకేం? తన సుఖం, శాంతి , స్తిమితం -- వీటిని గురించిన తాపత్రయం ఆమె కెందుకు? తనపై ఆమె చూపే శ్రద్దాసక్తులు నలుగురు పిల్లలు గల ఏ ఇల్లాలి ఇంటి పనులలో చూసినా ఇంతకన్నా మంచి గిట్టుబాటు అవుతుందే! రకరకాల ఆలోచనలు.
    ఈమధ్య మరో రకం ధోరణి మొదలైంది.
    "స్నానం చెయ్యండి! నీళ్ళు చల్లారి పోతున్నాయి."
    "భోజనం చెయ్యండి! వేడిది తింటే ఆరోగ్యం."
    ఇలాంటి హెచ్చరికలు, సలహాలు .    
    కళ్ళు ఎర్రబడితే -- "ఏం టయ్యగారూ, అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదా! అవును మరి! పాపం! ఒంటరితనం- అసలిదేం కర్మ బాబూ!" అంటూ పరాచికాలు.
    ఒకమారు ఒళ్ళు మండిపోయింది.
    "ఏం? నేను నిద్ర పోతేనేం, పోకపోతేనేం? తింటే నీకేం? తినకపోతేనేం? అసలు నన్ను గురించిన గొడవ నీ కెందుకు? నీ డ్యూటీ పని చేసి వెళ్ళటం. అంతేగాని మిగిలిన విషయాల్లో కల్పించుకోకు! జాగ్రత్త -- తెలిసిందా?' అంటూ ఎగిరి పడ్డాడు.
    కాని ఆమె మొహం చూస్తూ అనాలనుకున్నంత దూకుడుగా అనలేక పోయాడు. చెప్పదలుచుకున్నది పూర్తిగా బయటికి రాలేదు. కాని దానికే ఆమె తట్టుకోలేనట్లు కనిపించింది. గభాలున అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళి తన పని చూచుకోసాగింది. ముఖంలోని ఒక నైరాశ్య భావవీచికను అతను స్పష్టంగా గమనించాడు.
    ఆ మరురోజు నుంచి ఆమె చొరవా , స్వతంత్ర్యమూ పూర్తిగా తగ్గించుకుంది.
    కాని, నాలుగు రోజులకే అతనిది భరించలేక పోయాడు. కాని ఒక తృప్తి, 'ఆమెలో నన్ను గురించి ఎలాంటి ఆలోచనలున్నా బహిష్కరించాను. ఆమె స్థితిని ఆమెకు తెలియజేశాను. ఇద్దరి మధ్య ఉండదగిన వాతావరణాన్ని ఆమెకు సూటిగా అర్ధమయేలా ప్రవర్తించాను. ఇంకా ఆమె మారకపోతే అది ఆమె బాధ్యత. ఆమె కర్మ. దానికి తాను చేయగలిగింది లేదు. ఇప్పటికే తనెంతో నిగ్రహం చూపాడు. ఇదే మరొకడైతే -- ఆమె చొరవను మరొక రకంగా ఉపయోగించుకుని దేహ తాపం తీర్చుకుని ఆమెను గాలికి వదిలేసేవాడు. ఇక మీదట తన విషయంలో ఆమె ప్రవర్తన చూసినవారు ఏ రకమైన అభిప్రాయానికి వచ్చినా తను కర్త కాదు. వాటి కధారాలు కల్పించిన బాధ్యత ఆమెదే కనక అందుకు సంబంధించిన కర్మకు ఆమె వారాసురాలవుతుంది."
    ముందు కాస్త భేదపడినా తను చాలా న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించిన తృప్తీ, తద్ధారా కొంత ఓదార్పు లభించాయతనికి.

 

                                 6


    ఏదైనా ఒక విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ పడుకుంటే తప్ప గిరిధారికి నిద్ర పట్టని రాత్రి అంటూ ఉండేది కాదు. ఒకవేళ నిద్ర రాకపోయినా రాత్రితో పాటు తనూ కరిగిపోతున్న అనుభూతిని పొందుతూ హాయి అయిన జాగరణ చేసేవాడు. తెలియకుండానే ఆ అనుభూతి పరాకాష్ట నందుకుని ప్రగడ షుష్టిస్తిగా రూపొందేది.
    కాని, గడిచిన వారం రోజులూ అతని కా హాయి అయిన అనుభూతి గాని, నిద్ర గాని ఇంక లేవని రుజువు చేశాయి.
    నాలుగిళ్ళ అవతల ఉన్న చాకలి పోతరాజుకు ఉన్నట్టుండి రోజులు మారాయి. భార్య పోయి ఆరు నెలలయింది. మళ్ళీ మనువు కట్టుకోమని కులపువాళ్ళెందరూ చెప్పినా వినలేదు. బాగా తాగి వచ్చిన వాడు -- "ఓ, నా రంగీ! నన్ను దిక్కులేని వాడిని చేశావే! నన్ను కూడా పిలుచుకు పోవే" అని రాగాలు తీసేవాడు. అలాంటి వాడు ఒకనాడు తెల్లవారేసరికి చిలకలాంటి చిన్నదాన్ని లేపుకోచ్చాడు. పేరు మంగ. "మంగాలూ" అని ముద్దుగా పిలుచుకునే వాడు. ఆమె తనతో పాటు ఒక గాడిదను కూడా తెచ్చింది. ఇంత పిల్లప్పటి నుంచీ మక్కువగా పెంచు కుంటుందిట. దాన్ని ప్రాణంగా చూసుకుంటుంది. అందుకని పోతరాజు పెళ్ళాం తో పాటు దాన్నీ భరించక తప్పలేదు. మంగ తీరిక సమయాల్లో ఆ గాడిదను రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ గారం చేసేది. ఆ గాడిద శాపం పొందిన రాజకుమారుడిలా ఆమె అనురాగాన్ని పొందటం పోతరాజు చూసి భరించలేక పోయేవాడు. మొగుడైన తన నలా అనునయించనందుకు మండి పడేవాడు. అతనికి రోజూ తాగే అలవాటుండేది. బాగా తాగి అర్ధరాత్రి దాటాక తిప్పన్న పదాలు పాడుకుంటూ వచ్చి చూస్తె సాక్కి నిద్రపోయే మంగాలు, ఆమె నానుకుని పడుకుని "ఎందుకొచ్చావ్ మా దగ్గరికి" అన్నట్టు నెమరేస్తున్న గాడిద కనిపించేవి.
    దానితో తిక్క రేగి పక్కనే ఉన్న దుడ్డు కర్ర తో ఆ గాడిదను నాలుగు పీకేవాడు. దానితో అది ఖరహర ప్రియ అందుకునేది.
    ఉలిక్కిపడి లేస్తూనే -- "నీ చేతులిరగా" అని అరుస్తూ వీధిని పడేది మంగాలు. ఆ పళాన ఆమెను పట్టుకుని నాలుగంటించేవాడు.
    దానితో ఊరూ వాడా ఏకమయ్యేది. అదంతా సర్దుకోవడానికి పక్కా రెండు గంటలు పట్టేది.
    వారం రోజులుగా గిరిధారి వద్దన్నా, కద్దన్నా ఈ ప్రవాహానికి ప్రేక్షకుడు కాకపోయినా శ్రోత కాక తప్పేది కాదు.
    రెండవ వారంలో దానికి మరొకటి. తోడైంది.
    కంఠం వినిపించేటంత దూరంలో గల ఒక ఇంటివారమ్మాయి సంగీత సాధన సరిగ్గా తెల్లవారు జామున మొదలయ్యేది . సా....రి...గా....మా.....అన్న ఆమె ఆరోహణ , అవరోహణ క్రమాలు జంట స్వరాలుగా అభివృద్ధి చెందేసరికి అతను నిద్రకు ముఖం వాచీ పోయాడు. స్వరం మధురమైన]దైనా తియ్యని పాటగా మాత్రమే వినగలరు గానీ, సాధనకు మాత్రం భరించలేరు. అతని అవస్థ అదే!
    ఈ కారణాల వల్ల అతను కస్తూరి కి మరో గది ఎక్కడైనా చూడమని చెప్పాడు.
    "ఏం, బాబూ? మొదట్లో దీన్ని తెగ మెచ్చుకునేవారే! ఇప్పుడే మైంది?' అని అడిగిందామె.
    అతను తన రాత్రి అనుభవాలను వివరంగా చెప్పి, ఇక్కడే ఉంటె నిద్రలేమి వల్ల తనకు కొన్నాళ్ళ కు పిచ్చి ఎక్కి పోగల అవకాశముందని కూడా స్పష్టంగా చెప్పివేశాడు.
    ఆ సంగీత పాటకు లేవరా అని ఆమె క్షణం ఆలోచించింది.
    ఊరిలోకి కొత్తగా ఒక సంగీతం మాష్టారు వచ్చిన మాట నిజమే! ప్రతి సాయంకాలం అయన చాకిరేవు దగ్గరకు షికారు గా వస్తాడని కూడా మంగాలు చెప్పింది. కొందరు అమ్మాయిలకు సంగీతం నేర్పుతున్నాడు కూడా! అయన సన్నగా, బక్క పల్చగా , ఎర్రగా ఉంటాడు. వెనక్కు విరగ దువ్విన ఉంగరాల క్రాపింగు.
    క్రితం సాయంకాలపు సంఘటన గుర్తు వచ్చిందామెకు.
    చీర త్వరగా ఇవ్వలేదని ఆమె 'మంగ' ఇంటికి వెళ్ళింది. పోతరాజు రేవుకు వెళ్ళాడు. మంగ ఇంట్లోనే ఉంది. సంగీతమయ్య గారు పక్కనే కూర్చుని బీడీ తాగుతున్నాడు. ఆమె కేమీ అర్ధం కాలేదు.
    "నేను అయ్యగారి దగ్గర పాట నేరుస్తున్నా, కత్తూరీ! రెండు శరణాలినిపో!" అని, "సెప్పండయ్య గారూ!" అంది మంగ.

 Previous Page Next Page