11
తను రావడానికి వీలుపడదంటూ రఘూ మొదట ఆ ప్రయాణానికి మొగ్గక పోయినా ఇక తను బొంబాయి వెళ్ళడం తో ఎలాగో అక్కణ్నుంచి , అలా. అలా ఇంక ఉద్యోగ రీత్యా వుండి పోవడమే అవుతుంది గనక 'స్టూడెంట్ లైఫ్' ని అనుభవిస్తూ , అందరి స్నేహితుల్తో నూ కలిసి ఆఖరు సారిగా వో మాటు వెళ్లోద్దాం , అనుకుని మళ్లీ ఒప్పుకున్నాడు.
అనుకోకుండా నిర్మల కి వో ముఖ్యమైన ప్రయాణం వచ్చినందునా, నళినీ, మురళీ తిలక్ వారు ముగ్గురూ కూడా ఊళ్లో లేనందునా శ్రమను కోక రాధని కూడా వాళ్ళింటి కొచ్చి తీసు కెళ్లవలసిందని , రఘుతో చెప్పవలసిందిగా పార్వతమ్మ గారికి ఫోన్ చేసింది నిర్మల వూరి కెళ్ళి పోతూ.
జానకి చీకట్నే లేచి రఘుకి ఇవ్వవలసున్నవన్నీ స్వయంగా తనే తయారిస్తే, అవన్నీ నీటుగా బెత్తం సజ్జ లో సర్ది, శంకరయ్య చేత కార్లో పెట్టిస్తూ, 'ఏం వోయి రంగయ్యా? ఈ చిన్నబాబు గారికి ఎక్కడి కన్నా వెళ్ళినప్పుడు భోజనం చెయ్యడమంటే మా చెడ్డ మొహమాటం కానీ, వేళకి సరిగ్గా ఆయనకి ఇచ్చి ఆవిణ్ణి తీసుకోమన్నారని ఆ రాధమ్మ గారుతో గట్టిగా చెప్పేం?' అంది డ్రైవర్ సీటు వేపు చూస్తూ సుధ.
'చిత్తమాండి' అన్నాడు గొంతుక మార్చేసి రఘు.
'ఇదేమిటి?' రంగయ్య తననేప్పుడూ మన్నించడే, మరి ఇప్పుడనగా 'అండి' అని ఎందుకంటున్నాడూ! సందేహంగా మళ్లీ అటు వేపే చూసింది సుధ.
'ఈ అయ్యగారు తిండి తినకపోతే ఈ అమ్మగారి కెందుకో ఇంత బాధ' అంటూ ఇవతలి కొచ్చాడు రఘు. ఇంతలో షెడ్డు తాళం వేసి ' రంగయ్య రావడం తో రఘు మళ్ళీ కార్లో కెళ్లి పోయి రంగయ్య ని ప్రక్కన కూర్చోమని 'టాటా' అని సుధ అంటుంటే బడులుకి తనూ అంటూ, కారు స్టార్టు చేసుకుని వెళ్ళిపోయాడు రఘు. గేటు దాటుతూ తన ఎర్రటి వెనక కళ్ళని ఒక్క మారు మూసి తెరిచి , మలుపు తిరిగి మాయమయింది కారు.
'ఎలాగన్నా రాధ అదృష్ట వంతురాలు .' కారు వేపే చూస్తూ నిల్చునున్న సుధ అంతరంతరాల్లో ఏ మూల్నుంచొ మెదిలిన ఈ మాట, సుధకే తెలవకుండా మెల్లగా ఆమె నోరు గొణిగింది.
దార్లో రాధని కూడా ఎక్కించుకుని కారు కాలేజీ ఆవరణ లో కొచ్చేసరికి.... ఉల్లాస ప్రయాణీకుల్తో నిండిన బస్సు బయల్దేరడానికి సిద్దంగా ఉంది. డిక్కీ లో సామాన్లన్నీ బస్సులో పెట్టి డ్రైవర్ కారు వెనక్కి తీసు కెళ్ళి పొతే రఘూ, రాధ , ఆ తోలి ఝాము వేళా ఒకే కారులోంచి దిగొచ్చి బస్సేక్కడం చూసిన స్నేహ బృందం , బస్సదరిపోయేటట్టు కరఘోష ప్రారంభించారు.
కాలేజీ లో తరచూ జరుగుతూనే వుండే ఈ గందర గోళాల్నీ లక్ష్యం చెయ్యకుండా ముందు వేపు వెళ్లి వో స్నేహితుడి పక్కన చతికలబడ్డాడు, తల మప్లర్ని సరి చేసుకుంటూ రఘు.
'జంట కోసరం తెచ్చుకున్న వార్నలా వదిలేసి మళ్లీ ఈ చుట్టరికం దేనికిరా?' అన్నాడు తను జరిగి చోటిస్తూనే ఆ స్నేహితుడు పద్మనాభం.
మనసులోని భావాన్ని ఏ మాత్రమూ పైకి తోనకనీయకుండా తన స్నేహితురాలు పక్కన వెళ్లి కూర్చుంది రాధ.
దేశీయ గీతాల్తోటీ జేజేల తోటీ దార్లో వారందర్నీ హడాలేత్తించుకుంటూ, ఒక్కొక్క గ్రామాన్నీ వెనక్కి నెట్టుకుంటూ, ఒక్కొక్క బస్తీలోనూ కాస్సే పాగుతూ 'మాచ్ ఖన్ద్' ప్రాజక్టు వేపుకి పరుగెత్తుతుంది వారి బస్సు.
రెండు గంటల ప్రయాణానికి తరవాత విజయనగరం సరిహద్దు దాటి ఒక నిర్ణీత స్థానాన్ని ఆగింది బస్సు. అదివరకే ఏర్పాటు చేసుంచిన ప్రకారం అక్కడందరికీ కాఫీ ఫలహరాలివ్వడం అయ్యాక మళ్లీ బయల్దేరింది . అప్పటి క్కొంత వేలుగోచ్చి నందున దూరాన్న చిన్న చిన్న అర్చిల్లాగా కనిపిస్తున్న రోడ్ల వార్ల నుండే చెట్లు , దగ్గర కొచ్చేసరికే విడిపోతూ వెనక్కి మాయామై పోతుండె ఆ దృశ్యాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తుంది రాధ మరో రెండు గంటల ప్రయాణానికి తరవాత వరి చేల సౌందర్యాన్ని తిలకించేందు గ్గాను వొ చెట్టు నీడని బస్స్టాపించుకుని అంతా కిందికి దిగి ఎవరి కిష్టమైన వేపుకి వారు ఒంటరిగా, జంటలు గానూ, గుంపు లుగానూ , సరదాగా బయల్దేరారు. 'అర్ధగంట కల్లా మళ్లీ అంతా ఒచ్చేయ్యాలి లేకపోతె ఇక్కడే వదిలేసి బస్సు ఉదయించేస్తుంది తరవాత మీ ఇష్టం' అంటూ చేతి బెత్తాన్నూపుతూ హెచ్చరించాడు వారికి పెద్దగా వచ్చిన ఒక లెక్చరరు హాస్యంగా.
కొందరు చింత చెట్టెక్కి కూర్చుని కాయల్ని కిందికి విసురుతుంటే , కింద నున్నవారు పోటీలకు పోయి ఎగిరెగిరి వాట్ల నందు కుంటున్నారు. ఇంకా కొందరు చివర కొమ్మల మీద నిలబడి కొమ్మని ఒంగే టట్టు చేస్తుంటే మిగతా వారా కొమ్మల్నందుకుని ఉయ్యాలూగుతున్నారు. రోడ్డు వార్నకుందుకూర్చుని , రెండు చేతుల్నీ రెండు మోకాళ్ళ మీద నుంచీ ముందుకు చాచుకుని హాయిగా బీడీ కాల్చుకుంటూ కూర్చున్న కండక్టర్, డ్రైవర్ సవిలసంగా వీరి చర్యల్ని చూస్తూ మెల్లగా విమర్శించు కుంటున్నారు. కళ్ళు చికిలించుకుంటూ నోట్లో ఊటని 'ఉస్' అంటూ పైకి పెల్చుకుంటూ ఆ చింతకాయల్ని కొరికి తింటున్న ఆడపిల్లల్ని చూసి, 'కొంత ఉప్పన్నా తెచ్చుకో పోయారూ!' అని మెల్లగా అన్నాడు కండక్టరు. 'ఉస్. వూర్కోరా ఇన్నారంటే పీకల్తేగుతాయి. అందులో అడోరు కూడానూ' అని మందలించాడు డ్రైవరు.
కాయల్ని మెల్లిగా కొరుక్కుంటూ అలా అలా సరదాగా నడిచి వెళ్లిన రాదా, శ్యామలా అక్కడొక కందిచేను విరగ కాసుండడం చూసి అటు నడిచారు. దాని పక్కనే వేరు సెనగ. సంతోషంతో గబగబా నడకా పరుగుగా వెళ్లి , ఆడ్డంగా వున్న నీటి వాగు మీద నుంచి చెంగున ఒక్క గెంతు గెంతి అవతలి కెళ్లి , ఇన్ని కాయలు తెంపి చేతి రుమాచూల్లో కట్టి తెచ్చుకున్నారు.
శ్యామలా సుళువుగా దాటేస్తే, కాళ్ల కి పరికిణా బంధాలు పడ్డందున రాధ ఆ నీళ్ళ లో పడిపోయింది. 'అయ్యో ఇదేమిటే?' అంటూ శ్యామల వెంటనే చెయ్యిచ్చి ఇవతలకి రప్పించింది గాని అసలే వుల్లి పోరలాంటి చీరేమో! అందుకు తోడు తడవడం తో బట్ట వంటి కంటుకు పోయినందున రెండు చేతులూ మోకాళ్ళ కి చుట్టేసుకుని అక్కడే కూర్చుండి పోయింది రాధ.
అటూ ఇటూ తిరిగొస్తున్న రఘు తనూ అక్కడి వార్నడిగి ఇన్ని వెరుసేనక్కాయల్ని రుమాల్లో పోసుకుని బస్సు అరుపు వినడం తోనే పరుగు పరుగున వస్తూ అదృశ్యం చూడ్డం తోనే చెట్ల వెనక్కి వెళ్లి పోయాడు. బస్సు మళ్ళీ కూసింది. వారిద్దరికీ ఒకటే కంగారు.
'ప్లీస్ , కాస్త మీరు రాధకి సాయం వుంటారా నే వెళ్లి దానికి బట్టల్తేస్తా. ఈ పిల్ల కాలవని దాటుతుంటే యధాలాపంగా కాల్జారింది రాధకి' అంది కంగారుగా శ్యామల.
'అబ్బే, మీరే సాయంగా వుండండి-' అన్నాడు తప్పనిసరిగా , రఘు ఆలోచిస్తూనే.'
'అయితే నీ తాళాలీలా ఇవ్వవే...' అంది రాధ నుద్దేశించి శ్యామల.
'అలా వద్దండీ. ఆ పెట్టె ఎటువంటిదో చెపితే తెచ్చిస్తా.'
'బలువవుతుందని చెప్పవే?' మాట మధ్యలోనే అంది రాధ.'
'ఫరవాలేదు. అంటూ ఆ వివరాల్ని కనుక్కుని దబదబా వెళ్ళి ప్లీస్ ఒక్క అయిదు నిమిషాలు వెయిట్ చెయ్యండి అంటూనే ఆ పెట్టె అందుకుని డబ్బున వెనక్కొచ్చిన రఘు, కావలసిన వేవో శ్యామల వచ్చి తీసుకోగానే, 'మీకెందు కండి శ్రమ మేం తెస్తాం .' అని శ్యామలంటున్నా వినిపించుకోకుండా, మీరు త్వరగా రండి అంటూ ఆ పెట్టె పట్టు కెళ్లి మళ్లీ బస్సులో పెట్టేశాడు.