Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 25



    తిగ లాగితే డొంకంతా కదిలినట్టు అటు ఇటు  తిరిగి నీలిమ అదృశ్యమయిన సంఘటనకూ, ఇప్పటి అబ్బులు ఆకస్మిక  మృతికి లింక్  వున్నా ఆశ్చర్యం  పోనవసరంలేడనే కోణంలోనుంచి చూసిన ఆమెకు ఎన్నో....ఎన్నెన్నో అనుమానాలుకలిగాయి.

    రమేష్ మిత్ర బృందమే  కాకుండా లెక్చరర్  సుధాకర్  కూడా అందులో  భాగం వుండి వుండాలని  బలమయిన సాక్ష్యాలు లభించాయి కూడా.

    సుధాకర్ మరదలు రజని ద్వారా ధీరజ ఆ విషయంలో కొంత మేరకు సమాచారం  సేకరించగలిగింది.

    ఏదయినా  వుపయోగం వుంటుందనే వుద్దేశ్యంతోనే రజనిని కావాలని అతని గడికి పంపించింది ధీరజ ఆమె వూహించినట్టుగానే సుధాకర్ కు ఫోన్ వచ్చింది.

    అతనికి ఫోన్ చేసింది వ్తెస్  చాన్స్ లర్....ముకుందరావు దిరజతో ఏదో మాట్లాడాలని  ఫోన్ చేశారు కాబట్టి ఖంగారుగా సుధాకర్ కు ఫోన్ చేశాడాయన.

    తన కొడుకు అనిల్ కండిషన్  బాగోని  సమయంలో  కూడా పొలిసు లకు  ఫోన్ చేసి , పర్సనల్ ఇంట్రస్ట్ మీద ధీరజనీ ముకుందరావు తన బంగాకాకు రప్పించుకోవడం వెనుక ఏ అంతరార్ధమూ లేకపోతే వ్తెస్ చాన్స్ లర్  ఖంగారుపడనవసంలేదు.

    అంటే సందిగ్ ఈజ్ రాంగ్....

    అలాంటప్పుడు సుధాకర్ అర్జెంటుగా ఆయన్ను కలవాలనుకోవడం చూస్తుంటే వీరిద్దరి కలయిక వెనక మిస్టరీ వుందని. ఆ మిస్టరీ  ముకుందరావుకు సంబంధించింది అయివుండాలి అనుకునేకన్నా అనిల్  మిత్ర బృందానికి చెందిన ఏదో రహస్యం అయి వుంటుందని వూహించింది ఇన్స్  పెక్టర్ ధీరజ.

    సో! లెక్చరర్ నీలిమ అదృశ్యం వెనుక వున్న సంఘటనకు సంబంధించి అనుమానితుల జాబితా చాలా వుంది.

    రమేష్ మిత బృందం .... వ్తెస్  చాన్సలర్ ....సుధాకర్....

    ఇప్పటికి  అరుగురయ్యారు.....ఇంకెంతమంది వున్నారో?

    ధీరజ ఆలోచనలలో వుండగానే  ఫోన్ మ్రోగింది.

    అన్యమనస్కంగానే రిసీవర్ తీసింది.

    అవతలనుంచి ఏం వినిపించిందో ఏమికాని  ఒక్కసారిగా ఎక్కడ  లేని ఆనందం  ఆమె మొహంలో ప్రతిఫలించింది.

    "హాయ్ శేఖర్! ఎక్కడనుంచి? అసలు హ్తేదరాబాద్ నుంచి ఎప్పడోచ్చావు నువ్వు...." ప్రశ్న వెంట ప్రశ్న కురిపించింది ధీరజ.

    "ఒకేసారి అన్ని ప్రశ్నలయితే  ఎలాగోయ్....ఎంత ప్రియురాలి వ్తేతే మాత్రం ఏక  కాలంలో ఇన్ని సమాధానాలు రాబట్టాలనుకోవడం అబ్యాయం డియర్...."

    "అబ్బబ్బ!ముందు  అసలు  విషయం చెప్పు-రాత్రి వుండమన్నా వుండకుండా వెళ్ళిపోయావు. ఎక్కడనించి ఫోన్ చేస్తున్నావు?"

    "నీకు చాలా దగ్గరలోనుంచి...."

    "అంటే....?"

    "అదే డియర్! నీకు ఎంతో దగ్గిరలో వుండే మాట్లాడుతున్నాను."

    "శేఖర్! ఏమిటి నువ్వు చెప్పేది?ఈ టౌన్  నుంచేనా?"

    "అలా అని నేను చెప్పానా?"

    "లేదు! కానీ మరి  దగ్గరగా అంటే?" అనుమానంగా ప్రశ్నించింది ధీరజ.

    "ప్రక్కటౌన్ నుంచి  ఎందుకు కాకూడదు?"

    "ఓకే శేఖర్! ఒప్పకుంటాను....తమరు హాస్యమడడం మానేసి అసలు విషయమేమిటో సూటిగా చెప్పండి."

    "దేనిగారికి  చాలా కోపం వచ్చినట్టుంది."

    "నాకు కావలిసింది సమాధానం."

    "ఓకే! చెబుతాను....కానీ ఇలా ఫోన్ లో కాదు."

    "మరెప్పుడు?"

    "దేవిగారి సమక్షంలో విన్నవించుకుంటాను"

    "అదే....ఎప్పడని?" చిరుకోపం ప్రదర్శించిందామే.

    "కాంట్రాక్ట్ పనిమీద  వచ్చాను. ఇప్పుడు ఆ విషయాల డిస్కషన్స్ మీదే వున్నాను. వీలు చూసుకుని సాయంత్రం వస్తాను. కోపాన్నంత మూటకట్టి సిద్దంగా వుంచి, నేను రాగానే ఒక్కసారి సివంగిలా  నామీద కురిపించవచ్చు.....ఏమంటావ్?"

    "అదిసరేలే కానీ.....అబ్బ సాయంత్రంవరకూ అగాల్సిందేనా?"

    "తప్పదు మరి."

    "శేఖర్ ! నీకోసం  ఎదురుచూస్తూండే ఈ పిచ్చిది ఒకటి వుందని గుర్తుంచుకుంటవా అసలు....అప్పడప్పుడు యిదే అనుమానం వస్తుంటుంది."

    "దిరజా....నా మనసు నీకు తెలియదా?"

    "తెలుసు."

    "మరి, అన్ని తెలిసి కూడా ఎందుకో  ఆ అలక...."

    "నీ కోసం ఎదురుచూడంలోనే కాలమంతా గడఛిపోతుంది....తెలుసా?"

    శేఖర్ నుంచి  మౌనమే సమాధానంగా వచ్చింది.

    "ఓకే శేఖర్! మనలో మనకు కోపతాపాలెందుకు కానీ.....నీకోసం ప్రతిక్షణం ఎదురుచూస్తుంటాననే విషయం  మరచిపోకు."

    "అలాగే! మరి వుండనా....."

    "ఊ.....!"

    శేఖర్ ఫోన్ పెట్టేశాడు.

    ఇష్టపడిన మనోవల్ల భుడు ఏ తేంచాడన్న ఆనందమో.....లేక కొద్ది పెప్తేనా టెన్షన్  నుంచి  దూరంగా వుందగాలిగేది  కేవలం శేఖర్  సమక్షంలోనే అన్న నిజం వూహించడంవల్లనో ......ధీరజ చాలా సేపటివరకూ ఏ పని చేయలేకపోయింది.

    కానీ.....

    అక్కడ, శేఖర్ ఫోన్ పెట్టిన వెంటనే తన ఎదురుగావున్న వ్యక్తి వ్తెపు తమాషాగా  చూశాడ.

    అతను ఇండస్టి యలిస్ట్  ముకుందరావు.

 Previous Page Next Page