Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 22

                                 


                                     9
    'నా సుధేనా ఈ మాట్లాడుతున్నది ?' అనుకుని ఆశ్చర్య పోయాడు రఘు. ప్రపంచ జ్ఞానం ఇంకా సరిగ్గా కల్గలేదని తను అనుకుంటుండే ఆ సుధ హృదయంలో ఇంతింత గంభీరమైన భావాల్ని పదిలపరచ బడున్నండుకు నివ్వెర పోతూ--
    'పోనీ నీ తత్వాన్ని బట్టే ముందు మాట్లాడుకుందాం మరి. ఈ భావంతో వున్న నువ్వు నీ భవిష్యత్తు ని ఏవిధంగా నడిపించుకుందుకు నిశ్చయించావ్?' అన్నాడు కొంతసేపు నిశ్శబ్ధాని కి తరవాత రఘు.
    'చెప్పగా, నా నుంచి ఎవ్వరికీ ఇబ్బంది కల్గకుండా నా తాహతు కి తగినంత లో ఇముడ్చు కోగలననీ.'
    'సరి, అయితే, నా ముందు జీవితాన్ని గురించి?'
    'అది నువ్వు నిర్ణయించు కోవలసిన విషయం బావా' నేర్పుగా బదులిచ్చింది సుధ.
    'అయితే నా భవిష్యత్తు ని గురించి నీ కాలోచనే లేదన్నమాట.'
    'అదేం మాట బావా. నేను ఒక రోజులో ఎక్కువ కాలాన్ని ఎవరి గురించి అలోచిస్తానూ అంటే, అది నీ గురించే!- చెప్పానుగా ఒక అపూర్వ సుందరిని-'
    'రాదని చేసుకోవచ్చా!...' అనుకోకుండా ఎలా వచ్చిందో, అతని నోటి వెంట వచ్చేసిందా పేరు.
    'రాధనా?' నాన్చింది సుధ.
    'ఏం, నువ్వు ఊహించే చక్కదనం ఆవిడలో ఉందేమోనే?'
    'ఉంది గాని అంతరంగిక సౌందర్యం బాగా లోపిస్తుందేమోనని నా కనుమానం అనిపిస్తూ వుంటుంది బావా. అందువల్ల ఆవిడతో నీ జీవితం అంత సుఖంగా సాగదేమోనని నా భయం.' అంటూ తలెత్తి రఘు వేపు చూసిన సుధ  'ఒకవేళ నువ్వావిడ్నే చేసుకుందుకు నిశ్చయించి గనక వుంటే, నన్ను క్షమించు బావా' అంది అతని తీరును చూశాక మళ్లీ    'అబ్బే, నీ అభిప్రాయం ఒకవేళ అలా వుందేమో' నని అడిగా నంతే' అంటూ కాస్త ఆగి ఆలోచించుకుని '..పోనీ నీకు తగ్గట్టు నిర్ణయించు కున్న ఆ నిర్ణయాలేవో నాకు చెప్పకూడదా సుధా' అన్నాడు రోషంగా.
    'నీతో చెప్పకూడని మాటంటూ నా కెప్పుడూ లేదు బావా'
    'మరి చెప్పు నీ భవిష్యత్తు--'
    'హు. అంటే నువ్వు బాధపడతా వేమోనని ఇంతవరకూ నీతో అనలేదు గాని నాకు భవిష్యత్తంటూ గొప్పగా ఏం వుంది బావా, ఏదో మనిషిగా పుట్టినందుకు దైవం నాకిచ్చిన ఆయుర్దాయం ఉన్నంత వరకూ-'
    'సుధా?' మందలించాడు రఘు.
    'ఇందుకే బావా నే చెప్పనన్నదీ!'
    'జీవితం మీద నీకింత నిస్పృహ దేనికి సుధా' లాలనగా అడిగాడు మళ్లీ.
    'నిస్పృహ కాకుండా ఏం వుంది చెప్పు బావా , నా జన్మ నాకే అవమానంగా వుంటుందంటే ఇక నన్ను గురించి బంధువులకి మాత్రం తలవంపులు కాదూ, అయినా మాత్రం ఏం చెయ్యడం బావా ఎన్ని ఎవగింపులు పడైనా జీవితాన్ని సాగించి తీరాల్సిందే కదా.'
    'సుధా, ఈ ఇంట్లో నాకు తెలిసున్నంత వరకూ నీ మనసు కలా తోచెటటువంటి పొరపాటు ఎప్పుడూ ఎవ్వరూ చెయ్యలేదే' అంతవరకూ బాధగా కళ్ళు మూసుకున్న రఘు అన్నాడు.
    'లేదు బావా- అలాంటి లోపం నా కెన్నడూ, ఎప్పుడూ చెయ్యలేదు. అయినా ఎల్లకాలం ఇలాగే వెళుతుందన్న నిజమేమిటి బావా, ముందు ముందు ఎన్నెన్నో మార్పులు రావచ్చు.'
    'నీ బాధ నా కిప్పుడర్ధమయింది సుధా! ఇక మీద నాకూ వేణు కీ , పెళ్లిళయితే వాళ్ళిద్దరూ నిన్ను లోకువ చేస్తారేమో నన్న భయం నీకు బాగా వున్నదనుకుంటా, అంతేనా' అన్నాడు రఘు.
    'నువ్వు ఊహించినది కొంతవరకు నిజమే గాని, నా భయాని క్కారణం మాత్రం అది కాదు. ఒకవేళ వారు నన్నలా చులకన చేసినా, అవన్నీ నేనులేక్క చెయ్యను కూడా, అయితే--'
    'చెప్పు సుధా' హెచ్చరించాడు రఘు,
    'ఇప్పుడు కాదు ఎన్నాళ్ళ బట్టో నీతో ఈ విషయాన్ని గురించి చెప్పి నా కోరిక చెల్లించవలసిందిగా అర్ధించాలనే నా ప్రయత్నం కూడా బావా? అయితే నా మనసులోని బాధ నీ కర్ధమయ్యేటట్టు ఎలా చెప్పాలో , అది తెలియడం లేదు.' ఎటో చూస్తూ దిగులుగా అంది సుధ సుధ గొంతుక వణకడాన్ని ఆ హృదయం పడుతున్న యాతనని గ్రహించిన రఘు, అతని హృదయం కూడా మరొక విధంగా బాధపడసాగింది. 'ఇన్నాళ్ళ బట్టీ తను 'లక్ష్యమా?' 'సౌఖ్యమా' ఈ రెండిట్లో ఏది తనకి ముఖ్యమైనదో తేల్చుకోలేక సతమతమౌతున్న ఆ సమస్యకి పరిష్కారంగా వుండదు గదా సుధ కోరిన యే కోరికా!'
    'నీ కభ్యంతరం లేకపోతె, నిన్ను చూసుకుంటూ నీ సాన్నిధ్యం లోనే నా కాలాన్నంతా వెళ్ళబుచ్చెటట్టుగా వరం ప్రసాదించు బావా' ఇదే నా కోరిక. కింద చతికిల బడి కూర్చున్న సుధ , పడక్కుర్చీ లో కూర్చున్న రఘు వళ్ళో తన మొహం దాచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
    'సుధా! సుధా? అబ్బ ఏవిటీ బేలతనం సుధా.' అంటూ ఆప్యాయంగా సుధ తల నిమిరి, లేవదీసి సరిగ్గా కూర్చో పెట్టాడు రఘు.
    'నీకా భయం ఎప్పుడూ వద్దు సుధా . నా సాన్నిధ్యం లో మాత్రం ఏమిటి నా హృదయం లోనే శాశ్వతంగా నీకు స్థానం వుంది' అని సుధని ఊరడించాలని అతని మనసు తహతహ పడింది. అయితే, ఇందుకు పూర్తిగా వ్యతిరేకానికి ఈడ్చే టట్టున్న తన పరిసరి పరిస్థితులూ, తరచు దిగజారెందుకు చూస్తున్న తన మనో నిబ్బరం పట్ల అలజడి తో తన స్తిరత్వం మీద తనకే నమ్మకం లేనందున , తొందరగా ఇలా మాటివ్వడం ఉభయత్రా తరవాత ఇబ్బందులకి కారణం అవుతుందేమోననుకుని దూరాలోచన గల రఘు అలా తొందర పడలేదు.
    'అబ్బ నా స్వార్ధం కోసరం నిన్ను నొప్పించినట్టున్నాను' అంది మొహం కళ్ళూ తుడుచుకుంటూ.
    'లేదు. నువ్వు బాధపడకు సుధా. నేనింత దీక్షగా ఈ పరిశోధన్లని జరుపుతున్నానూ అంటే, అది నిన్ను అందరి వంటిదాని గానూ చేసి, నీ భవిష్యత్తూ అందరి లాగా హాయిగా జరిగేలా చెయ్యాలన్న పట్టుదల వల్ల తప్ప మరో కారణం లేదు సుధా. అంతేకాదు నిన్ను దృష్టి లో వుంచుకుని నే ప్రారంభించిన ఈ పరిశోధన వల్ల నీ విషయం లో సంతృప్తి కల్గిందంటేనే ప్రజాక్షేమం కోరి ఈ పరిశోధన్ల నింకా పైకి సాగిస్తాను. లేదంటే నా ఉత్సాహం నా ప్రయత్నం ఇంతటితో సరి. తెలిసిందా అందువల్ల నాకు వీలైనంత వరకూ నీకే విధమైన లోపమూ రానివ్వను' అని మాత్రం అన్నాడు రఘు తన జేబు రుమాల్తో సుధ కన్నీరు తుడుస్తూ.
    'ఈ ఆదరం నాకు చాలు బావా, ఏదో కట్టు తెంచుకు వచ్చేసింది బాధ' అంది వెనక్కు జరిగి ఎప్పట్లా కూర్చుంటూ సుధ.
    'మంచిదే సుధా. ఈ నిమిత్తంగా ఒకరి అభిప్రాయం ఇంకొకరు తెల్సుకో గల్గాం' ఇద్దరి మనసూ కొంత తేలికపడ్డట్టయి రఘు ఎప్పట్లా పుస్తకం చదవడం లో నిమగ్నుడైతే సుధ మళ్లీ అల్లికలోకి మనసు మళ్ళించింది.

                             
    ఈలోగా బయటి కెళ్ళిన వారంతా తిరిగొచ్చేశారు. అంతా ఆ పెళ్లి విషయాల్ని ముచ్చటించుకుంటుంటే శాంత మాత్రం సుధ మొహాన్ని సూటిగా చూస్తూ పై కెళ్లి పోయింది.
    'మా సుధ నోట్లో వేలుపడితే కరవడం కూడా తెలియదంటూ అస్తమానం నాతొ వాదిస్తుంటారే . చూశారా?' అంది రాత్రి భర్తతో హాస్యంగా శాంత.
    'ఏం? నీ వేలు గాని కరిచిందా?... భార్య అందించిన కిల్లి ని నోట్లో పడేసుకుంటూ హాస్యంగా అన్నాడు రామం. తను కూడా.
    'నా వేలు కొరికితే ఆ పిల్ల కేం లాభం గనక. అందుకే కొరకవలసిన వారి వేలే కోరికుంటుంది.' అంది సావకాశంగా మంచం మీద కూర్చుంటూ.
    శాంత ఎవర్ని మనసులో వుంచుకుని ఇలా అంటుందో గ్రహించిన రామం ఏమీ బదులివ్వ కుండా ఊరుకున్నాడు.
    'అయినా చంద్రుణ్ణి పీడించే రాహుకేతువుల్లాగ మన రఘు ప్రాణానికీ ఈ కుంటి దెక్కడ దాపురించిందండీ.'
    'శాంతా' మాట మధ్యనే గద్దించాడు రామం.
    'వో యమ్మో ఆ అభిమానపు మేనమరదల్ననేసరికి రోషం వచ్చింది గావల్ను పాపం' ఈర్ష్యగా అంది శాంత    'లేకపోతె కుంటిదీ అనొద్దని నీకిది వరకు ఎన్నిసార్లు చెప్పలేదూ, పైగా ఉపమానాలు కూడానా. ఈ చదువు సంధ్య ల్లేని తెలివికి నోరు మూసుకూర్కోక' చీదరించుకున్నాడు రామం.
    'ఆ! చీటికీ మాటికీ ఈ చదువు రాని తనాన్ని దేప్పొద్దని నేనూ ఎన్నిమార్లో చెప్పాను మీకు.'
    'లేకపోతె మా పాలిటి మహాలక్ష్మీ గా వచ్చిన సుధని దుష్ట గ్రహల్తో పోల్చడవేమిటీ నువ్వూ.'
    ;అబ్బా అంత మహాలక్ష్మే అయితే మీ ఇంటి కోడలిగానే చేసేసుకోరాదూ.'
    'తప్పకుండానూ . అయితే ఆ నిశ్చయానికి రావలసిన వాడు మా రఘు కాని నేకాదుగా.'
    'ఆహా , మీరే గనకైతే తప్పకుండా చేసుకునే వుండేవారన్న మాటే.'
    'మహారాజులాగ. ఏం ఏదో కాస్త రూపం తప్ప మిగతా అన్నీ లోపాలే అయిన వాళ్ళతోనే సర్దుకు పోతున్న వాణ్ణి, కాస్త రూపంలో తప్ప మిగతా ఏ లోపమూ లేని వాళ్లతో ఎందుకు సర్దుకోలేనూ' శాంత వేపు కొంటె తనంగా చూస్తూ అన్నాడు.
    'సరే. పాపం మీకెలాగో చేయి దాటిపోయింది గనక నేనిప్పుడు చెప్పేది మీ తమ్ముడు గారి మాటే' అంది మళ్లీ అసలు కధలోకోస్తూ.
    'ఏమో. ఒకవేళలా చేసుకున్నా చేసుకుంటాడెమో . వాడు గనక నిజంగా అలా చెయ్యగల్గాడంటే అందుకు నేనెంతన్నా అభినందిస్తాను.'
    'చాల్లెండి. ఒకవేళ తనా ఉద్దేశంతో వుంటే కూడా వారించడం పోయి అభినందిస్తారుట అభినందనలు. చక్కగా ఆ రాదనే అమ్మాయిని చేసుకుంటే ఎంత పొంతనగా వుంటుందీ.'
    'ఆ ఆ రాదనీ నిన్నూ విగ్రహాల్లా చూసుకుంటూ మా పిన్నీ చిన్నాన్నా మేమూ ఎల్లకాలం అరాదించుకుంటూ వుండొచ్చు. 'అదేం ఖర్మో ప్రపంచమంతా ఒక దోవైతే మీ కుటుంబం లో వాళ్లది మాత్రం మరో దోవ. అంతా అందమైన వాళ్ళ కోసరం పాకులాడితే మీ ఇంట్లో ఆ అందాన్నంతా ద్వేషిస్తారు. హు మనుషుల్లో రసికత్వమంటూ వుంటేగా కొంచేమన్నానూ' విసుక్కుంది శాంత    'అలాగంటే నేనొప్పుకోను. మాకు కావలసినంత రసికత్వం వుంది. అయితే మా రసికత్వమంతా స్థిరంగానూ న్యాయంగానూ ఉండే అంతరంగ సౌందర్యం మీద మాత్రమే' గొప్పగా మొహం పెడుతూ అన్నాడు రామం.
    'ఏమిటో ఆ అంతరంగ సౌందర్యాలంటే మూతి విరుస్తూ నిరసనగా అంది శాంత.
    'అవా. ఉన్నతమైన ఆలోచనలూ ఉదారాభావాలు --'
    'ఆ అర్ధమాల్న మాటల్తో చెప్పకపొతే మామూలుగా చెప్పరాదూ.'
    'ఇవన్నీ విడమరిచి చెప్పినా ఒకేసారి నీ కర్ధమై పోవు శాంతా. ఇటువంటి వన్నీ కొంత అనుభవం మీదా, కొంత లోకజ్ఞానం వల్లా, విద్యాజ్ఞానం వల్లా, స్వతహా మొదట్నుంచీ రావాలి ఒకే మాటు. పట్టుబడేవి కాదు. రఘు చిన్నవాడూ లోకజ్ఞానం తెలియని వాడు కాదు సరి కదా, మా అందరి కన్నా దూరదృష్టి కలవాడు కూడా తెలిసిందా.'
    'అవచ్చు అయినా మీరంతా ఆ పిల్లని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంటే తనూ ఏదో గొప్పగా అనుకుంటున్నాడు ఇంతకీ. ఏదో తిండికి చేరిన-----'

 Previous Page Next Page