సురేష్ తోపాటు తనూ దిగాలుపడి కూర్చుండిపోయింది.
కోపం, నిరాశ, నిస్పృహ, చిరాకు, దుఃఖం, నవ్వూ.......హఠాత్తుగా లైట్లుపోయినయ్.
"ఏమయింది?" అడిగిందామె.
అప్పటికే అతని చేతులు కొండచిలవల్లా చుట్టుకుంటున్నాయ్.
"సురేష్?" పోరాటం ప్రారంభమయింది.
"ఏమిటి? ఎనీ హెల్ప్?" ఏమీతెలీనట్లు అడిగాడు.
"రేపు నువ్వు హోటల్లో జాబ్ కి వెళ్ళబోతున్నావ్....అందుకే పెందలాడే నిద్రపోతే....."
"అంతేకాదు, రేపే నువ్ కూడా ఊరెళ్ళిపోతున్నావ్.....అందుకే నిద్రపోగూడదనీ....."
తులసి విశ్వప్రయత్నం చేస్తోంది తప్పించుకోటానికి.
"నువ్వసలు ఎప్పటికయినా సీరియస్ గా ఉండగలవా?"
"ఇప్పుడు సీరియస్ నెస్ చాలదంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తాను.....ఇవ్వాళ్టినుంచీ....." మళ్ళీ కొండచిలువనుంచీ తప్పించుకోడానికి రెండు నిమిషాలు పట్టింది.
"నిన్ను దేముడు కూడా మార్చలేడు."
చటుక్కున టాపిక్ అందుకున్నాడు.
"భగవంతునికి రూపంలేదు. దేవుడు సర్వాంతర్యామి. ఎదుటివ్యక్తిలోని దేముడిని వెతకటమే నా జీవిత ధ్యేయం. ఆ ఎదుటి వ్యక్తి కేవలం స్త్రీ అవటం నాకు దురదృష్టం."
ఆమెకు నవ్వాగలేదు.
"మరి......సెర్చ్ ప్రారంభించనా?"
ఆమె చేతులు అడ్డుపడుతూనే ఉన్నాయ్.
"హోప్ లెస్ ఫెలో...." పట్టు సడలిపోటానికి సంకేతం.
"హోప్ ఫుల్లీ హోప్ లెస్ ఫెలో......" సగం ఆక్రమణ జరిగిపోయింది.
"యూ ఆర్ ఏ సెక్స్ మానియాక్."
"సెక్స్ అనేది జాయింట్ గా ఓపెన్ చేసిన సేవింగ్స్ బాంక్ ఎకౌంట్ లాంటిది. ఇద్దరిలో ఎవరు విత్ డ్రా చేసినా" ఇంట్రెస్ట్" పోతుంది."
ఆమె నవ్వుతున్న సమయంలో ఎగ్రెషన్ పూర్తయింది.
"ఛీ! నీ కంటే పాకిస్తాన్ నయం! ఇంత తరచుగా ఎగ్రెషన్ జరపదు...." బాగా తెల్లారాకగానీ మెలకువ రాలేదు.
కళ్ళు తెరవగానే కిటికీలోంచి గంగాభవాని కళ్ళు కనిపించినయ్.
"ఎక్కడో ఉద్యోగం వచ్చిందన్నారుగా! ఇంకా లేవకుండా పడుకున్నారేమిటా అని....." సమర్ధించుకుంటూ అంది.
తులసి ఛటుక్కున లేచి దుప్పటి కప్పుకుని పరిగెత్తింది.
"నాకంటే మీకే ఎక్కువ ఆసక్తిగా వున్నట్లుంది?" కసిగా అన్నాడు.
"ఎందుకుండదు? ఈ సారి ఇంకేరకంగా ముఖం చెక్కించుకొస్తావోనని...." వెటకారం.
"ఎప్పటికప్పుడు కొత్తమనిషిలా కనబడితే మీకేగా లాభం!"
నాకేమిటి లాభం?"
"అబద్దాలు చెప్పకండి! ఎంతకాదని బుకాయించినా కొత్తవ్యవహారం కొత్త వ్యవహారమే....."
ఆమె రివ్వున వెనుదిరిగి వెళ్ళిపోయింది.
హోటల్ చేరుకునేసరికి పదవుతోంది.
పర్సనల్ మేనేజర్ ఇంటర్ వ్యూ ప్రారంభించాడు.
"మనహోటల్ కి ఫారిన్ టూరిస్ట్ లు కూడా వస్తూంటారు. వాళ్ళనుప్రత్యేకంగా రిసీవ్ చేసుకోవాల్సి వుంటుంది."
"బిల్లువేయటంలో కూడా ప్రత్యేకత చూపిస్తాను"
"ఎలా?" కుతూహలంగా అడిగాడు.
"ఒక్క ఆమ్లెట్ కి వందరూపాయలు ఛార్జీచేస్తాను"
"అదేమిటి? కోడిగుడ్ల కొరత ఏమీలేదుగా మనకి!"
"కోడిగుడ్లకొరతలేదుగాని ఫారిన్ టూరిస్ట్ ల కొరత ఎక్కువకదా."
"రాత్రుళ్ళు లేడీ రిసిప్షినిస్ట్స్ తోమన కస్టమర్స్ కొంచెం అతిగా ప్రవర్తించే అవకాశం వుంటుందివాళ్ళను నొప్పించకుండా మానేజ్ చేయాలి...."
"మీకసలు సమస్యే రాకుండా చేస్తాను"
"ఎలా?"
"నేను ఉన్నప్పుడు నేనే అతిగా ప్రవర్తిస్తుంటాను గనుక కస్టమర్స్ కి ఛాన్స్ వుండదు"
అతను నవ్వాడు కొంచెంగా.
"నువ్ మహేష్ కాండిడేట్ వి కాబట్టి ఈ జాబ్నీకు దొరుకుతోంది తెలుసా?"
"తెలుసు....."
"మహేష్ ఈజ్ మై 'మిసెస్' స్ బెస్ట్ ఫ్రెండ్."
"అంటే మీ మిసెస్ తో కూడా ఎఫైర్ నడిపిస్తున్నాడా?"
అతను అదిరిపడి అంతలోనే నవ్వేశాడు.
"అతనాటైప్ కాదులే! కానీ సమ్ హౌ చాలామంది లేడీస్ అతనిని లైక్ చేస్తూంటారు. మరి అతని పొయిట్రీలో ఏం గ్లామర్ ఉందో నాకింతకూడా అర్ధం కావటం లేదు."
"దానిక్కారణంనాకు తెలుసు."
"ఏమిటది?"
"తమకుఅపాయం లేని వాళ్ళను ఆడవాళ్ళుఎక్కువ లైక్ చేస్తుంటారు....." అతను విరగబడి నవ్వాడు. నవ్వుతూ సురేష్ భుజంవిరిగేట్లు చరిచాడు గట్టిగా.
"యూ ఆర్ కరెక్ట్! అయినాగానీ నేనీ రచయితలనూ, పొయిట్స్ నీ నమ్మను."
"ఎందుకు?"
"నేను ఉద్యోగం కోసం తిరిగే రోజుల్లో కొంతకాలం రచయితగా వున్నాను. ఆ రోజుల్లో చాలా వెధవ్వేషాలేశాను."
"హాహా! తెలుసు......తెలుసు....." నవ్వాడు సురేష్.
"ఏం తెలుసు?"
"మీరూ ఇంకో గేయరచయితా కలసి ఒక ఎడిటర్ గారిగాళ్ ఫ్రెండ్ కి అబద్దాలు చెప్పి గండిపేటతీసుకెళ్ళారు."
అతని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది.
"నీకెలా తెలుసా విషయం?"
"మీ పక్క కాటేజ్ లో వున్నది నేనే!"
అతను బాంబ్ పడ్డట్లు ఉలిక్కిపడ్డాడు.
ఎవరు ఆ గడ్డం కాసినోవా?"
"యస్!"
అతను అమాంతం లేచి సురేష్ కాలర్ పట్టుకున్నాడు.